»   »  జాతి వివక్ష: ఆస్కార్ అవార్డు వేడుకల బహిష్కరణ

జాతి వివక్ష: ఆస్కార్ అవార్డు వేడుకల బహిష్కరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఆస్కార్ అవార్డుల ఎంపికలో జాతి వివక్ష కొనసాగుతుందనే వాదన ఎప్పటి నుండో ఉంది. ఈ సారి అవార్డుల్లో ఒక్క నల్ల జాతీయుడికి కూడా అవార్డు రాక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వేడుకలను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు నల్లజాతి నటులు.

మరో వైపు ఆస్కార్ వేడుకలకు హాజరుకావడం లేదని ప్రముఖ హాలీవుడ్ స్టార్ విల్‌స్మిత్ ప్రకటించారు. ఆస్కార్ పురస్కారానికి కొన్నేళ్ల నుంచి తెల్లవారినే ఎంపిక చేయటానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్మిత్ వెల్లడించారు. ఆస్కార్ వేడుకను బహిష్కరించాలని నల్లజాతి నటులు పిలుపునిచ్చారు.

Will Smith to Boycott Oscars

ఈ వివాదం సంగతి పక్కన పెడితే...ఫిబ్రవరిలో ఆస్కార్స్ అవార్డు వేడుకలు జరుగనున్నాయి. భారత సంతతికి చెందిన వ్యక్తి ఆస్కార్ అవార్డు అందుకోబోతున్నారు. ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డులు ప్రకటిస్తారు. అంతకంటే ముందు 10 సైంటిఫిక్, టెక్నికల్ అవార్డులను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ సైన్సెస్ ప్రధానం చేయనుంది. ఫిబ్రవరి 13న జరిగే కార్యక్రమంలో భారత సంతతికి చెందిన నటుడు, నిర్మాత రాహుల్ థక్కర్ అవార్డు అందుకోబోతున్నారు.

‘గ్రౌండ్ బ్రేకింగ్ డిజైన్'లో అందించిన విశేష సేవలకు గుర్తింపుగాను ఆయనకు ఈవార్డు అందుకోబోతున్నారు. రాహుల్ థక్క్, రిచర్డ్ చాంగ్ లకు సంయుక్తంగా ఈ పురస్కారం దక్కబోతోంది. వీరికి అందిస్తున్న ఈ టెక్నికల్ అచీవ్మెంట్ అవార్డు గురించి ఆస్కార్ అవార్డ్స్ అధికారిక వెబ్ సైట్లో పేర్కొన్నారు.

English summary
Will Smith to Boycott Oscars Over Lack of Racially Diverse Nominees.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu