»   » షూటింగ్‌ లో కూలిన విమానం...ఇద్దరు మృతి

షూటింగ్‌ లో కూలిన విమానం...ఇద్దరు మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ ‌: అన్ని జాగ్రత్తలూ తీసుకునే షూటింగ్ లు జరుపుతూంటారు. అయితే అనుకోని ప్రమాదాలు ఒక్కోసారి చోటు చేసుకుంటూయి. ఇలాంటిదే తాజాగా ఓ ప్రమాదం ఊహించని విధంగా జరిగి ... ఇద్దరు ప్రాణాలు తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఓ హాలీవుడ్‌ సినిమా చిత్రీకరణ సమయంలో షూటింగ్‌ చేస్తున్న విమానం కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్‌ సహా ఇద్దరు మృతిచెందారు. ఈ విషయమై ధర్యాప్తు జరుగుతోంది.

Tom Cruise movie crew members in plane crash that kills 2 in Colombia

దక్షిణ అమెరికాలోని కొలంబియా పౌరవిమానయాన శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రముఖ హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూయిస్‌ నటిస్తున్న మెనా చిత్ర షూటింగ్‌ సమయంలో ఏరియల్‌ ఫుటేజ్‌లు తీస్తున్న విమానం ప్రమాదవశాత్తు కూలిపోయింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ ప్రమాదంలో పైలట్‌, చిత్ర బృందంలో పనిచేసే వ్యక్తి మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

ఈ విషయమై అమెరికన్ న్యూస్ ఏజన్సీ ప్రసారం చేసిన న్యూస్ ని ఇక్కడ చూడండి

English summary
Actor Tom Cruise flew in a helicopter across the Colombian Andes just 10 minutes before a small plane on the same dangerous flight path crashed into a jungled mountain, killing two crew members from his upcoming movie, civil aviation authorities said.
Please Wait while comments are loading...