»   » సొమ్ము చేసుకునేందుకు స్కెచ్, హాలీవుడ్ కు సంక్రాంతి సెంటిమెంటా?

సొమ్ము చేసుకునేందుకు స్కెచ్, హాలీవుడ్ కు సంక్రాంతి సెంటిమెంటా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంక్రాంతి పండుగ అంటే మన దేశంలో సినిమా వాళ్ల పండగ అన్నట్లుగా మారింది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఇది మరీను. అందుకే సినిమావాళ్లు తమ సినిమా రిలీజ్ లను సంక్రాంతికి పెట్టుకుంటారు. వరస శెలవులు రావటం, సంక్రాంతి స్పెషల్ అకేషన్ కావటం కలిసివస్తోంది. ఇప్పుడు సంక్రాంతి రేసులోకి ఊహించని ఓ సినిమా వస్తోంది.

‘xXx: Return of Xander Cage’ joins Sankranthi race

బాలీవుడ్ హీరోయిన‌ దీపిక పదుకొణే ప్రస్తుతం ట్రిపుల్ ఎక్స్ ది రిటర్న్ ఆఫ్ ది జాండర్ కేజ్ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తున్న‌ది. సెరీనా ఉంజర్ పాత్రలో దీపిక పదుకొణే కనిపించనుండగా హీరో విన్ డీజెల్‌తో పోటి పడుతూ ఈ చిత్రంలో నటించింది. తాజాగా చిత్ర ఇంగ్లీష్ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం చాలా ఆసక్తికరంగా ఉండగా, సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. దీంతో హాలీవుడ్ మూవీ ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు.

ఈ సినిమా3 మిగతా ప్రపంచ దేశాలన్నింటికంటే భారత్‌లో ముందుగా విడుదల కాబోతోంది. సంక్రాంతికి ఈ సినిమా వస్తోంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలియజేసింది దీపిక.

''ఇండియాలో ముందుగా 'ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌' విడుదలవుతుందని చెప్పేందుకు థ్రిల్‌ ఫీలవుతున్నా. ప్రపంచంలో అన్ని చోట్ల కంటే ముందుగా జనవరి 14న వస్తోంది'' అని ఆమె తెలిపింది. ఈ సినిమాలో టైటిల్‌ పాత్రధారి విన్ డీజిల్‌ జోడీగా ప్రధాన పాత్రలో ఆమె కనిపించనుండటం గమనార్హం.

సెరెనా ఉంగర్‌ అనే పాత్రలో ఆమె అలరించనుంది. డానీ యెన్, టోనీ జా, శామ్యూల్‌ ఎల్‌. జాక్సన్, నీనా దోబ్రెవ్‌, రూబీ రోజ్‌ కీలక పాత్రధారులైన ఈ యాక్షన్ సినిమాకు డి.జె. కరూసో దర్శకుడు. 'ట్రిపుల్‌ ఎక్స్‌' సీరిస్‌లో ఇది మూడో సినిమా. భారత్ మినహా అమెరికా సహా మిగతా అన్ని దేశాల్లో అది జనవరి 20న విడుదల కానుంది.

English summary
‘xXx: Return of Xander Cage’ joining the Sankranthi race. The film also features Deepika Padukone who plays a character named Serena Unger. It is a sequel to “xXx” (2002) and “xXx: State of the Union” (2005) films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu