»   » ఆస్కార్ బరిలో బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కించుకున్న టామ్ హుపర్

ఆస్కార్ బరిలో బెస్ట్ డైరెక్టర్ అవార్డు దక్కించుకున్న టామ్ హుపర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనుకున్న విధంగానే బెస్ట్ డైరెక్టర్ అవార్డు ద కింగ్స్ స్పీచ్ సినిమా డైరెక్టర్ అయినటువంటి టామ్ హుపర్ కైవసం చేసుకున్నారు. టాప్ హుపర్ ద కింగ్స్ స్పీచ్ సినిమాకుగాను పన్నెండు నామినేషన్స్‌లో ఎంపిక కావడం జరిగింది. ఈసారి ఆస్కార్ బరిలో హాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్ అయినటువంటి కోయిన్ బ్రదర్స్, డేవిడ్ ఫించర్, డేవిడ్ ఓ రస్సెల్, డార్రెన్ ఆరోనోఫ్స్కీ లాంటి మహా మేధావులు బెస్ట్ డైరెక్టర్ అవార్డుకి పోటీ పడగా చివరకు ఆ అవార్డు టామ్ హుపర్‌నే వరించింది.

ఇక టామ్ హుపర్ విషయానికి వస్తే ద కింగ్స్ స్పీచ్ సినిమా డైరెక్ట్ చేయడానికి ముందు ద డామ్నడ్ యునైడెట్ అనే మంచి కళాత్మకమైనటువంటి సినిమాని రూపోందించారు. ఇది మాత్రమే కాకుండా ఈసంవత్సరం బ్రిటీష్ గతవైభవాన్ని కన్నులకు కట్టినట్లు చూపించేటటువంటి డ్రామా 'ద కింగ్స్ స్పీచ్' సినిమా ఈసంవత్సరం అవార్డుల మోత మ్రోగిస్తుంది. బ్రిటిష్ అవార్డుల కార్యక్రమం అయినటువంటి 'బాప్టాస్' ఈసంవత్సరం ఏకంగా ఈసినిమా ఏడు బాప్టాస్ అవార్డులను సోంతం చేసుకుంది. ముఖ్యంగా ఈసినిమాలో హీరోగా నటించినటువంటి కోలిన్ ఫిర్త్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. అదే విధంగా ఈసినిమాలో నటించినటువంటి బాన్హామ్ కార్టర్ కు బెసర్ట్ సపోర్టింగ్ యాక్టరస్ అవార్డు, గోఫ్పరీ రష్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు లభించింది.

English summary
Tom Hooper has grabbed best director award at the Oscars for ‘The King's Speech.Hooper was one of 12 Academy Award nominations for ‘The King's Speech,’ and was up against major Hollywood heavyweights – the Coen brothers, David Fincher, David O Russell and Darren Aronofsky, reports the Guardian.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu