»   » భర్తముందు ఇంకొకరితో మరీ అలానా.. ఎలాగబ్బా..??

భర్తముందు ఇంకొకరితో మరీ అలానా.. ఎలాగబ్బా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

భర్త ముందు ఇంకొకరితో సన్నిహితంగా వుండటానికే చాలా ఇబ్బందిగా అనిపించే ఆ అమ్మాయికి ఏకంగా తన భర్త ఎదురుగా మరో మగాడితో చాలా సన్నిహితంగా, అదీ నగ్నంగా వుండాల్సి వస్తే ఎలా వుంటుంది..ఎలా వుంటుందో కేట్ విన్స్లెట్ ను అడిగితే తెలుస్తుంది అంటున్నాడు ఆమె స్నేహితుడు, సహనటుడు రినార్డినో డి కాప్రియో. వీరిద్దరూ జంటగా నటించిన తొలి సినిమా టైటానిక్ ఎంత ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మొత్తానికి హీరోయిన్ నగ్న చిత్రాన్ని నాయకుడు గీసే సన్నివేశం ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు.

ఆ తర్వాత వీరిద్దరూ రివల్యూషనరీ రోడ్ అనే చిత్రంలో కలసి నటించారు. ఈ సినిమాకు కేట్ భర్త శ్యామ్ మెండీస్ దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాలో నాయికానాయకుల మధ్య ఓ సెక్సీ సన్నివేశాన్ని ప్లాన్ చేసాడట దర్శకుడు. ఈ సన్నివేశం గురించి కేట్ కు చెప్పగానే ఆమె ఉలిక్కిపడిందట. ఈ సన్నివేశం చెయ్యనని తెగేసి చెప్పిందట. అదేంటి లినార్డినో నీ స్నేహితుడు అందునా మీరిద్దరూ ఇంతకు ముందు టైటానిక్ సినిమాలో చాలా హాట్ సన్నివేశాల్లో నటించారు కదా..!! ఇప్పుడేమయింది అంటే నా భర్త ముందు ఇలాంటి సన్నివేశంలో నటించడానికి చాలా ఇబ్బందిగా వుంటుంది నేను చెయ్యలేనని చెప్పిందట.

ఇక ఆ తర్వాత దర్శకుడు (భర్త) బుజ్జగించడంతో తన భర్త ముందు ఆమె అయిష్టంగానే ఆ సన్నివేశాన్ని రక్తికట్టించిందట. ఎంతయినా ఆస్కార్ అవార్డు నటీమణి కదా...తన నటనా చాతుర్యాన్ని చూపించింది. కాగా ఇప్పుడామె తన భర్త నుండీ విడాకులు తీసుకొంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu