»   » ఆందోళన, నెగెటివ్ రివ్యూలు: టీవీ సీరియల్‍‌లో మరీ ఇంత బూతా?

ఆందోళన, నెగెటివ్ రివ్యూలు: టీవీ సీరియల్‍‌లో మరీ ఇంత బూతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: వరల్డ్ వైడ్ పాపులర్ అయిన బిబిసి ఛానల్ లో ప్రసారం అవుతున్న ఓ టీవీ సీరియల్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ సీరియల్ నిండా బూతులు సీన్లు, పోర్న్ సీన్లు ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ సీరియల్ బ్రిటన్ లో ప్రసారం కాకుండా కొంతకాలంగా ఆందోలన జరుగుతున్నా.... అవేవీ సీరియల్ ప్రసారాన్నిఆపలేక పోయాయి.

తాజాగా ఈ సీరియల్ బ్రిటన్లో ప్రారంభం అయింది. ఈ సీరియల్ తొలి ఎపిసోడ్ చూసిన బ్రిటన్ వాసులు షాకయ్యారు. టీవీ సీరియల్ లో ఇంత బూతా? అంటూ నోరెల్లబెట్టారు. బుల్లి తెరపై ఇలాంటివి ప్రసారం కావడానికి వీల్లేదని, బ్యాన్ చేయాలని బ్రిటన్లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

17వ శతాబ్దంలో ఫ్రాన్స్ ను పాలించిన చక్రవర్తి లూయిస్-14 జీవితకథ ఆధారంగా 'వర్సల్లెస్' పేరుతో ఈ సీరియల్ తెరకెక్కించారు. 21 మిలియన్ పౌండ్లు(దాదాపు రూ. 200 కోట్లు) ఖర్చు పెట్టి ఈ సీరియల్ రూపొందించారు. కథాను సారం సీరియల్ లో కొన్ని పచ్చి సెక్స్ సీన్లు, నగ్న దృశ్యాలు కూడా ఉన్నాయి.

సీరియల్ తొలి ఎపిసోడ్ లో సెక్సుకు సంబంధించిన అంశాలు చూపెట్టారు. గే సెక్స్, రాజకుమారుడి క్రాస్ డ్రెస్సింగ్, రాజకుమారి విపరీతమైన వ్యామోహం లాంటివి చూపెట్టారు.

విమర్శలు

విమర్శలు

చారిత్రక కథనం పేరుతో సెక్స్ సీన్లు తెరకెక్కించడాన్ని బ్రిటన్ ఎంపీలు, కుటుంబ హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సీరియల్ పై ఫ్రాన్స్ లోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

వక్రీకరించారా?

వక్రీకరించారా?

లూయిస్-14 జీవితాన్ని, చరిత్రను వక్రీకరించి ఇందులో చూపెడుతున్నారని పలువురు మండి పడుతున్నారు.

బిబిసి

బిబిసి

పోర్న్ దృశ్యాలు, నగ్న దృశ్యాలు ఉన్న సీరియల్ ను డెలీషియస్ ట్రీట్ గా బిబిసి పేర్కొనడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు.

నెగెటివ్ రివ్యూలు

నెగెటివ్ రివ్యూలు

బూతు సీన్ల సంగతి పక్కన పెడితే....ఇతర అంశాలైనా బావున్నాయా? అంటే అదీ లేదు. డైలాగులు సరిగా లేవని, స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదని, లూయిస్ గా నటించిన జార్జ్ బ్లాగ్డెన్ కూడా ఈ పాత్రకు సూటవ్వలేదని సోషల్ మీడియా ద్వారా విమర్శించారు. ఈ సీరియల్ మీద రివ్యూలన్నీ దాదాపుగా నెగెటివ్ గానే వచ్చాయి.

English summary
Blockbuster Versailles has been described as a “delicious treat” by the corporation, but family rights campaigners are getting hot under the collar about the graphic sex scenes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu