»   » ట్రేడ్ రిపోర్ట్: టాప్ ప్లేస్ లో 'వాలెంటైన్స్ డే' సినిమా..!!

ట్రేడ్ రిపోర్ట్: టాప్ ప్లేస్ లో 'వాలెంటైన్స్ డే' సినిమా..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ వారం బాక్సాఫీస్ వద్ద వాలెంటైన్స్ డే సందడి నెలకొంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలయిన 'వాలెంటైన్స్ డే' సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయి కలెక్షన్లు వసూలు చేసి తొలి స్థానంలో నిలిచింది. ఈ సినిమా మొత్తంగా 52.4 మిలియన్ డాలర్లను వసూలు చేసి టాప్ చైర్ లో నిలిచింది. జెస్సికా ఆల్బా, జూలియా రాబర్ట్స్ వంటి హేమాహేమీలు నటించిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టెయినర్ గా రూపొందింది. ఆ తర్వాతి స్థానంలో 'పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలంపియన్స్: ది లైట్నింగ్ థీఫ్' సినిమా 31.1 మిలియన్ డాలర్ల వసూళ్లతో రెండవ స్థానంలో నిలిచింది.

బాక్సాఫీసు వద్ద టాప్-10 స్థానాల్లో నిలిచిన చిత్రాలు:
1. వాలెంటైన్స్ డే ---- 52.4 మిలియన్ డాలర్లు
2. పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలంపియన్స్: ది లైట్నింగ్ థీఫ్ ---- 31.1 మిలియన్ డాలర్లు
3. ది ఊల్ఫ్ మ్యాన్ ---- 30.6 మిలియన్ డాలర్లు
4. అవతార్ ---- 22 మిలియన్ డాలర్లు
5. డియర్ జాన్ ---- 15.3 మిలియన్ డాలర్లు
6. ది టూత్ ఫెయిరీ ---- 5.6 మిలియన్ డాలర్లు
7. ఫ్రమ్ ప్యారీస్ విత్ లవ్ ---- 4.7 మిలియన్ డాలర్లు
8. ఎడ్జ్ ఆఫఅ డార్క్ నెస్ ---- 4.58 మిలియన్ డాలర్లు
9. క్రేజీ హార్ట్ ---- 4 మిలియన్ డాలర్లు
10. వెన్ ఇన్ రోమ్ ---- 3.42 మిలియన్ డాలర్లు

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu