నోరు జారింది: వివాదంలో పాప్ స్టార్ మడోన్నా?

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ పాప్ స్టార్ మనోన్నా ఓ వ్యక్తిపై నోరు పారేసుకోవడం చర్చనీయాంశం అయింది. వాస్తవానికి ఆమె కావాలని నోరు పారేసుకోలేదు. తన కారు డ్రైవర్ అనుకుని పొరబడిన ఆమె....అతనిపై తన మాటల ప్రతాపం చూపించింది. తర్వాత అతను తన కారు డ్రైవర్ కాదు అని తెలిసి నాలిక కరుచుకున్న ఆమె కనీసం సారీ కూడా చెప్పకుండా అక్కడి నుండి జారుకుంది.

55 ఏళ్ల మడోన్నా లాస్ ఏంజిల్స్‌లో ఓ స్టూడియో నుండి బయటకు వచ్చేసరికి.......ఓ కారు అటు వైపు వచ్చింది. అది తన కారే అనుకుని, అందులో ఉన్నది తన కారు డ్రైవరే అనుకుంది. కానీ ఆ కారు ఆమె వద్ద ఆగలేదు. దీంతో కోపోద్రిక్తురాలైన మడోన్నా నేను ఇక్కడున్నా కారు ఆపకుండా వెలుతున్నావేంటి? అంటూ చడామడా తిట్టేసింది.

Who's driving her car? Madonna thoroughly confused

దీంతో ఆ కార్లో ఉన్న వ్యక్తి ....హలో మేడమ్, మీరు ఎవరిని ఎవరు అనుకుని పొరబడుతున్నారో? నేను మీ డ్రైవర్‌ను కాదు. మర్యాదగా మాట్లాడండి అంటూ ఎదురు సమాధానం ఇచ్చాడు. దీంతో కంగుతిన్న మనోడన్నా....తన అసలు కారు, అసలు డ్రైవర్‌ను గమనించి వెళ్లి ఎక్కేసింది.

అయితే ఇంతలా నోరు పారుసుకుని, నానా మాటలు అనేసి....కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే మరెవరైనా ఆమెను అలా అని ఉంటే ఊరుకునేదా?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X