Just In
- 47 min ago
ఆ మూడు గుర్రాలతో.. రిపబ్లిక్ అనే పదానికి అసలైన అర్దాన్ని చెబుతున్న మెగా హీరో
- 1 hr ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 2 hrs ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 3 hrs ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
Don't Miss!
- Sports
ముగ్గురు స్టార్ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే.. వాట్సన్ స్థానం అతనిదేనా?
- News
అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారంట్ జారీ.. ఎందుకంటే..
- Finance
సెన్సెక్స్ 530 పాయింట్లు డౌన్, అందుకే రిలయన్స్ మహా పతనం
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హాలీవుడ్‌కి మన కథ...హ్యాపీసే కదా
హైదరాబాద్ : హాలీవుడ్ నుంచి కథలు తెచ్చుకుని ఇక్కడ వంటకం చేయటం మనవాళ్లు అలవాటు. అందుకే ఏదన్నా మన కథ హాలీవుడ్ కు వెళ్తోందంటే ఆ ఆనందమే వేరు. తాజాగా అలాంటి అరుదైన అవకాశాన్ని విద్యాబాలన్ ప్రధాన పోషించిన చిత్రం 'కహానీ' పొందుతోంది. యశ్‌రాజ్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని ఇప్పుడు హాలీవుడ్‌లో 'డైటీ' పేరుతో రీమేక్ చేయబోతుంది యశ్‌రాజ్ సంస్థ. నీల్స్ ఆర్డెన్ ఓప్లెవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ప్రముఖ హాలీవుడ్ రచయితలు జోస్ రివేరా, రిచర్డ్ రెగన్‌లు సుజయ్ ఘోష్ కథను హాలీవుడ్ ప్రేక్షకులకు తగ్గట్టు తీర్చిదిద్దేపనిలో ఉన్నారు.
విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషించిన 'కహాని' చిత్రం బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా, కమర్షియల్‌గానూ విజయం సాధించింది. . సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భర్తను వెతుక్కునే గర్భవతి పాత్రలో నటించిన విద్యాబాలన్‌కు ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నయనతార ప్రధాన పాత్రలో నటించగా 'అనామిక' పేరుతో తెలుగు, తమిళ భాషల్లోనూ రీమేక్ అయ్యింది. తాజాగా హాలీవుడ్‌లోనూ ఈ సినిమా 'డైటీ' పేరుతో రీమేక్ కాబోతోంది.

''ఈ కథను పాశ్చాత్య ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీర్చిదిద్దడంలో ఈ ఇద్దరు రచయితలు సిద్ధహస్తులు. నీల్స్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ తెరపై ఎలా చూపిస్తారనే ఆసక్తితో ఉన్నాను'' అని చెప్పారు కహానీ దర్శకుడు సుజయ్ ఘోష్. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కోల్‌కతాలో ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది.
అందుకు సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. హాలీవుడ్‌లోనూ యశ్‌రాజ్ ఫిల్మ్ సంస్థ నిర్మిస్తుండగా 'ది గర్ల్ విత్ ది డ్రాగన్ టాటూ' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న హాలీవుడ్ డైరెక్టర్ నీల్స్ ఆర్డెన్ ఒప్లెవ్ దర్శకత్వం వహిస్తున్నారు. జోస్ రివేరా, రిచర్డ్ రీగన్ రచన చేస్తున్నారు. ఓ అమెరికన్ మహిళ తన తప్పిపోయిన భర్తను వెతకడం కోసం కలకత్తాకు రావడమనే నేపథ్యంతో కథ ఉండబోతోంది. 'కహానీ' సినిమా హాలీవుడ్‌లో రీమేక్ అవుతుండటం పట్ల యశ్‌రాజ్ ఫిల్మ్స్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది.