For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బీచ్‌లో బికినీ వేసుకోకుండా.. చీరె కట్టుకోవాలా? 7 డేస్ 6 నైట్స్ హీరోయిన్ షాకింగ్ కామెంట్

  |

  ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన 7 డేస్ 6 నైట్స్ చిత్రం కేవలం యూత్ కోసమే కాకుండా కుటుంబ సభ్యులందరూ చూసే విధంగా ఉంటుంది. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇదొక ఫన్ ఫిల్మ్. టోటల్‌గా స్టోరీ నచ్చింది. టీనేజ్, యంగ్‌స్ట‌ర్‌ వైబ్స్ ఉన్న కథ. ఇంతకు ముందు ఎంఎస్ రాజు గారు చేసిన సినిమాలు చూశా. ఆయనతో సినిమా అనగానే ఎగ్జైట్ అయ్యాను. కథ కూడా నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాను అని హీరోయిన్ మెహర్ చాహల్ అన్నారు.

  సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ సమర్పణలో సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మించారు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఇందులో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలు. సినిమా జూన్ 24న విడుదలవుతున్న నేపథ్యంలో మెహర్ చాహల్ మాట్లాడుతూ..

  నా ఫోటోలు ఎంఎస్ రాజు చూసి..

  నా ఫోటోలు ఎంఎస్ రాజు చూసి..

  నేను అస్సాంలో జన్మించాను. మా నాన్నగారు టీ ప్లాంటేషన్స్‌లో వర్క్ చేసేవారు. అందువల్ల, దేశంలో చాలా ప్రాంతాలు తిరిగా. చివరకు, ముంబైలో సెటిల్ అయ్యా. వర్క్ నిమిత్తం నాలుగైదేళ్లుగా ముంబైలో ఉంటున్నాను. ఇప్పుడు నా తల్లిదండ్రులతో కోల్‌క‌తాలో ఉంటున్నాను. గతంలో కొన్ని సినిమాలకునేను ఆడిషన్స్ ఇచ్చాను.

  ముంబైలో మా మేనేజర్ దగ్గర నా ఫోటోలు ఎంఎస్ రాజు గారు చూశారట. తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం ఆడిషన్స్ ఇస్తారా? అని అడిగిన వెంటనే నేను హైదరాబాద్ వచ్చి ఆడిషన్ఇచ్చాను. నా ఆడిషన్ నచ్చి నన్ను సెలెక్ట్ చేశారు అని మెహర్ చాహల్ చెప్పింది.

  హౌస్‌ఫుల్ మూవీలో ఫన్ ఎలిమెంట్స్‌తో

  హౌస్‌ఫుల్ మూవీలో ఫన్ ఎలిమెంట్స్‌తో

  7 డేస్ 6 నైట్స్ చిత్రం నా పాత్ర పేరు రతికా. గోవాలోని ఒక రెస్టారెంట్‌లో వర్క్ చేసే క్యారెక్టర్. సాధారణంగా ఉండే యువతి పాత్ర. నా పాత్ర గురించి అంతకుమించి చెప్పకూడదు. సుమంత్ అశ్విన్‌కు జోడిగా నటించాను. హిందీలో హౌస్‌ఫుల్‌ సిరీస్‌లో జోక్స్ ఎలా ఉంటాయో... అలాంటి జోక్స్ ఉంటాయి. ప్రేక్షకులు చాలా వినోదాన్ని ఆస్వాదిస్తారు అని మెహర్ చెప్పింది.

  గోవా వాతావరణంలో కథ

  గోవా వాతావరణంలో కథ

  7 డేస్ 6 నైట్స్ చిత్రం బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రం కాదు. గోవా వాతావరణంలో కథ నడుస్తుంది కాబట్టి.. బికినీ లేదా స్విమ్ సూట్ వేసుకుంటాం! బీచ్‌లో లేదా సముద్రంలో చీరలు కట్టుకొని కనిపించలేం కదా.. బీచ్‌లో కనిపిస్తే.. బికినీలోనే స్విమ్ చేస్తూ కనిపిస్తాం కదా. సన్నివేశాలను బట్టి దుస్తులు ధరించాం. ఈ సినిమాలో అశ్లీలత, అసభ్యత ఉండదు. మంచి వినోదాత్మక చిత్రం అని మెహర్ చాహల్ పేర్కొన్నది.

  అందాలు ఆరబోసే పాత్రల్లో

  అందాలు ఆరబోసే పాత్రల్లో

  గ్లామర్ హీరోయిన్‌గా నటించడానికి, అందాలు ఆరబోసే పాత్రల్లో కనిపించడానికి అభ్యంతరం లేదు. స్క్రిప్టు, సన్నివేశాలు డిమాండ్ చేస్తే.. గ్లామర్ షోకు సిద్దమే. కాకపోతే వల్గారిటీ ఉండకూడదు. ప్రేక్షకుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండే పాత్రల్లో నటించడానికి సిద్దమే. నాకు ఎలాంటి పరిమితులు లేవు అని మెహర్ చాహల్ చెప్పింది.

  7 డేస్ 6 నైట్స్ చిత్రం న్యూ ఏజ్ సినిమా. యంగ్ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే సినిమా. వయసులో గానీ.. ఇండస్ట్రీలో సీనియర్ అయినా ఎంఎస్ రాజు గారు అందరితో కలిసిపోయారు. కథ, కథనాలు, సన్నివేశాల పరంగా ఎలాంటి ఏజ్ గ్యాప్ లేకుండా ఆలోచించడం నాకు ఆశ్చర్యం అనిపించింది. కొత్తగా నేర్చుకోవాలనేతపన ఆయనలో ఉంటుంది. అందువల్లే, ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్స్‌తో ఆయన ఇంకా హిట్ సినిమాలు తీస్తున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొన్నారు అని మెహర్ చాహల్ తెలిపింది.

  సతి చిత్రంలో నటించా

  సతి చిత్రంలో నటించా

  నాకు నచ్చిన నటులు ఎవరంటే.. బాలీవుడ్‌లో కల్కి కొష్లీన్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ... రియాలిటీకి దగ్గరగా ఉన్న పాత్రలు చేసే వారు నచ్చుతారు. తెలుగు సినిమాలు తక్కువగా చూశా. ప్రభాస్, రానా దగ్గుబాటి, తమన్నా, ధనుష్ హిందీలోనూ సినిమాలు చేశారు కదా! వాళ్ళు తెలుసు. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా గురించి తెలుసుకుంటున్నాను. 7 డేస్ 6 నైట్స్ తర్వాత సతి మూవీలో నటించాను. అందులోనూ సుమంత్ అశ్విన్ హీరో. అదొక థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాలో పాత్రకు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నా అని చెప్పింది.

  English summary
  Popular Producer and director MS Raju's 7 days 6 night is set to release on June 24th. Here is the Heroine Mehar Chahal's Interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X