»   » 2015 - టాప్ 10 : ఎక్కువ పైరసీ అయిన సినిమాల లిస్ట్

2015 - టాప్ 10 : ఎక్కువ పైరసీ అయిన సినిమాల లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : టెక్నాలజీ సినిమాల నిర్మాణానికి, క్రియేటివిటీకు ఎంతలా ఉపయోగపడుతోందో కానీ... రోజురోజుకీ పెరుగుతున్న సినీ పరిశ్రమకు మాత్రం పైరసీ పెనుభూతంలా మారింది. దీనిని ఎలాగైనా ఆపాలాని కట్టడి చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఫలితం మాత్రం ఆశించినంతగా రావడంలేదు.

ఈ పైరసీ కష్టాలకు తెలుగు,తమిళ, మళయాళం, హిందీ అంటూ మన దేశ చిత్రాలకి మాత్రమే కాదు. హాలీవుడ్ ని ఈ పైరసీ భూతం ఓ రేంజిలో భయపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ల వర్షం కురిపించిన ఎన్నో హాలీవుడ్‌ చిత్రాలు కూడా పైరేటెడ్‌ అయ్యాయంటే ఆ ప్రభావం సినిమాలపై ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అలా ఈ ఏడాది అత్యధికంగా పైరసీ బారిన పడిన చిత్రం ఇంటర్‌స్టెల్లార్‌. ఈ సినిమాను అక్రమంగా 46 మిలియన్ల డౌన్‌లోడ్‌లు చేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఎక్సిపియో అనే ట్రాకింగ్‌ ఏజెన్సీ పైరేటెడ్‌ చిత్రాలపై నివేదిక రూపొందించింది. ఏయో చిత్రాలు ఎంతెంత పైరేట్ అయ్యోయో తేలుతోంది. ఆ లిస్ట్ మీకు అందిస్తున్నాం.

హాలీవుడ్‌లో అత్యధికంగా పైరసీ బారిన పడి తొలి పది చిత్రాల వివరాలు ఇలా..

ఇంటర్‌స్టెల్లార్‌

ఇంటర్‌స్టెల్లార్‌

హాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నొలాన్‌ తెరకెక్కించిన చిత్రం ఇంటర్‌స్టెల్లార్‌ మోస్ట్‌ పైరేటెడ్‌ జాబితాలో 46,762,310 డౌన్ లోడ్స్ తో తొలిస్థానంలో ఉంది.

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌

ఆ తర్వాత ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ ఏడో సిరీస్‌ 44,794,877 అక్రమ డౌన్‌లోడ్లతో రెండో స్థానంలో ఉంది.

అవెంజర్స్‌

అవెంజర్స్‌


సంచనలనం సృష్టించిన 41,594,159 అక్రమ డౌన్‌లోడ్లతో మూడో స్థానంలో ఉంది.

జురాసిక్‌ వరల్డ్‌

జురాసిక్‌ వరల్డ్‌


మంచి క్రేజ్ తెచ్చుకుని పిల్లలను పెద్దలను ఆకర్షించిన రాకాశబల్లుల చిత్రం 36,881,763 అక్రమ డౌన్‌లోడ్లతో నాలుగో స్దానం ఆక్రమించింది.

మ్యాడ్‌ మాక్స్‌: ఫ్యూరీ రోడ్‌

మ్యాడ్‌ మాక్స్‌: ఫ్యూరీ రోడ్‌


ఈ సినిమా కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకేనేమో డౌన్ లోడ్స్ లో కూడా 36,443,244 డౌన్ లోడ్ అయ్యి ఐదో ప్లేస్ ఆక్రమించింది.

అమెరికన్‌ స్పిన్నర్‌

అమెరికన్‌ స్పిన్నర్‌


రిలీజ్ కు మంచి పాపులరాలటీ సంపాదించుకున్న ఈ చిత్రాన్ని 33,953,737 మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

ఫిఫ్టీ షేడ్స్‌ ఆఫ్‌ గ్రే

ఫిఫ్టీ షేడ్స్‌ ఆఫ్‌ గ్రే

ఈ చిత్రం గురించి వినని హాలీవుడ్ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమాని 32,126,827 మంది అక్రమంగా డౌన్ లోడ్ చేసుకున్నాయి.

ది హాబిట్‌

ది హాబిట్‌

ఈ సినిమా గురించి చాలా కాలం సినీ ప్రియులు ఎదురుచూసారు. రిలీజ్ కాగనే ఓపినింగ్స్ తో అదిరిపోయింది. ఈ సినిమా 31,574,872 అక్రమ డౌన్ లోడ్స్ అయ్యాయి.

టర్మినేటర్‌ జెనిసిస్‌

టర్మినేటర్‌ జెనిసిస్‌

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా...తమ అభిమాన హీరో సినిమాని 31,001,480 మంది పైగా అక్రమంగా డౌన్ లోడ్ చేసుకుని చూసారు.

ది సీక్రెట్‌ సర్వీస్‌

ది సీక్రెట్‌ సర్వీస్‌


లాస్ట్ బట్ వన్ గా ఈ సినిమా హాలీవుడ్ లో రిలీజ్ కు ముందు...రిలీజ్ అయ్యాక ఓ వర్గాన్ని బాగా ఆకర్షించింది. అందుకే టాప్ డౌన్ లోడ్స్ లో పదవ ప్లేస్ లో ఉంది. ఈ సినిమాని 30,922,987 మంది డౌన్ లోడ్ చేసుకుని చూసారు.

English summary
Every major blockbuster finds itself being downloaded millions upon millions of times. But what title was downloaded the most in the year 2015?. Top 10 Pirated Movies of 2015 See Alarming Increase in Downloads
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu