»   » అవతార్ నామరూపాల్లేకుండా పోవడానికి కారణం ఏంటి..!?

అవతార్ నామరూపాల్లేకుండా పోవడానికి కారణం ఏంటి..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ సినిమా ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా చరిత్ర సృష్టించిన సినిమా, మరొకటి అరకొర వసూళ్లతో బాక్సాఫీసు వద్ద పేలిపోయినా...విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సినిమా. ఒకటేమో అద్భుత ఊహామాయాజాలం కాగా మరొకటి యుద్ధభూమిలో జరిగే వాస్తవ దృశ్యాలను కళ్లకు కట్టినట్టు చూపే చిత్రం... ఓ సినిమాను హాలీవుడ్ అగ్రగామి దర్శకుడు రూపొందిస్తే... మరో సినిమాను ఆయన మాజీ భార్య రూపొందించింది. ఈ సినిమాలేవో ఇప్పటికే మీకు అర్థమయ్యే వుంటుంది. అవే జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన 'అవతార్', క్యాథరీన్ బిగిలోవ్ దర్శకత్వం వహించిన 'ది హర్ట్ లాకర్'.

ఎన్నో ప్లస్ పాయింట్లు వున్న అవతార్ ను అధికమించి బాక్సాఫీసు వద్ద పేలిపోయిన ది హర్ట్ లాకర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడానికి ప్రధాన కారణం ఏంటి అని విశ్లేషిస్తే ఇందులో సానుభూతి, వాస్తవ కథలు ప్రధాన పాత్ర పోషించాయని చెప్పవచ్చు. ఆస్కార్ చరిత్రలో ఇంతవరకూ ఎన్నడూ ఊహా చిత్రాలకు(అవతార్) అవార్డు వచ్చిన దాఖలాలు లేవు. దీనికి తోడు క్యాథరీన్ ఎన్నో వ్యయప్రయాసలను భరించి ఇరాక్ లో ఈ సినిమాను(ది హర్ట్ లాకర్) షూట్ చెయ్యడం.. ఇంత కష్టపడి మంచి కథాంశంతో సినిమాను తీస్తే అది కలెక్షన్ల పరంగా హిట్ కాకపోవడం ఈ సినిమా మీద సింపథీని కలిగించింది. ఇది సినిమాకు అవార్డులను తెచ్చిపెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించిందనేది హాలీవుడ్ వర్గాల భోగట్టా..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu