»   » "వండర్ వుమన్" కళ్ళు చెదిరే వసూళ్లు..., "ది మమ్మీ" నికూడా తొక్కి పడేసింది

"వండర్ వుమన్" కళ్ళు చెదిరే వసూళ్లు..., "ది మమ్మీ" నికూడా తొక్కి పడేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

వండర్ వుమన్ పెద్దగా పేరుపొందిన స్టార్లు లేకపోయినా, ఒక లేడీ డైరెక్టర్‌ రూపొందించిన ఒక హీరోయిన్ ఓరియంటెడ్‌ సినిమా కళ్ళు చెదిరే వసూళ్లను సాధించడం విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఒక్కొక్క రోజు గడుస్తూంటే వండర్ వుమెన్ చేసే సాహసాల తో కలెక్షన్ల వరద ముంచెత్తుతోంది. నిజంగానే బాక్సాఫీస్ వండర్ గా నిలబడిందీ సినిమా....

టామ్‌ క్రూయిస్‌

టామ్‌ క్రూయిస్‌

ఆశ్చర్య కరంగా ‘వండర్‌ వుమన్' దెబ్బకు ప్రియాంకా చోప్రా నటించిన ‘బేవాచ్' బాక్సాఫీస్‌ వద్ద నిండా మునిగిపోగా, టామ్‌ క్రూయిస్‌ వంటి సూపర్‌స్టార్‌ నటించిన ‘ద మమ్మీ' సైతం రెండో స్థానానికి పడిపోయింది. అంటే స్టార్ హీరోలనీ, పెద్ద పబ్లిసిటీ ని కూడా అధిగమించి మరీ విజృంబిస్తోందీ సినిమా...

నమ్మలేని నిజం

నమ్మలేని నిజం

తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 223 మిలియన్ డాలర్లు (రూ. 1435 కోట్లు) వసూలు చేసిన ఈ సినిమా వారం పూర్తి అయ్యేపాటికి 420 మిలియన్ డాలర్లు (రూ. 2700) వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. క్రేజ్ ఉన్న స్టార్లు లేకపోయినా లేడీ డైరెక్టర్ డైరెక్ట్ చేసిన ఒక హీరోయిన్ ఓరియంటెడ్ యాక్షన్ సినిమాకు ఈ స్థాయి కలెక్షన్లు రావడం అందరికీ నమ్మలేని నిజంగా ఉంది.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్

2003లో వచ్చిన ‘మాన్ స్టర్' తర్వాత ప్యాటీ జెన్కిన్స్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ను 32 ఏళ్ళ ఇజ్రాయెలి నటీమణి గాల్ గడోట్ పోషించింది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సినిమాల ద్వారా సినీ ప్రపంచానికి సుపరిచితురాలైన ఈ అమ్మడు ‘బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్' సినిమాలో తొలిసారిగా వండర్ వుమన్ డయానా ప్రిన్స్ పాత్రను పోషించింది.

జస్టిస్ లీగ్

జస్టిస్ లీగ్

మరో హాలీవుడ్ సినిమా ‘జస్టిస్ లీగ్'లోనూ ఇదే పాత్రలో నటించబోతోంది. 'ది మమ్మీ' సినిమాను కూడా పక్కకు నెట్టి ముందుకు వచ్చి బాక్స్ ఆఫీసు వద్ద మొదటి స్థానంలో నిలబడుతుందని ఎవ్వరూ ఊహించను కూదా లేదు. నిజానికి ప్రియాంకా చోప్రా నటించిన బేవాచ్ ని దాటటం పెద్ద కష్టమేం కాదు. మొదటి రోజునుంచీ ఈ సినిమా మీద ఆశలు తగ్గు ముఖం పట్టాయ్. కానీ ఎంతో క్రేజ్ ఉన్న స్టార్ టాం క్రూజ్, మమ్మీ లాంటి సినిమాని కూడా ఈ వండర్ ఉమెన్ తొక్కి పడేయటం అంటే మాటలు కాదు.

English summary
“Wonder Woman” wrapped up Tom Cruise’s “The Mummy” at the weekend box office, pulling in an estimated $57.2 million in North American theaters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X