»   » హాలీవుడ్ ప్రముఖ డైరక్టర్ మృతి!

హాలీవుడ్ ప్రముఖ డైరక్టర్ మృతి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : 'నైట్‌మేర్‌ ఆన్‌ ఎల్మ్‌ స్ట్రీట్‌', 'స్క్రీమ్‌' లాంటి హారర్‌ చిత్రాలతో ప్రపంచ ప్రేక్షకులను భయపెట్టిన ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు వెస్‌ క్రేవెన్‌ (76) కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన లాస్‌ఏంజిలెస్‌లోని తన ఇంట్లో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని క్రేవెన్ అధికార ప్రతినిథి ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.

ఈ వార్త విన్న హాలీవుడ్‌ తారలు 'వెస్‌ మృతిని జీర్ణించుకోలేకపోతున్నామం'అంటూ ట్విట్టర్‌ ద్వారా నివాళులర్పించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వెస్‌ క్రేవెన్‌ ప్రస్థానం

న్యూయార్క్‌లో సౌండ్‌ ఎడిటర్‌గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన వెస్‌ 'టుగెదర్‌'తో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత అయ్యారు. ఆ తర్వాత 'ది లాస్ట్‌ హౌస్‌ ఆఫ్‌ ది లెఫ్ట్‌'తో దర్శకుడిగా మారారు. 'స్క్రీమ్‌' సిరీస్‌లో నాలుగు భాగాలను తెరకెక్కించారు.

Wes Craven, man behind 'Scream,' dies at 76

హాలీవుడ్‌నటులు జానీ డెప్‌, షరాన్‌ స్టోన్‌, బ్రూస్‌ విల్లిస్‌ లాంటి నటులను వెస్‌ పరిశ్రమకు పరిచయం చేశారు. 'ది హిట్స్‌ హేవ్‌ ఐస్‌', 'స్వాంప్‌ థింగ్‌', 'డెడ్లీ ఫ్రెండ్‌', 'ది పీపుల్‌ అండర్‌ ది స్టెయిర్స్‌' ఆయన దర్శకత్వంలో వచ్చినవే. 2010లో వచ్చిన 'మై సోల్‌ టు టేక్‌' ఆయన ఆఖరి చిత్రం.

English summary
Wes Craven, the visionary filmmaker who defined the horror genre with the long-enduring "A Nightmare on Elm Street" franchise, and later deconstructed and redefined it with "Scream," has died.He was 76.
Please Wait while comments are loading...