»   » ఆమె క్యారెక్టర్ తెలిసిపోవడంతో.. ఆమె అంటేనే హడలిచస్తున్నారు..!

ఆమె క్యారెక్టర్ తెలిసిపోవడంతో.. ఆమె అంటేనే హడలిచస్తున్నారు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ హాట్ హీరో జానీ డెప్ ప్రస్తుతం ది టూరిస్ట్ అనే సినిమాలో నటిస్తూ బిజీగా వుంటున్నాడు. కానీ ఆయన భార్య వనిస్సా పారడిస్ మాత్రం చాలా గుబులుగా ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తయి గండం గడుస్తుందా అని ఎదురుచూస్తోందట. దీనికి ప్రధాన కారణం ఇందులో నాయికగా ఏంజలీనా జోలీ నటిస్తుండటమే. ఇంతకు ముందు ఏంజలీనా ఇలాగే మిస్టర్ అండ్ మిసెస్స్ స్మిత్ సినిమాలో నటిస్తుండగా అందులో హీరోగా నటిస్తున్న బ్రాడ్ పిట్ ను తన వైపు తిప్పుకుని జెన్నిఫర్ అనిస్టాన్ కాపురంలో చిచ్చు పెట్టి ఆమె గుండె మంటకు కారణం అయింది. దీంతో తిరిగి ఏంజలీనా ఎక్కడ ఈ కథను తన భర్త విషయంలో కూడా పునరావృతం చేసి తమ 12 ఏళ్ల కాపురాన్ని కూల్చేస్తుందోనని ఆమె భయపడుతోందట.

వీటికి తోడు త్వరలో ఏంజలీనా-బ్రాడ్ ల జంట విడిపోనుందనే వార్తలతో పాటు సినిమాలో ఏంజలీనా-డెప్ ల మధ్య హాట్ హాట్ సన్నివేశాలు వుండటంతో ఎక్కడ తన భర్త ప్రపంచంలోనే అందమయిన యువతిగా ఎంపికయిన ఏంజలీనా వైపు మొగ్గుచూపుతాడో అని ఆమె భయపడుతోందిట. దీంతో ఆమె ప్రతీ రోజూ జానీ డెప్ కు ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకొమ్మని బ్రతిమలాడుతోందట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X