twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెయ్యి కోట్ల రూపాయలతో 'వాల్ట్ డిస్నీ'సంస్ధ నుంచి వస్తున్నఅద్బుత చిత్రం

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్దలలో ప్రపంచం మొత్తం గర్వించదగ్గ సినిమాలు తీసినటువంటి సంస్ద వాల్ట్ డిస్ని. అలాంటి వాల్ డిస్ని సంస్ధ నుండి మరో గోప్ప సినిమా 'ట్రోన్' విడుదల చేయడానికి రంగం సిద్దం చేశారు. దాదాపుగా రెండువందల మిలియన్ల డాలర్ల వ్యయంతో అంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో 'వాల్ట్ డిస్ని' సంస్ధ నుంచి వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలో విహరింప చేసేలా చేస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది 'ముక్తా ఆర్ట్స్' సంస్థ. ఈసినిమాని డిసెంబర్ 17న ఆంద్ర దేశమంతటా తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ముంబాయికి చెందిన 'ముక్తా ఆర్ట్స్' సంస్థ విడుదల చేస్తోంది.

    1982లో తెరకెక్కి ఘన విజయం సాధించిన 'ట్రోన్' సినమాకు ఇది సీక్వెల్. స్టీవెన్ లిస్ బెర్గర్ దర్శకత్వంలో తేరా కెక్కిన 'ట్రోన్' అప్పట్లో ఈసినిమా సృష్టించినటువంచి హాడావుడి అంతా ఇంతా కాదు. ట్రోన్ చిత్ర దర్శకుడు జోసప్ కొసిన్ స్కీ మాట్లాడుతూ 'స్టీవెన్ లిస్ బెర్గర్' ఈ తాజా చిత్ర నిర్మాతలలో ఒకరు కావటం విశేషం. దానికి ఏమాత్రం తీసిపోకుండా 'ట్రోన్' ది లేగస్సి కూడా చాలా అందంగా తీర్చిదిద్దారని సమాచారం. ఇక సినిమా కధ విషయానికి వస్తే 'శ్యాం ప్లిన్' అనే 27సంవత్సరాల వయసుగల హైటెక్ యువకుడు తప్పిపోయిన తన తండ్రి కోసం అన్వేషిస్తూ వుంటాడు. 'శ్యాం ప్లిన్' తండ్రి 'కెవిన్ ప్లిన్' ఒకప్పుడు వీడియో గేమ్ డెవలపర్ గా ప్రపంచ ప్రసిద్ది గాంచి వుంటాడు. కెవిన్ ఆర్కేడ్ లో 'శ్యాం ప్లిన్' ఓ కొత్త సిగ్నల్ చూస్తాడు. అది తన తండ్రి మాత్రమే పంపగల సంకేతమని తెలుసుకుంటాడు. గత 20 ఏళ్శుగా తన తండ్రి ఓ సరి కొత్త ప్రపంచంలో బందీగా ఉన్నాడని తెలుసుకున్న హీరో తన తండ్రిని ఎలా రక్షించుకుంటాడనే కధాంశంతో సాగిపోతుంది..

    'కొర్రా' అనే యోధుని సాయంతో తన తండ్రిని కలుసుకుంటాడు'శ్యాం ప్లిన్'. అంతక ముందే 'కెవిన్ ప్లిన్' రూపొందించిన ప్రపంచంలో అధునాతనమైన వాహనాలు, ఆయుధాలు, వింత ప్రదేశాలు చోటు చేసుకొని వుంటాయి. అక్కడ'కెవిన్ ప్లిన్' రూపోందించినటువంటి ఆవింత ప్రపంచం నుండి తండ్రి, కొడుకులు ఎలాబయటపడతారు అనేదే మిగిలిన కధ. ఇందులో కెవిన్ ప్లిన్ గా జెఫ్ బ్లిడ్జ్ స్ నటించారు. ఇక హీరో పాత్ర అయినటువంటి శ్యాం ప్లిన్ పాత్రను గారెంట్ హెండ్లండి పోషించారు. కొర్రగా ఒలినియా వైల్డ్ నటించారు. మిగిలిన పాత్రల్లో మైఖేల్ ఫీన్, జాన్ హార్ట్, జెమ్స్ ప్రేయిన్, జయా డాకోస్టా అభినయించారు.

    English summary
    Tron: Legacy is an upcoming 2010 American science fiction film produced by Walt Disney Pictures to be released on December 17, 2010. It is a sequel to the 1982 film Tron. Joseph Kosinski makes his feature film directorial debut with Tron: Legacy, while the previous film director, Steven Lisberger, returns as a producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X