For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  2014 లో: ఈ స్టార్స్ అంతా బ్రేక్ అప్ అయ్యారు (ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  న్యూయార్క్ : సెలబ్రెటీల జీవితాల్లో డేటింగ్ లు బ్రెకఅప్ లు ప్యాచ్ అప్ లు చాలా చాలా సాధారణం. ఊహించని విధంగా అప్పటివరకూ కలిసి తిరిగిన వాళ్లు రాత్రికి రాత్రే బ్రేక్ అప్ అయ్యి..అందరికీ షాక్ ఇస్తూంటారు. అలాగే బ్రేక్ అప్ పార్టీ అంటూ ఇచ్చి...ఆ పార్టీలోనే మరొకరితో డేటింగ్ మొదలెట్టేస్తూంటారు.

  అయితే సెలబ్రెటీల కాని వారి జీవితాల్లోనూ ఇదే స్పీడులో డేటింగ్ లు, బ్రేక్ అప్ లు జరుగుతున్నా పెద్దగా పట్టించుకోం కానీ మీడియాలో ఎప్పుడూ నలిగే సినీ సెలబ్రెటీల జీవితాల్లో అవి ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. దాంతో మీడియా సైతం వీటికి ప్రయారిటీ ఇస్తూంటుంది.

  అప్పటికీ ఇది మా పర్శనల్...మేం బ్రేక్ అప్ అయితే మీకేంటి, డేటింగ్ చేస్తే మీకేంటి అని ఈ సెలబ్రెటీలు ఒక్కోసారి మీడియా మీద మండిపడుతూంటారు. అయితే అంతకుముందు వరకూ వారి లవ్ స్టోరీలు నిరంతరాయంగా ప్రసారం చేసిన మీడియా..వారి విడిపోవటాన్ని మాత్రం ఎందుకు వదులుతుంది..వాటికి కారణాలు సైతం అన్వేషిస్తుంది..లేదా ఊహిస్తుంది.

  2014లో సెలబ్రెటీల బ్రేక్ అప్ లు...కొన్ని స్లైడ్ షో లో...

  Kate Hudson and Matt Bellamy

  Kate Hudson and Matt Bellamy


  2010లో కలిసిన ఈ జంట 2011 జూలై ఓ బిడ్డకు స్వాగతం కూడా చెప్పారు. అయితే ఈ ఈ లోగా ఏం జరిగిందో ఏమో..ఇద్దరూ బైబై అనుకున్నారు.

  Amber Rose and Wiz Khalifa

  Amber Rose and Wiz Khalifa

  వివాహం అయిన ఓ యేడేదికే విచిత్రమైన కారణాలతో డైవర్స్ కు వెళ్లిన జంట ఇది.2011 జనవరిలో కలిసిన ఈ జంట..క్రితం సంవత్సరం విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

  Chris Martin and Gwyneth Paltrow

  Chris Martin and Gwyneth Paltrow

  పదేళ్లు బాగానే ఉన్నారు... ఇప్పుడు వీరికి ఒకరి లోపాలు మరొకరికి తెలిసి వచ్చి విడిపోతున్నారు. ఇద్దరం కలిసి ఉందామని ఎంత ప్రయత్నించినా మా వల్ల కావటం లేదు అంటున్నారు.

   Jennifer Lawrence and Nicholas Hoult

  Jennifer Lawrence and Nicholas Hoult


  గోల్డెన్ గ్లోబ్ పంక్షన్ 2014లో వీరిద్దరూ కిస్ చేసుకుని వార్తల్లో నిలిచారు వీరిద్దరూ. 2011 నుంచి రెండేళ్ల పాటు డేటింగ్ చేసుకున్నారు. అలాంటిది వీరి ప్రేమ వ్యవహారం ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి ముగింపుకి వచ్చింది.

  Chris Martin and Jennifer Lawrence

  Chris Martin and Jennifer Lawrence

  ఈ ప్రేమ పక్షలు ఎప్పుడూ తమ ప్రేమని బహిరంగపరచలేదు...కానీ క్రితం నెల వీరిద్దరూ విడిపోయినప్పుడు మాత్రం అందరి దృష్టిలో పడ్డారు. అయితే వీరిద్దరూ కలిసే అవకాసం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

  Angie Harmon and Jason Sehorn

  Angie Harmon and Jason Sehorn

  ఈ జంట..1998లో ఎంగేజ్ అయ్యారు. 2001 లో వివాహం అయ్యింది. దాదాపు 13 ఏళ్ల వివాహానంతరం..లీగల్ గా వీరిద్దరూ కోర్టు కెక్కి నవంబర్ లో విడిపోయారు.

  Jordin Sparks and Jason Derulo

  Jordin Sparks and Jason Derulo

  గత మూడేళ్లుగా మీడియా చేత వీళ్లిద్దరూ ఫెరఫెక్ట్ కపుల్ గా పేరు పొందారు. అయితే వీరిద్దరూ ఇప్పుడు విడిపోవటం వార్త అందరినీ షాక్ చేస్తోంది.

  Paula Patton and Robin Thicke

  Paula Patton and Robin Thicke

  ఈ జంట..డైవర్స్ కు అప్లై చేసింది. వీరి మధ్యన చాలా పొరపొచ్చాలు వచ్చాయి. 2005 లో వీరి వివాహం జరిగింది. 14 సంవత్సరాల వైవాహిక జీవితానంతంర వీరీ నిర్ణయానికి వచ్చారు.

  Justin Bieber and Selena Gomez

  Justin Bieber and Selena Gomez

  ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ సెలబ్రెటీ కపుల్స్ లో వీరొకరు. 2012 నుంచి కలిసి ఉంటున్నారు. అయితే అక్టోబర్ నుంచి వీరి డేటింగ్ కు ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు చెప్తున్నారు.

  Mariah Carey and Nick Cannon

  Mariah Carey and Nick Cannon

  ఇది కూడా 2014లో ఓ షాకింగ్ సెలబ్రెటీ బ్రేక్ అప్ అనే చెప్పాలి. వీరి బ్రేక్ అప్ గురించి విన్న వారంతా షాక్ అయ్యారు.

  Sarah Hyland and Matt Prokop

  Sarah Hyland and Matt Prokop

  ఈ కో స్టార్స్ ఇద్దరూ ఫెరఫెక్ట్ జంట అని మీడియాతో కీర్తింపబడ్డవాళ్ళే. గత ఐదేళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారు. అయితే ఈ లోగా ఏం జరిగిందో ఏమో...హఠాత్తుగా ఈ సెప్టెంబర్ లో వీరిద్దరూ విడిపోవాలనే నిర్ణయానికి వచ్చారు.

  Chris Brown and Karrueche Tran

  Chris Brown and Karrueche Tran

  ఈ కపుల్ కూడా చాలా పాపులర్. ఎక్కడ చూసిన వీళ్లిద్దరే అన్నట్లు ఉండేవారు. అయితే 2011 నుంచి ప్రారంభమైన వీరి రొమాన్స్ కు రీసెంట్ గా బ్రేక్ పడింది.

  Britney Spears and David Lucado

  Britney Spears and David Lucado

  తన మాజీ ప్రియుడుతో బ్రేకప్ అయ్యాక..ఈ కొత్త బోయ్ ప్రెండ్ తో 2013తో డేటింగ్ మొదలెట్టింది బ్రిట్నిస్. అయితే ఈ మధ్యన బ్రిట్నీస్ మరో కొత్త వ్యక్తితో రొమాంటిక్ గా మూవ్ అవుతూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

  Zac Efron and Michelle Rodriguez

  Zac Efron and Michelle Rodriguez

  వీళ్లద్దరి రొమాన్స్ వయస్సూ కేవలం రెండు నెలలే. అయితే ఈ లోగా వీరిద్దరూ విడిపోయి...తాము కలిసి ఉండటం లేదని మీడియాకు కూడా చెప్పేసారు.

  Big Sean and Naya Rivera

  Big Sean and Naya Rivera

  ఈ మ్యూజిషియన్, నటి కలిసి మొదలెట్టిన డేటింగ్ యవ్వారం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. అక్టోబర్ 2013లో మొదలైన ప్రేమ వ్యవహారం..ఈ మధ్యనే వీరిద్దరూ వేరే వేరే పార్టనర్స్ ను వెతుక్కోవటంతో ముగిసింది.

  Ariana Grande and Jai Brooks

  Ariana Grande and Jai Brooks

  వీరిద్దరూ 2012 లో డేటింగ్ మొదలెట్టారు. అయితే కేవలం 11 నెలలకే మొహం మొత్తేసింది. ఈ మధ్యనే ఆ విషయాన్ని స్పష్షటం చేస్తూ వేరే పార్టనర్స్ ని వెతుక్కుని మీడియాకు కనిపించారు.

  Uma Thurman and Arpad Busson

  Uma Thurman and Arpad Busson

  తన భర్తతో డైవర్స్ అయ్యాక ఉమ...అర్పాడ్ తో ఎంగేజ్ అయ్యి..ఆరు సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. అయితే ఈ ఏప్రియల్ లో దానికి ముగింపు పలికారు.

  Nikki Reed and Paul McDonald

  Nikki Reed and Paul McDonald

  2011లో ప్రేమలో పడ్డ ఈ జంట..రెండేళ్లకు వివాహం చేసుకునే స్ధితికి వచ్చారు. అయితే ఇప్పుడు వారిద్దరూ సెపరేట్ అయ్యారు. గత ఆరు నెలలుగా తాము విడిగానే ఉంటున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు.

   David Guetta and Cathy Guetta

  David Guetta and Cathy Guetta


  అందరకి ఆసూయ పుట్టేంతగా వీరిద్దరి ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ నడిచింది. 1992 నుంచి 2012 దాకా బాగానే ఉన్నారు. అయితే తమ ఇరవై ఏనియర్సరీకు వారు విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. వీరు విడాకలుకు అప్లై చేసుకున్నారు. ఈ సంవత్సరం వారు అఫీషియల్ గా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా.

  Katy Perry and John Mayer

  Katy Perry and John Mayer

  2012 ఆగస్టులో వీరి ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ రొమాన్స్, డేటింగ్ మొదలైంది. అయితే ఈ ఫిబ్రవరిలో వీరు తమ ప్రేమకు మంగళం పాడారు.

  English summary
  Celebrity patch ups and breakups are very common. While some let it go, there are many who rekindle their romance and try to give it a second chance. No wonder, we have some successful relationships in Hollywood. However, we also have a lot of on-again and off-again celebrity romances which makes news.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X