»   » ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది: లేడిగాగా

ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది: లేడిగాగా

Posted By:
Subscribe to Filmibeat Telugu

వాషింగ్టన్: ఇటీవల జరిగిన యమ్ టివి వీడియో మ్యూజిక్ అవార్డులలో పాప్ సింగర్ లేడిగాగా విజయకేతనం ఎగరవేశారు. లేడిగాగా మొత్తం 14 క్యాటగిరిలకు గాను 8 అవార్డులను సోంతం చేసుకోని పాప్ మ్యూజిక్ లో తనకు తానే సాటి అని నిరూపించింది. కొరియోగ్రఫీ, ఫీమెల్ వీడియో, పాప్ వీడియో, కోలాబరేషన్ డాన్స్ వీడియో, ఎడిటింగ్ అండ్ డైరెక్టెంగ్ ఇలా ఎనిమిది శాఖలలో తాను నిర్మించినటూవంటి 'బ్యాడ్ రోమాన్స్' ఆల్బమ్ కు ఈ యమ్ టివి వీడియో మ్యూజిక్ అవార్డులను సోంతం చేసుకున్నారు. బెస్ట్ ఫీమెల్ అవార్డు తీసుకుంటూ తన మనసులోని మాటలను తన ఆనంద భాష్పాలను తెలియజేశారు. అలాగే బెస్ట్ మేల్ సింగర్ గా 'ఎమినిమ్' తన హిప్-హాప్ వీడియోకి తీసుకోవడం జరిగింది. '30 సెకండ్స్ టు మార్స్' కి బెస్ట్ రాక్ వీడియో అవార్డు, బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అవార్డుని 'జస్టిన్ బైబర్' సోంతం చేసుకున్నారు. ఆ సమయంలో 'జస్టిన్ బైబర్' మాట్లాడుతూ నేను కెనడా లోని ఒక చిన్నపట్టణం నుంచి వచ్చాను. నేను ఇవాళ ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు నా ప్యామిలికి చెందుతుంది. దానికి కారణం నన్ను ప్రోత్సహించినందుకు. సినిమాటోగ్రఫీ అవార్డు జే-జడ్ మరియు అలైకా కీస్ కి 'ఎంపైర్ స్టేట్ అఫ్ ద మైండ్' కిగాను ఇవ్వడం జరిగినది. మొత్తం ఈ అవార్డుల ఫంక్షన్ అంతా కోలాహాలంగా జరిగింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu