»   » 'అవతార్' ఆస్కార్ లో రికార్డులు సృష్టించలేదు: జేమ్స్ కామెరూన్

'అవతార్' ఆస్కార్ లో రికార్డులు సృష్టించలేదు: జేమ్స్ కామెరూన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచ సినీచరిత్రలో బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టించిన జేమ్స్ కామెరూన్ 'అవతార్' సినిమా అన్ని రికార్డులనీ తిరగరాసిన సంగతి తెలిసిందే. సరిగ్గా 12 ఏళ్ల క్రితం జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలోనే వచ్చిన టైటానిక్ సినిమా కూడా ఇదే విధంగా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది, వీటితో పాటు ఆస్కార్ అవార్డుల పంట పండించుకుంది. ఏకంగా పదకొండు అవార్డులను గెలుచుకొంది. కానీ అవతార్ కు ఈ ఆస్కార్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం లేదు. కారణం ఈ సినిమా కేవలం తొమ్మిది నామినేషన్ల మాత్రమే రావడం. కనీసం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడి విభాగంలో అయినా అవార్డు వస్తుందా..?? ఇదే ప్రశ్నను జేమ్స్ కామెరూన్ ను అడిగితే ఆయన సమాదానం ఇలా వుంది.

అవతార్, టైటానిక్ దేనికవే ప్రత్యేకమయిన సినిమాలు. ఈ రెండింటినీ పోల్చడం సరికాదు. ఇక ఆస్కార్ లో రికార్డులు సృష్టించే అవకాశం ఎలాగూ లేదు, ఎందుకంటే అవతార్ కు వచ్చిన నామినేషన్లు కేవలం తొమ్మిది మాత్రమే. ఇక ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడి అవార్డులంటారా ఈ అవార్డులు అవతార్ కు వచ్చినా, ది హర్ట్ లాకర్ కు వచ్చినా మొదట సంతోషపడేది నేనే. ది హర్ట్ లాకర్ సినిమా కోసం క్యాథరీన్ కూడా చాలా కష్టపడింది. కానీ ఈ రెండు సినిమాలకు కాకుండా మరో సినిమాకు అవార్డు వస్తే కొద్దిగా బాధగా వుంటుంది అన్నారు. ది హర్ట్ లాకర్ సినిమాను రూపొందించిన క్యాథరీన్ బిగిలోవ్ కామెరూన్ మాజీ భార్య కావడం గమనార్హం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu