»   » ఆ సినిమా విడుదలకు ముందే సీక్వెల్ మొదలయింది..!!

ఆ సినిమా విడుదలకు ముందే సీక్వెల్ మొదలయింది..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూలియా రాబర్ట్స్, జామీ ఫాక్స్, జెస్సికా ఆల్బా, బ్రాడ్లే కూపర్ వంటి హేమాహేమీలు నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టెయినర్ వాలెంటాన్స్ డే సినిమా. హ్యాపీ డేస్, నథింగ్ ఇన్ కామన్ వంటి చిత్రాలను రూపొందించిన గ్యారీ మార్షల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వాలెంటాన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని దర్శకనిర్మాతలు ఎంతో ధీమాగా వున్నారు.

ఎంత ధీమాగా అంటే ఇంకా సినిమా విడుదల కాకముందే సీక్వెల్ తీసేంతగా. సినిమా ఫలితం ఎలాగూ బాగా వుంటుందని నమ్మకంతో వున్న వీరు అప్పుడే ఈ సినిమా సీక్వెల్ పనుల్లో నిమగ్నమయిందట. ఈ సినిమాలో కూడా జూలియా రాబర్ట్స్, జామీ ఫాక్స్, జెస్సికా ఆల్బాలు ప్రధాన పాత్రలు పోషిస్తారని తెలిసింది. మరి ఈ సినిమాను వచ్చే ఏడాది వాలెంటాన్స్ డేకు విడుదల చెయ్యాలని భావిస్తున్నారు వీరు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu