»   » నీ ముఖానికి సినిమాలెందుకు పోపోమ్మా అని అవమానించారట

నీ ముఖానికి సినిమాలెందుకు పోపోమ్మా అని అవమానించారట

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవతార్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తార జియో సల్దానా. అవతార్ లో నెయిత్రి పాత్రలో అద్బుతంగా నటించిన ఈమె ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ అవతార్ సినిమా విడుదలకు ముందు తన పరిస్థితి ఎంత దారుణంగా వుండేదో చెప్పుకొచ్చింది. అవతార్ సినిమాకు ముందు ఎంతో మంది దర్శకనిర్మాతలను కలిసాను. కానీ వారెవ్వరూ నాకు అవకాశాలు ఇవ్వలేదట. కారణం నా నల్లటి మేనీ ఛాయే అని వాపోయిందీ అవతారిణి.

కలిసిన ప్రతీ దర్శకనిర్మాతా నీకు మా సినిమాకు కావాల్సిన అర్హతలు లేవు.. నల్లరాతి శిల్పంలా వున్నావు అని మొహం మీదే చెప్పేసేవారని వాపోయింది. ఇక ఆ తర్వాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుండీ పిలుపు రావడంతో ఉప్పొందిపోయాను. ఆయనతో సినిమా అనగానే వెంటనే ఒప్పుకున్నాను. సినిమా మొదలయ్యాక గానీ తెలియలేదు సినిమాలో నా పాత్ర నల్లగా వుండాలి కాబట్టే నన్ను ఎన్నుకున్నారని. ఏదయితేనేం హాలీవుడ్ లో వర్ణవివక్షే నాకు కలిసొచ్చింది. అవతార్ వంటి అద్భుతమయిన సినిమాలో నటించే అవకాశాన్ని ఇచ్చింది అని సంబరపడిపోయింది నెయిత్రి..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu