twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేమ్స్‌బాండ్‌ కు 'ముంబయి' భయం ఎందుకని?

    By Srikanya
    |

    లాస్‌ ఏంజిలిస్ : జేమ్స్‌ బాండ్‌ తాజా చిత్రం 'స్కైఫాల్‌' ను ముంబయిలో చిత్రీకరించాలనుకున్నా సాధ్యం కాలేదని చిత్ర దర్శకుడు శామ్‌ మెండిస్‌ చెప్పారు. జనసాంద్రక కలిగిన మార్కెట్‌లలో నేరస్తులను వెంటాడే దృశ్యాలు చిత్రీకరించాలనుకున్నా వీలు కాలేదు. మోటార్‌బైక్‌లపై వెంటాడే దృశ్యాలు, రైలులో ఏక్షన్‌ దృశ్యాలు చిత్రీకరించాలనుకున్నప్పటికీ సన్నని ఇరుకు వీధులలో అది సాధ్యం కాదని తేలినట్లు 'హాలీవుడ్‌ రిపోర్టర్‌' పత్రిక రాసింది.

    '' ముంబయి అతి విస్తృతమైన నగరం. అక్కడ కీలక ప్రదేశాలలో చిత్రీకరించాల్సి ఉంటుంది. కాని అందులో పలు ప్రమాదాలున్నాయని గుర్తించాం. ప్రజలు అడ్డుపడతారని కాదు. ఇరుకు గల్లీలలో చిత్రీకరణ అసాధ్యం. అందువల్ల నిరాశ చెందాను'' అని మెండిస్‌ ఆ పత్రికకు చెప్పారు. తరువాత దక్షిణాఫ్రికా వెళ్లి కేప్‌టౌన్‌, జోహాన్స్‌బెర్గ్‌లను పరిశీలించారు. అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని 47 ఏళ్ల డైరెక్టర్‌ గ్రహించారు. తర్వాత టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ వెళ్లి కొంతమేర చిత్రీకరణ జరిపారు.

    లేటెస్ట్ జేమ్స్ బాండ్ మూవీ 'స్కైఫాల్' ఇండియన్ బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధించడమే కాదు...హాలీవుడ్ సినిమాల్లోకెల్లా అత్యధిక వీకెండ్ ఓపెనింగ్స్ సాధించిన రెండో సినిమాగా రికార్డ్ సృష్టించింది. నవంబర్ 1న విడుదలైన ఈ చిత్రం తొలి వీకెండ్(4 రోజులు)లో రూ. 27.5 కోట్లు వసూలు చేసింది. టోటల్ గా ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 34.5 కోట్లు వసూలు చేసింది.సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 1న ఈచిత్రాన్ని 907 ప్రింట్లతో దేశ వ్యాప్తంగా విడుదల చేసింది. ఇప్పటి వరకు ఏ 2డి హాలీవుడ్ సినిమా కూడా ఈ రేంజిలో విడుదల కాలేదు. మొత్తం నాలుగు భాషలు(ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం)ల్లో సినిమా విడుదలైంది.

    శామ్ మెండిస్ దర్శకత్వంలో రూపొందిన 'స్కైఫాల్' మూవీ..... బ్రిటన్ గూడచార సంస్థకు చెందిన మాజీ ఏజెంట్ విలన్ గా మారిన వైనాన్ని, సంస్థకు, బ్రిటన్ తలనొప్పిగా ఎలాంటి విధ్వంసానికి పాల్పడ్డాడు, ఏజెంట్ OO7(జేమ్స్ బాండ్) అతని ఆగడాల ఏలా అడ్డుకున్నాడు? అనే స్టోరీతో నడుస్తుంది.బాండ్ సినిమాలు మొదలయి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 23వ చిత్రంగా రూపొందిన 'స్కైఫాల్' చిత్రం నవంబర్ 1న విడుదలైంది. తెలుగులో ఈ చిత్రం 'లోకం చుట్టిన వీరుడు' టైటిల్ తో విడుదలైంది.

    English summary
    
 Director Sam Mendes had to abandon his plans to shoot 23rd James Bond movie 'Skyfall' in Mumbai because he found it "incredibly difficult". The movie was meant to open in Mumbai, with a long chase that would have seen Bond racing through a densely populated market, jumping on a motorbike and eventually fighting an opponent on top of a train. But the production team dropped the idea after realising it was difficult to shoot in the narrow and chaotic streets of Mumbai, the Hollywood Reporter said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X