For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Will Smith ఆస్కార్ వేడుకల్లో చెంపదెబ్బ.. క్షమాపణలు చెప్పి చెంపలేసుకొన్న విల్ స్మిత్!

  |

  ఆస్కార్​ వేదిక మీద కమెడియన్​ క్రిస్​ రాక్​ను ప్రముఖ నటుడు విల్​ స్మిత్​ చెంప దెబ్బ కొట్టిన ఘటనపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. విల్​ స్మిత్​ భార్య గుండు మీద రాక్​ జోకులేయడం, ఈ క్రమంలో సహనాన్ని కోల్పోయిన విల్​ స్మిత్​ స్టేజ్​పైకి వెళ్లి కమెడియన్​ చెంప చెళ్లుమనిపించాడు. ఇదంతా కూడా అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఇప్పుడు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న క్రమంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ అవార్డు వెనక్కు తీసుకుంటారని చర్చ జరుగుతున్నా క్రమంలో విల్ స్మిత్ స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే

  Recommended Video

  Will Smith Conflict With Chris Rock Explained విల్ స్మిత్ భార్యకి ఉన్న వ్యాధి ఏంటి?
  రిచర్డ్‌ విలియమ్స్‌ రోల్‌లో

  రిచర్డ్‌ విలియమ్స్‌ రోల్‌లో


  అమెరికన్‌ నటుడు అయిన విల్‌ స్మిత్‌(విలియర్డ్‌ కారోల్‌ స్మిత్‌ 2) మెన్‌ ఇన్‌ బ్లాక్‌, ది పర్సూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌, హ్యాంకాక్‌, ఐ యామ్‌ లెజెండ్‌ లాంటి సినిమాలతో ఇండియన్‌ ఆడియన్స్‌కు కూడా పరిచయమే. ఇప్పటిదాకా ‘అలీ', ‘ది పర్సూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌', ‘కింగ్‌ రిచర్డ్‌'కు గానూ మూడుసార్లు ఉత్తర నటుడి కేటగిరీలో నామినేట్‌ అయ్యారు. అయితే ఎట్టకేలకు విల్‌ స్మిత్‌కు ఆస్కార్‌ 2022లో అవార్డు వరించింది. కింగ్‌ రిచర్డ్‌లో వీనస్‌, సెరీనా విలియమ్స్‌ తండ్రి పాత్ర అయిన రిచర్డ్‌ విలియమ్స్‌ రోల్‌లో ఆయన కనబర్చిన అద్భుతమైన నటనకు గాను ఆస్కార్‌ దక్కించుకున్నాడు.

  దవడ పగలకొట్టాడు

  దవడ పగలకొట్టాడు

  ఆస్కార్స్‌ 2022 అవార్డుల ప్రధానం సందర్భంగా విల్‌ స్మిత్‌, స్టేజ్‌పై మాట్లాడుతున్న అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌ చెంప చెల్లుమనిపించాడు. బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇవ్వడానికి స్టేజ్‌ ఎక్కిన క్రిస్‌ ఏదో మాట్లాడుతూ విల్‌ స్మిత్‌ భార్య, నటి జాడా పింకెట్‌ స్మిత్‌ గుండు మీద జోక్‌ పేల్చాడు. అనారోగ్యంతో ఆమె గుండు చేయించుకుని ఉండగా ఆమె లుక్‌ మీద క్రిస్‌ జోకులు వేశాడు. అయితే అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్‌ స్మిత్‌ తన భార్య గురించి తప్పుగా ఒక్కసారిగా కోపోద్రిక్తుడు అయ్యాడు. స్టేజ్‌ మీదకు సీరియస్‌గా వెళ్లిన స్మిత్‌ క్రిస్‌ దవడ పగలకొట్టాడు. ఆ మరుక్షణమే కిందికి దిగి కుర్చీలో కూర్చున్నాడు. క్రిస్‌ వెకిలిగా ఏదో వివరణ ఇవ్వబోతుండగా ఒక అభ్యంతరకరమైన పదంతో నోరు మూయమని క్రిస్‌కు సూచించాడు విల్‌ స్మిత్‌.

  బహిరంగ క్షమాపణలు

  బహిరంగ క్షమాపణలు

  అయితే ఇప్పుడా అవార్డును వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్​ తెరపైకి వచ్చింది. అకాడమీ నిబంధనలకు విరుద్ధంగా క్రమశిక్షణ ఉల్లంఘన చేసినందుకు అతడి ఆస్కార్​ను వెనక్కి తీసుకోని గట్టి చర్యలు చేపట్టాలని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. ఇక ఈ క్రమంలో ఆస్కార్ అకాడమీ స్పందించింది. "హింస ఏ రూపంలో ఉన్న అకాడమీ సహించదు. 94వ అకాడమీ అవార్డుల వేడుక జరగడం, విజేతలకు గుర్తింపు దక్కడంపై మేం సంతోషిస్తున్నాం" అని ట్వీట్​ చేసింది. విల్ స్మిత్, ఇప్పుడు క్రిస్ రాక్‌ను వేదికపై కొట్టినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు.

  భరించలేనిదిగా అన్పించి

  భరించలేనిదిగా అన్పించి


  విల్ స్మిత్ క్రిస్ రాక్ చర్యల వల్ల తాను ఇబ్బంది పడ్డానని, జాడా వైద్య పరిస్థితిపై అతను వేసిన జోక్ భరించలేనిదిగా ఉందని చెప్పుకొచ్చాడు.. క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన నోట్‌ లో "అన్ని రూపాల్లో హింస అనేది విషపూరితమైనది, విధ్వంసకరం అని పేర్కొన్నాడు. గత రాత్రి అకాడమీ అవార్డులలో నా ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు, క్షమించరానిది. జోకులు నా ఉద్యోగంలో భాగం... కానీ జాడా ఆరోగ్య పరిస్థితి గురించి ఒక జోక్ నేను భరించలేనిదిగా అన్పించిందని అన్నాడు. అందుకే నేను ఎమోషనల్ గా అలా స్పందించానని పేర్కొన్నారు.

   హింసకు చోటు లేదు

  హింసకు చోటు లేదు

  ఇక స్, నేను మీకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా, నేను తప్పు చేసినందుకు సిగ్గుపడుతున్నాఅని అన్నారు. ప్రేమ, దయ ఉన్న ప్రపంచంలో హింసకు చోటు లేదు... నేను అకాడమీకి, నిర్మాతలకు, హాజరైన వారందరికీ, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను విలియమ్స్ కుటుంబానికి, నా కింగ్ రిచర్డ్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను" అంటూ విల్ స్మిత్ ఎమోషనల్ అయ్యాడు.

  English summary
  Will Smith Publicly Apologised Chris Rock over oscar's slap.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X