twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా మోసపోయాను.. ఎక్కువైందిరా.. ఇంతకంటే ఏం కావాలిరా అంటారు.. అర్జున్

    By Rajababu
    |

    మా పల్లెలో గోపాలుడు చిత్రంతో యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ తర్వాత విభిన్నమైన చిత్రాలతో ఆకట్టుకొన్నాడు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ పొందారు. తాజాగా తమిళంలో రూపొందిన ఇరంబు తిరై చిత్రంలో విలన్ కనిపించాడు. ఈ చిత్రం అభిమన్యుడు పేరుతో తెలుగులో జూన్ 1 రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

    17 ఏళ్ల క్రితమే డిఫరెంట్ రోల్స్

    17 ఏళ్ల క్రితమే డిఫరెంట్ రోల్స్

    అభిమన్యుడు చిత్రంలో నా విభిన్నమైన పాత్ర. ఏ నటుడైనా ఈ చిత్రాన్ని చూస్తే ఇలాంటి పాత్ర నేను ఎందుకు చేయలేదు అని అసూయ పడే రోల్ నాది. 155 పైగా చిత్రాలు నటించాను. కాబట్టి ప్రత్యేకమైన రోల్స్ పోషించాలని అనుకొన్నాను. 17 ఏళ్ల క్రితమే ద్రోహిలో డిఫరెంట్ రోల్స్ చేశాను. కొత్తగా డిఫరెంట్‌గా ఏదైనా చేస్తే సంతృప్తి ఉంటుంది.

    పెద్ద తప్పు చేసినట్టు అయ్యేది

    పెద్ద తప్పు చేసినట్టు అయ్యేది

    అభిమన్యుడు చిత్రంలో నేను చేసిన గ్రే షేడ్ క్యారెక్టర్‌ను మీరు ఎక్కడా చూసి ఉండరు. సినిమా చూస్తే మీకే అర్థం అవుతుంది. ఈ సినిమా అవకాశాన్ని వదులుకొంటే జీవితంలో పెద్ద తప్పు చేసిన వాడిని అయ్యేవాడిని. గ్రే క్యారెక్టర్‌లో కూడా పొసెసివ్‌నెస్ ఉంటుంది. ఒకే ఒక్కడు, జైహింద్, జెంటిల్మన్ సినిమాలకు ఎంత అప్రిషియేషన్ వచ్చిందో.. ఈ సినిమాలో నటించినందుకు అలాంటి రెస్పాన్స్ వచ్చింది.

    నేను అలా మోసపోయాను

    నేను అలా మోసపోయాను

    సినిమాలోని పాత్రలకే కాదు.. నిజజీవితంలో కూడా మోసానికి గురయ్యాను. ఐ ట్యూన్స్‌లో 10 డాలర్లు పోయాయి. ఎవరినీ అడుగుతాం. ఎలా పోయాయో తెలియడం లేదు. స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో ఎంత లాభముందో.. అంతే మొత్తంలో మోసానికి గురయ్యే అవకాశం ఉంది. అందుకే మామూలు నోకియా ఫోన్‌ను కొనుక్కొన్నాను.

    టెక్నాలజీతో లాభం, నష్టం

    టెక్నాలజీతో లాభం, నష్టం

    కొన్నింటిని డౌన్‌లోడ్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్‌ వస్తుంటాయి. వాటిని నొక్కితే ఏం జరుగుతుందో తెలియదు. అందులో ఏముంటుందో తెలియని పరిస్థితి. మనం దానిని పట్టించుకోకుండా నా సమ్మతమే (అగ్రి) అని బటన్ నొక్కుతాం. అందుకే మనం మోసాలకు గురవుతుంటాం. ఈ సినిమా ద్వారా ప్రజలకు, టెక్నాలజీ ఉపయోగించే వ్యక్తులకు అవగాహన కల్పించడానికి ప్రయత్నించాం.

     విలన్‌గా నటిస్తావా అని

    విలన్‌గా నటిస్తావా అని

    అభిమన్యుడు చిత్రంలో విలన్‌గా నటిస్తావా అని నన్ను అడుగడానికి విశాల్ సంకోచించారు. ఎందుకంటే నా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ విశాల్ పనిచేశారు. దాంతో డైరెక్టర్‌ను పంపించి కథ చెప్పించారు. కథ విన్న వెంటనే నాకు నచ్చింది. క్యారెక్టర్‌లో విషయం ఉంది. దాంతో ఒకే చెప్పాను. కొందరు కథ బాగానే చెప్తారు. కానీ బాగా తీయలేకపోతారు. కానీ మిత్రన్‌కు దర్శకుడిగా తొలి చిత్రమైనప్పటికీ అద్భుతంగా తెరకెక్కించారు. నేను చాలా మంది ఫస్ట్‌టైమ్ డైరెక్టర్లతో పనిచేశాను. అందులో శంకర్, గోపాల్ తదితరులు ఉన్నారు.

    నా పేరు సూర్య చిత్రంలో

    నా పేరు సూర్య చిత్రంలో

    ప్రస్తుతం మూడు భాషల్లో సినిమాలు చేస్తున్నాను. ఇటీవల నా పేరు సూర్య చిత్రంలో నటించాను. ముందు నేను ఆ సినిమాలో తండ్రి పాత్ర చేయడానికి నిరాకరించాను. కానీ తర్వాత దర్శక, నిర్మాతలు ఒప్పించడంతో సరే అన్నాను. ఇప్పుడు విలన్‌గా నటించాను. కానీ డీసెంట్ విలన్ పాత్ర చేశాను. విలన్ అంటే రేప్‌ సీన్లు ఉంటే ఒప్పుకోను. విలన్ అంటే మీనింగ్ ఫుల్ పాత్ర అయి ఉండాలి.

    హిందీలో డైరెక్షన్ చేస్తున్నా

    హిందీలో డైరెక్షన్ చేస్తున్నా

    జీవితంలో ప్లానింగ్ అంటూ ఉండదు. ఏది నచ్చితే అది చేస్తాను. హిందీలో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను. ఇటీవల నా కూతురు హీరోయిన్‌గా పెట్టి డైరెక్షన్ చేశాను. త్వరలో తెలుగులో విడుదల అవుతుంది. అలాగే మూడు భాషల్లో రూపొందించిన కాంట్రాక్టు అనే చిత్రంలో నటిస్తున్నాను. విజయ్ ఆంటోనితో సినిమా ఓ డిఫరెంట్ సినిమా చేస్తున్నాను.

    కోడి రామకృష్ణతో చిత్రం

    కోడి రామకృష్ణతో చిత్రం

    నాకు యాక్షన్ కింగ్‌గా పేరున్నప్పటికీ.. సెంటిమెంట్ సీన్లు బాగా పండించే అవకాశం దక్కింది. గతంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాణి రాణెమ్మ అనే చిత్రాన్ని ప్రారంభించాం. కానీ ఆయన ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. త్వరలోనే ఆ సినిమా మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ఆ సినిమాలో మీరు ఆశించిన విధంగా నా పాత్ర ఉంటుంది.

    జీవితంలో చాలా సాధించా

    జీవితంలో చాలా సాధించా

    మూడు భాషల్లో మంచి అభిమానులు ఉన్నారు. నా క్రేజ్‌ను బాగా ఉపయోగించుకొన్నాను. 20 ఏళ్ల క్రితమే సిక్స్ ప్యాక్ చేశాను. బాగా డబ్బు సంపాదించాను. ఇల్లు, ఫాంహౌస్ ఉన్నాయి. హనుమాన్ టెంపుల్ కట్టించాను. ఆస్తులు ఉన్నాయి. ఈ జీవితానికి ఇంత కంటే ఎక్కువగా ఏం కావాలి. దేవుడ్ని ఎక్కువగా కోరుకొంటే ఇంతకంటే ఎక్కువగా కోరుకొంటే.. చాలా ఎక్కువైందిరా.. ఇంతకంటే ఏం కావాలిరా అని దేవుడు అంటారు.

    English summary
    Action King Arjun talk about his latest project Abhimanyudu. Vishal, Samantha Akkineni are lead pair. Arjun is acting as Villain. In this occassion, He speaks to Telugu Filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X