Don't Miss!
- News
ఫామ్‌హౌస్‌కు కేసీఆర్.. దేశపర్యటనకు విరామం; మళ్ళీ దసరా తర్వాత కేసీఆర్ జాతీయ మిషన్?
- Lifestyle
'ఈ' సింపుల్ నేచురల్ హోం రెమెడీస్ ఉపయోగించి మీ ముఖాన్ని ప్రకాశవంతం చేసుకోండి!
- Sports
IPL 2022 Closing ceremony: రణవీర్ సింగ్, ఏఆర్ రెహమాన్ ఆటపాటతో అదిరిపోయే ముగింపు.. ఈసారి స్పెషల్ ఏంటంటే?
- Technology
ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ తగ్గింపు ఆఫర్లతో ప్రారంభమయ్యాయి!!
- Finance
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌కు క్రెడిట్ కార్డ్‌తో కుచ్చుటోపీ: రూ.లక్షలు దోపిడీ
- Automobiles
భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Will Smith: విల్ స్మిత్‌కు అకాడమీ షాక్.. పదేళ్లు కనిపించకుండా శిక్ష.. ఆస్కార్ అవార్డును మాత్రం!
విల్ స్మిత్.. కొద్ది రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోన్న పేరిది. ఇటీవలే జరిగిన 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలో తన భార్యపై జోక్ చేశాడన్న కారణంతో ప్రజెంటర్ క్రిస్ రాక్‌ను స్మిత్ చెంపదెబ్బ కొట్టాడు. అప్పటి నుంచి అతడు హాట్ టాపిక్ అవుతున్నాడు. ఈ ఊహించని పరిణామం తర్వాత స్మిత్ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అలాగే, ఎన్నో కీలక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ఈ హాలీవుడ్ యాక్టర్‌పై తీవ్ర చర్యలు తీసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా స్మిత్‌పై నిషేదాన్ని విధిస్తూ హాలీవుడ్ అకాడమీ కమిటీ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. అందులో ఏముంది? చూద్దాం పదండి!

క్రిస్ రాక్‌పై విల్ స్మిత్ పిడిగుద్దు
94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఉత్తమ నటుడిగా ఎంపికైన విల్ స్మిత్ భార్యపై జోక్ చేశాడు. దీంతో అతడు స్టేజ్ మీదకు దూసుకొచ్చి మరీ అతడి ముఖంపై పిడిగుద్దు గుద్దేశాడు. అంతేకాదు, తన భార్య పేరును చెప్పొద్దు అంటూ అతడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఈషా రెబ్బా అందాల ఆరబోత: తొలిసారి ఇంత హాట్‌గా తెలుగమ్మాయి ఫోజులు

విమర్శలు... రాజీనామా చేశాడు
ప్రతిష్టాత్మకంగా
సాగే
ఈవెంట్‌లో
విల్
స్మిత్
వ్యవహరించిన
తీరుపై
ప్రపంచ
వ్యాప్తంగా
విమర్శలు
వెల్లువెత్తాయి.
దీంతో
అతడు
హాలీవుడ్
ఫిల్మ్
అకాడమీకి
రాజీనామా
కూడా
చేశాడు.
ఈ
మేరకు
వదిలిన
ప్రకటనలో
‘నేను
ఆస్కార్
వేడుకలో
ప్రవర్తించిన
విధానం
షాకింగ్‌గా,
బాధాకరంగా
అనిపిస్తోంది.
అందుకే
అకాడమీ
సభ్యత్వానికి
రాజీనామా
చేస్తున్నా'
అంటూ
పేర్కొన్నాడు.

చర్యలకు సిద్ధంగా.. శిక్ష ఖాయం
రాజీనామా చేసిన సమయంలో విల్ స్మిత్ ‘నా రాజీనామాను అంగీకరించడంతో పాటు నా చర్యకు బోర్డు విధించే ఎలాంటి శిక్షనైనా అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నాను' అంటూ పేర్కొన్నాడు. దీంతో విల్ స్మిత్‌పై అకాడమీ చర్యలు తీసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అతడి ఆస్కార్ అవార్డును కూడా వెనక్కి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.
మరోసారి
పాయల్
రాజ్‌పుత్
అందాల
ఆరబోత:
క్లాత్
మాత్రమే
చుట్టుకుని
యమ
ఘాటుగా!


విల్ స్మిత్‌పై అకాడమీ చర్యలు
ఆస్కార్ అవార్డుల వేడుకలో విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టిన ఘటనపై హాలీవుడ్ మోషన్ పిక్చర్స్ అకాడమీ కమిటీ శుక్రవారం సమావేశం అయింది. సుదీర్ఘంగా సాగిన మీటింగ్ తర్వాత సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు విల్ స్మిత్ ఏప్రిల్ 8, 2022 నుంచి పదేళ్ల పాటు ఆస్కార్ అవార్డ్స్ సహా అకాడమీ నిర్వహించే ఏ ఈవెంట్‌లోనూ పాల్గొనకుండా నిషేదాన్ని విధించింది.

అధికారిక ప్రకటనతో క్లారిటీగా
సమావేశం అనంతరం హాలీవుడ్ మోషన్ పిక్చర్స్ అకాడమీ అధ్యక్షుడు డేవిడ్ రూబిన్, సీఈవో డాన్ హడ్సన్ అధికారిక ప్రకటన వదిలారు. అందులో ‘మిస్టర్ స్మిత్ ఏప్రిల్ 8, 2022 నుంచి వచ్చే పదేళ్ల వరకూ అకాడమీ నిర్వహించే ఆస్కార్ సహా ఇతర ఈవెంట్లకు వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా హాజరు కాకూడదని నిషేదించాలని నిర్ణయం తీసుకున్నాం' అంటూ పేర్కొన్నారు.
పుట్టినరోజు యాంకర్ వర్షిణి అందాల ఆరబోత: వామ్మో ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు!

అస్కార్ అవార్డుపై క్లారిటీ లేదు
విల్
స్మిత్‌పై
నిషేదం
విధించిన
ఫిల్మ్
అకాడమీ..
తాజాగా
అతడు
గెలుచుకున్న
ఆస్కార్
అవార్డును
వెనక్కి
తీసుకుంటున్నట్లు
మాత్రం
ప్రకటించలేదు.
అంతేకాదు,
భవిష్యత్‌లోనూ
ఆస్కార్‌కు
నామినేట్
అయ్యే
అవకాశాలను
నిషేదిస్తున్నట్లు
కూడా
వెల్లడించలేదు.
అంటే
విల్
స్మిత్
ఈ
పదేళ్లలో
ఆస్కార్‌కు
నామినేట్
అవొచ్చు.
అలాగే,
అవార్డుకు
ఎంపికైతే
అందుకోవచ్చు
కూడా.