twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ తగ్గడం ఆయన గొప్పతనం.. గురు పాత్ర అందుకే హైలెట్.. ఆది పినిశెట్టి ఎమోషనల్

    |

    నేను హీరోగా, విలన్‌గా చేశాను. ఆ రెండు పాత్రలు చాలా కంఫర్ట్‌గా అనిపించాయి. ఆ క్యారెక్టర్స్‌ను జనాలు నమ్మేలా వాళ్ళలోకి తీసుకువెళ్ళడం ఛాలెంజ్. హీరోగా చేస్తున్నానా? నాది నెగిటివ్ క్యారెక్టరా? అనే ఎలాంటి అభ్యంతరాలు లేవు అని ఆది పినిశెట్టి తెలిపారు. రామ్ పోతినేనితో కలిసి ఆది పినిశెట్టి నటించిన ది వారియర్ చిత్రం జూలై 13న రిలీజై మంచి మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో ఆది పినిశెట్టి మీడియాతో మాట్లాడుతూ..

    రామ్‌కు గాయం కావడంతో మూడు నెలలు

    రామ్‌కు గాయం కావడంతో మూడు నెలలు

    హీరో రామ్ వెన్నుముకకు గాయం కావడంతో మూడు నెలలు షూటింగ్ వాయిదా వేశారు. ఆ సమయంలో నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే.. గురు పాత్రకు ఓ గెటప్ ఉంది. అయితే వేరే సినిమాల ఆఫర్లు నాకు వస్తున్నాయి. వాటిని ఒప్పుకోలేను. అలాగే గెటప్ సమస్య. ఆ విషయంపై నిర్మాతలతో నేను మాట్లాడాను. కానీ రామ్ జరిగిన గాయం తీవ్రమైనది. ఆ గాయ కూడా చిన్నది కాదు. వెంటనే షూటింగ్ చేస్తే గాయం పెద్దది కావచ్చు. ఒకవేళ ఆ టైమ్‌లో నాకు గాయమైతే వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు కదా! మనం ఏమీ చేయలేం. టెన్షన్ పడినాచివరకు కంప్లీట్ చేశాం అని ఆది పినిశెట్టి తెలిపారు.

    క్లైమాక్స్ ఫైట్ 10 రోజులు షూట్

    క్లైమాక్స్ ఫైట్ 10 రోజులు షూట్

    ది వారియర్ సినిమాలో రామ్‌కు నాకు మధ్య హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్‌ను ఓ సాంగ్‌లో 10 రోజులు షూట్ చేశాం. క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ సాంగ్ షూటింగ్ మాదిరిగా జ‌రిగింది. ఆ ఫైట్‌లో రామ్‌, నాకు మ‌ధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. మా ఇద్దరి మధ్య కోఆర్డినేష‌న్ బావుంటుంది. మేమిద్దరం ఫైట్ చేస్తుంటేసాంగ్ లో డ్యాన్స్ చేస్తున్నట్టుఉందనిడైరెక్టర్ లింగుసామి అన్నారు. ఇద్దరు హీరోలు సింక్‌లో ఉన్నప్పుడు అలా కుదురుతుంది. రామ్ గ్రేట్ పెర్ఫార్మర్. గ్రేట్ డ్యాన్సర్. డ్యాన్సర్‌కు ఫైట్‌లో సింక్ కుదురుతుంది. నేను అంత గ్రేట్ డ్యాన్సర్కాకపోయినా మాకుసింక్ కుదిరింది. మేం కష్టపడి ఏమీచేయలేదు. ఈ క్రెడిట్ అన్బు అరివు మాస్టర్లదే అని ఆది చెప్పాడు.

     నన్ను తమిళోడు అనుకొంటారు

    నన్ను తమిళోడు అనుకొంటారు

    తెలుగు, తమిళ భాషల్లో నాకు గుర్తింపు ఉండటం చాలా సంతోషంగా ఉంటుంది. తమిళ వాళ్ళు నేను తెలుగు వాడినిఅనుకుంటున్నారు. తెలుగు వాళ్ళు తమిళోడినిఅనుకుంటున్నారు. అది పక్కన పెడితే... ఇప్పుడు ప్రేక్షకులు భాషను పట్టించుకోవడం మానేశారు. మంచి కథ, సినిమా, పెర్ఫార్మన్స్ వస్తే ఆదరిస్తున్నారు. భాషతోసంబంధం లేకుండా సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు అని ఆది అన్నాడు.

    మా నాన్న ఏం చెప్పారంటే..

    మా నాన్న ఏం చెప్పారంటే..

    మా ఇంటిలో మా ఫ్యామిలీ మధ్య ఎప్పుడూ సినిమా గురించే చర్చ నడుస్తుంటుంది. నాన్న రవిరాజా పినిశెట్టి‌తో నా పాత్రల గురించి డిస్కస్ చేస్తా. ఆయన ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు. ఆయనతో మాట్లాడకపోతే చాలా లాస్ అవుతాం. నా సినిమాలు, పాత్రల విషయానికి వస్తే.. ఎక్కువ పాజిటివ్ పాయింట్స్ చెప్పరు. నాలో నెగిటివ్ పాయింట్స్ చెప్తారు. ది వారియర్ సినిమాలో యాస కొంచెం బాగుంటే బెటర్‌గా ఉండేదని చెప్పారు. కొన్ని సన్నివేశాల్లో నా పెర్ఫార్మన్స్ బాగుందన్నారు. నేను నటించిన గురు పాత్ర హైలైట్ అయ్యిందంటే.. అది రామ్ గొప్పదనం అని చెప్పారు. అతను కొంచెం తగ్గడం వల్ల నాకు ఇంత పేరు వచ్చిందని అని ఆది పినిశెట్టి చెప్పారు.

     నిక్కీ గల్రానీతో పెళ్లి తర్వాత

    నిక్కీ గల్రానీతో పెళ్లి తర్వాత

    నిక్కీ గల్రానీతో పెళ్లి తర్వాత నా లైఫ్‌లో ఎలాంటి మార్పులు లేవు. పెళ్లికి ముందు ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. పెళ్ళికి ముందు మోడ్రన్ లవ్ హైదరాబాద్‌ వెబ్ సిరీస్‌లో మాదిరిగా ఉండేవాళ్ళం ఏమో!పెళ్లి తర్వాత, ఇప్పుడు చాలా బాగున్నాం.నాకూ, తనకూమమ్మల్ని అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అంతా హ్యాపీగాఉంది అని ఆది చెప్పారు.

    English summary
    Actor Aadhi Pinisetty's latest movie The Warriorr is doing good at box office. In this occassion, He reveals interesting facts of Nikki Galrani marriage and love proposal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X