»   » ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేము..అయినా సినిమా తీస్తాం..!!

ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేము..అయినా సినిమా తీస్తాం..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

2008వ సంవత్సరంలో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ మూవీ 'వాంటెడ్' సీక్వెల్ లో ఏంజలీనా జోలీ నటించడానికి సుముఖంగా లేకపోవడంతో ఇక ఈ సీక్వెల్ అటకెక్కిందనే వార్తలు వినిపించాయి. కానీ వార్నర్ బ్రదర్స్ సమర్పిస్తున్న ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం అవుతోందని, ఆమె లేని లోటు కనిపించకుండా చూసేందుకు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నామని ఈ సినిమా దర్శకుడు టింబూర్ బెక్మాంబిటోవ్ ప్రకటించాడు.

ఏంజలీనా స్థానంలో మరొకరిని ఊహించుకోవడం కష్టం కాబట్టి ఆమె పాత్రను స్క్రిప్ట్ లో తొలగించి, మరో పాత్రను పరిచయం చెయ్యనున్నట్టు టింబూర్ తెలిపాడు. ఇక ఏంజలీనా ప్రస్తుతం ది టూరిస్ట్ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో జానీ డెప్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ఆమె గ్ర్యావిటీ సినిమా షూటింగులో పాల్గొననుంది. కాగా ఆమె నటించిన మరో యాక్షన్ థ్రిల్లర్ ది సాల్ట్ ఈ వేసవికి విడుదల కానుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu