»   » రెండవ స్దానంపై కన్నేసిన టాయ్ స్టోరి 3..!

రెండవ స్దానంపై కన్నేసిన టాయ్ స్టోరి 3..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాయ్ స్టోరి 3(అమెరికన్ 3డి యానిమేటడ్ ఫిల్మ్) గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మనం ఈ విషయం గురించి తెలుసుకోవాలి. మన తెలుగువారి చందమామ కధల పుస్తకం గురించి మాట్లాడుకోవాలి. చిన్నతనంలో ఈ చందమామ కధలపుస్తకం గురించి తెలియని వారుండరు. నాగిరెడ్డి-చక్రపాణి గారు కలసి ఈ చందమామకి శ్రీకారం చుట్టారు. ఇది చిన్న పిల్లల మనసు దోచుకుంది. అలాగే వాల్ డిస్ని పిక్చర్స్ ఈ పేరు వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది మంచి సినిమాలు నిర్మిస్తారని. వాల్ డిస్ని పిక్చర్స్ పెద్దలకే కాకుండా పిల్లల కోసం కూడా సినిమాలు తీస్తారు. పిల్లల కోసం ఏదో చేయాలన్న సంకల్పంతో టాయ్ స్టోరి సిరిస్ ను మొదలు పెట్టారు.

ఈ టాయ్ స్టోరి 1 మరియు టాయ్ స్టోరి 2 లు హాలీవుడ్ లో ఎంతో ఘనం విజయాన్ని సాధించాయి. దీని తర్వాత వీటికి కోనసాగింపుగా టాయ్ స్టోరి 3 ని విడుదల చేయడం జరిగినది. ఈ సినిమాకిగాను టామ్ హాంక్స్, టిమ్ అలెన్, జోన్, డాన్ రిస్కేల్ మొదలగు హేమా హేమీల వాయిస్ ను అందివ్వడం జరిగినది. హాలీవుడ్ లో ఇటీవల కాలంలో జేమ్స్ కెమరాన్ దర్శకత్వంలో వచ్చినటువంటి అవతార్ సినిమా అత్యధిక వసూళ్శు సాధించి మొదటి స్దానంలో బాక్సా ఫీసు రికార్డులను బద్దలుకోట్టింది. దాని తర్వాత టైటానిక్ మరియు మమ్మా మియా అనే సినిమాలు 69.2 పౌండ్స్, 69.02పౌండ్స్ ను సాధించి రెండవ స్ధానాల్లో నిలిచాయి. ఇప్పుడు ఈ రెండవ స్దానంలోకి టాయ్ స్టోరి 3 సినిమా 70,1321,106 పౌండ్స్ ని వసూలు చేసి బాక్సా ఫీసు రికార్డులను బద్దలుకోట్టిందని బిబిసి న్యూస్ ఛానెల్ తెలియజేశారు. అవతార్ సినిమాకి 93.4 పౌండ్స్ ని వసూలు చేసిన సంగతి మనకి అందరికి తెలిసిందే.

ఇంతటి ఘనం విజయం సాధించినందుకు గాను విడుదల చేయడానికి ముందు తీసివేసిన కోన్నిసీన్లును మరలా తిరిగి ఈ 3డి యానిమేటడ్ ఫిల్మ్ లో మరో 9 నిమిషాల పూటేజిని మరలా యాడ్ చేయడం జరిగిందని వివరించారు. టాయ్ స్టోరి 3 సినిమాకి ఉన్న 'టాయ్స్ ఆర్ బాక్ ఇన్ టౌన్' అనే టాగ్ లైన్ చాలా ఆసక్తి కరంగా ఉంటుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu