»   » ఆ అందాల సుందరి స్థానంలో ఎవరు ఐతే బాగుంటారు..?

ఆ అందాల సుందరి స్థానంలో ఎవరు ఐతే బాగుంటారు..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏంజలీనా జోలీ ఈ పేరు వినని వారు ఉండరంటే నమ్మండి. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జోలీ-బ్రాడ్ అయిదు సంవత్సరాల నుండి కలసి సహజీవనం సాగిస్తున్నారు. జోలీ-బ్రాడ్ జంటకు ఇప్పటికే ఆరుగురు పిల్లలు వున్నారు. వీరిలో ముగ్గరు దత్తతకు తీసుకున్న అనాధలు కాగా మిగితా ముగ్గురు వీరి పిల్లలు. అలాగే తను ఐక్యరాజ్యసనమితి గుడ్ విల్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలలో తన వంతు సాయాన్నిఅందిస్తుంది. ఆమె నటించిన సాల్ట్ సినిమా విడుదల అయిన తర్వాత ఆమె నటించనున్న తదుపరి చిత్రం ఏమిటా అని ఆమె అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నారు.

ప్రపంచం మెత్తం అభిమానులను సంపాదించిన హిరోయిన్ మార్లిన్ మన్రో. ప్రస్తుతం హాలీవుడ్ లో ఎవరి నోట విన్నా మార్లిన్ మన్రో. ఎందుకంటే మార్లిన్ మన్రో జీవితం ఆధారంగా సినిమా తీయాలని ఆండ్రూ ఓగన్ అనుకుంటున్నారు. చివరకు ఏంజలీనా జోలీ ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నట్టు హాలీవుడ్ సమాచారం. ఈ విషయాన్ని ఆండ్రూ ఓగన్ ఏంజలీనా జోలీ యే చేస్తుందని ఏడిన్ బర్గ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వివరించారు. కాని ఈ విషయాన్ని ఏంజలీనా జోలీ ధృవీకరించినట్టు లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu