For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రెగ్నెన్సీ క్యారెక్టర్‌తో సమంత యాక్షన్ సీన్లు .. బిడ్డను కాపాడుకొంటూ స్క్రీన్‌పై ఫైట్ కేక

  |

  శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో సమంత రుత్ ప్రభు నటించిన యశోద సినిమా నవంబర్ 11న రిలీజ్‌కు సిద్దమైంది. హరీ, హరీష్ దర్శక ద్వయం రూపొందించిన ఈ సినిమాలో ఎమోషన్స్‌తోపాటు యాక్షన్ సీక్వెన్సెస్, సమంత ఫైట్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌ మారనున్నాయి. సరికొత్త అనుభూతిని కలిగించే విధంగా యాక్షన్ కోరియోగ్రాఫర్ యానిక్ బెన్ యాక్షన్ సీక్వెన్స్ రూపందించారు. ఈ ఫైట్స్ గురించి యానిక్ బెన్ మాట్లాడుతూ..

  ఫ్యామిలీ మ్యాన్ సిరీస్..

  ఫ్యామిలీ మ్యాన్ సిరీస్..


  సాధారణంగా నేను స్టొరీలోని పాజిటివ్ అంశాలను బేరిజు వేసుకొని ప్రాజెక్టులను అంగీకరిస్తాను. స్టార్స్ ఉన్నా నేను కథ బాగా లేకపోతే నేను సినిమాలు చేయను. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌ కోసం సమంతతో కలిసి పనిచేశారు. సమంత డెడికేషన్ ఉన్న యాక్టర్. ప్రెగ్నెన్సీతో ఉన్న క్యారెక్టర్‌కు యాక్షన్ పార్ట్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. యశోద సినిమాలో యాక్షన్ సిన్స్ కొత్తగా ఉంటాయి అని యానిక్ బెన్ అన్నారు.

  సమంతతో అలాంటి క్లోజ్‌నెస్..

  సమంతతో అలాంటి క్లోజ్‌నెస్..


  యశోద సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫి చేయడానికి ప్రధాన కారణం స్టోరి, అందులోని క్యారెక్టర్లు. అందుకే ఈ ప్రాజెక్టులో భాగమయ్యాను. అది కాకుండా ఫ్యామిలీ మ్యాన్ షూటింగులో సమంతతో క్లోజ్ అయ్యాను. దాంతో ఆమెతో సినిమా అని చెప్పగానే.. నేను చేయడానికి ఒకే అన్నాను. డ్రామాతో యాక్షన్ పండించే అతికొద్ది మంది హీరోయిన్లలో సమంత ఒకరు. మళ్లీ మళ్లీ కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తుంటాను అని యానిక్ బెన్ చెప్పారు.

  ఆడా? మగా? అనే తేడా లేకుండా

  ఆడా? మగా? అనే తేడా లేకుండా


  సమంతకు యాక్షన్ సీన్స్ డిజైన్ చేసేటప్పుడు.. ఆమె ఆడా? మగా? అనే తేడాను పట్టించుకోలేదు. కథకు, ఆమె క్యారెక్టర్‌కు ఏం కావాలో ఆ విధంగా ఫైట్స్ డిజైన్ చేశాను. కొందరు యాక్టర్లు యాక్షన్ సీన్ల షూట్ అంటే అదే రోజు వచ్చి.. మాకు ఎలా చేయించాలో చూపించమని అంటారు. కానీ సమంత విషయానికి వస్తే.. రేపు ఏం షూట్ చేస్తున్నారు.. తను ఏం చేయాలి.. ఎలా ప్రిపేర్ కావాలనే విషయం గురించి తెలుసుకొని ఉంటారు. ముందే ప్రిపేర్ అయి రెడీగా ఉంటారు అని యానిక్ బెన్ అన్నారు.

  రాజీ వేరు.. యశోద వేరు..

  రాజీ వేరు.. యశోద వేరు..

  ఫ్యామిలీ మ్యాన్‌లో రాజీ పాత్ర, యశోద క్యారెక్టర్లు వేర్వేరు. వారి బ్యాక్ డ్రాప్ వేరు. రాజీ ట్రైనింగ్ పొందిన కార్యకర్త. ఆమె ప్రపంచం వేరు. ఇక యశోదలో ప్రెగ్నెంట్ ఉమెన్ పాత్రను సమంత పోషించారు. అయితే గర్బంతో ఉన్న మహిళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఫైట్స్ డిజైన్ చేశాను. కడుపులో బిడ్డ ఉన్న తల్లి చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా ఎమోషనల్‌గా స్క్రీన్ పై ఉంటాయి అని యానిక్ బెన్ చెప్పారు.

  ప్రెగ్నెంట్‌తో యాక్షన్ సీన్లు..

  ప్రెగ్నెంట్‌తో యాక్షన్ సీన్లు..


  ఇప్పటి వరకు హీరోలకు యాక్షన్ సీక్వెన్స్ రూపొందించాను. కానీ నా కెరీర్‌లో తొలిసారి గర్బవతి క్యారెక్టర్‌కు ఫైట్స్ కంపోజ్ చేయడం చాలా ఛాలెంజింగ్ ఉంది. గర్బంతో ఉన్న మహిళ తన కడుపును కదలకుండా ఫైట్ చేయాలి. కడుపులోని బిడ్డను రక్షించుకోవాలి. తన శరీరానికి ఎలాంటి హానీ కలగకుండా క్యారెక్టర్ బిహేవ్ చేయాలి. అలా బాడీ లాంగ్వేజ్ సెట్ చేయాల్సి వచ్చింది అని యానిక్ బెన్ తెలిపారు.

  English summary
  Action Choreographer Yannick Ben's upcoming thriller Yashoda, is in awe of Samantha’s dedication to get the action right.  The French national, who has worked extensively in Hollywood, has worked with stars such as Shahrukh Khan in Bollywood and Suriya in the South. But when it comes to picking work, he is a purist.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X