»   » లయన్‌ కింగ్‌ డైరక్టర్ కొత్త చిత్రం 'కౌ ఆన్‌ ది రన్‌'

లయన్‌ కింగ్‌ డైరక్టర్ కొత్త చిత్రం 'కౌ ఆన్‌ ది రన్‌'

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  లాస్ ఏంజెల్స్ : జర్మనీలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ ఆవు కథ హాలీవుడ్‌ సినిమా వాళ్లకి తెగ నచ్చేసింది. వాల్ట్‌ డిస్నీ వారి లయన్‌ కింగ్‌ సినిమాకి దర్శకత్వం వహించిన మాక్స్‌ హోవార్డ్‌ ఇప్పుడు ఈ కథతో 'కౌ ఆన్‌ ది రన్‌' పేరుతో యానిమేషన్‌ సినిమాను మొదలుపెట్టారు. కోట్ల రూపాయల ఖర్చుతో దీన్ని నిర్మించనున్నారు. చిన్న పిల్లలను ఎట్ర్టాక్ట్ చేస్తుందనుకుంటున్న ఈ ఆవు కథ ఏమిటీ అంటే...
  ఒక ఆవు... చావు నుంచి తప్పించుకుంది...అందరినీ పరుగులెత్తించింది...ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది... చివరికి ఓ సినిమా కథకి హీరో అయింది.

  ఈ ఆవు పూర్వాపరాల్లోకి వెళితే.. జర్మనీలో ఒక ఆవు ఓ రైతు దగ్గర ఉండేది. దాన్ని అతడు మరో వ్యక్తికి అమ్మేశాడు. ఆ వ్యక్తి కొన్నాళ్లు బాగా మేపి మాంసానికి అమ్మేద్దామనుకున్నాడు. ఓడలో కసాయి వాళ్లతో పంపేయడానికి ప్రయాణం కూడా ఖరారైపోయింది. ఈ సంగతంతా గ్రహించిందో ఏమోగానీ ఆ ఆవు తప్పించుకు పారిపోయింది. విద్యుత్‌ కంచెను కూడా ఛేదించుకుని అడవుల్లోకి ఉడాయించింది. ఇలా ఓ ఆవు తన చావుకి కొద్ది రోజుల ముందు తప్పించుకుందనే వార్త సంచలనం సృష్టించింది. ఇంటర్నెట్‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా తెలియడంతో దేశదేశాల నుంచి వేలాది మంది దానికి అభిమానులుగా మారారు.

  యజమాని తన అనుచరులతో అడవిలోకి వెళ్లి ప్రయత్నించినా అది దొరకలేదు. పోలీసులు సైతం పట్టుకోవాలని చూశారు. అందరినీ తప్పించుకునే యత్నంలో ఆ ఆవు రోడ్ల మీద పరిగెత్తడంతో ట్రాఫిక్‌ సమస్యలు కూడా ఏర్పడ్డాయి. ఆఖరికి అది కనిపిస్తే కాల్చేయమనే ఆదేశాలు జారీ అయ్యాయి. పట్టిస్తే బహుమతులు కూడా ప్రకటించారు. ఆఖరికి హెలికాప్టర్లు, జీపుల మీద గాలించినా అది చాకచక్యంగా తప్పించుకోగలిగింది. దాంతో ఆవుగారికి విపరీతమైన పేరు వచ్చేసింది. దీని పేరు మీద ఫేస్‌బుక్‌ ఎకౌంట్‌ కూడా ప్రారంభమైంది. అందులో 27,000 మంది సభ్యులుగా చేరిపోయారు.


  ఆవుగారి అభిమానులు, జంతు ప్రేమికుల నుంచి అనేక విజ్ఞప్తులు రావడంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను అధికారులు ఆపు చేశారు. దానికి ఎలాంటి హాని కలిగించకుండా పట్టుకుంటామని అధికారులు ప్రకటించాల్సి వచ్చింది. ఇక తన ప్రాణాలకి ఢోకా లేదని తెలిసినట్టుగా ఆ ఆవు దొరికిపోయింది. దానికి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి పట్టుకుని జాగ్రత్తగా ఓ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. మొదటి యజమాని అయిన రైతు దగ్గర్నుంచి దాని దూడని కూడా తీసుకొచ్చి ఈ కేంద్రంలోనే ఉంచారు. ఇప్పుడా ఆవు తాపీగా గడ్డి నెమరేస్తూ నిశ్చింతగా కాలక్షేపం చేస్తోంది. అది మ్యాటర్.

  English summary
  
 US producer Max Howard and Munich based Papa Löwe Filmproduktion are partnering with Torsten Poeck and UK-based writer/producer Kirsty Peart on the development of the partly animated family feature film, Cow On The Run, in collaboration with Gut Aiderbichl. The true story of Yvonne, the bovine bandit from Bavaria, is to be brought to Hollywood and the international markets by an international team of award-winning animators, writers and 
 producers. Yvonne escaped a Bavarian farm in 2011 after apparently sensing that she was about to be slaughtered, and was on the run for three months.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more