»   » మూవీ లెజెండ్ వాల్ట్ డిస్నీ కూతురు మృతి

మూవీ లెజెండ్ వాల్ట్ డిస్నీ కూతురు మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాలిఫోర్నియా: హాలీవుడ్ మూవీ లెజెండ్ వాల్ట్ డిస్నీ కూతురు డియానె డిస్నీ మిల్లర్ కాలిఫోర్నియాలోని ఆమె నివాసంలో ఈ నెల 19న మరణించారు. ఆమె వయసు 79. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డియానె డిస్నీ మిల్లర్ మంగళవారం కన్నుమూసారు. పలు అంతర్జాతీయ పత్రికలు ఈ విషయాన్ని ధృవీకరించాయి.

వాల్డ్ డిస్నీ, ఆయన సతీమణి లిల్లియన్‌కు డియానె డిస్నీ మిల్లర్ ఏకైక బయాలాజికల్ సంతానం. డియానె సోదరి షారోన్ మాయెని డిస్నీ దంపతులు 1936లో దత్తత తీసుకున్నారు. 20 ఏళ్ల క్రితమే షారోన్ మాయె మరణించారు. తాజాగా డియానె డిస్నీ మిల్లర్ కూడా కన్నుమూయడంతో వాల్డ్ డిస్నీ అభిమానులు విచారంలో మునిగి పోయారు.

Diane Disney Miller

డియానె డిస్నీ మిల్లర్....డిస్నీ కంపెనీ మాజీ సీఈఓ రోన్ డబ్లు.మిల్లర్‌ను పెళ్లాడారు. ప్రస్తుతం డిస్నీ కంపెనీ సీఈఓగా బోగ్ ఐజెర్ కొనసాగుతున్నారు. డియానె మృతిపై ఆయన మాట్లాడుతూ 'డియానె డిస్నీ మిల్లర్ మృతితో మేమంతా విషాదం ఉన్నాం. కంపెనీ ఉద్యోగులంతా ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేసాం' అని తెలిపారు.

డిస్నీ ల్యాండ్ రూపకల్పనలో ఆమె తనవంతు పాత్ర పోషించారు. డిస్నీ కంపెనీకి ఆమె చేసిన సేవలు మరువ లేనివని, డిస్నీ చరిత్రలో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచి పోతుందని బోగ్ ఐజెర్ పేర్కొన్నారు.

English summary
Movie legend Walt Disney's daughter died at her home in California. She was 79. Diane Disney Miller passed away Tuesday after suffering a recent fall, reports femalefirst.co.uk. She was the only biological daughter of Disney and his wife, Lillian. Her sister, Sharon Mae, was adopted by the couple in 1936.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu