twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ram Asur కృత్రిమ వజ్రం తయారీ.. అక్కడే హిట్టు కొట్టాం.. రామ్ అసుర్ సక్సెస్‌పై హీరో అభినవ్ సర్దార్

    |

    వెంకటేష్‌ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్‌ సర్ధార్‌, రామ్‌ కార్తీక్‌, చాందిని తమిళ్‌రాసన్‌, శాని సాల్మాన్‌, శెర్రీ అగర్వాల్‌ నటీనటులుగా ఎఎస్‌పి మీడియా హౌస్‌, జీవీ ఐడియాస్‌ పతాకాలపై అభినవ్‌ సర్ధార్‌, వెంకటేష్‌ త్రిపర్ణ సంయుక్తంగా కలిసి నిర్మించిన హై ఓల్టేజ్‌ లవ్‌సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ 'రామ్‌ అసుర్‌'. నవంబర్‌ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే హిట్‌ టాక్‌ను స్వంతం చేసుకుని, విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి నిర్మాతలలో ఒకరు, హీరో అయిన అభినవ్‌ సర్ధార్‌ పాత్రికేయులతో విజయానందాన్ని పంచుకున్నారు.

    Actor Abhinav Sardar about Ram Asur movie Success

    రామ్‌ అసుర్‌ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
    రామ్ అసుర్ సినిమా విజయాన్ని చాలా బాగా ఎంజాయ్‌ చేస్తున్నాం. మా టీం అందరూ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. వుయ్‌ ఆర్‌ వెరీమచ్‌ హ్యాపీ. నిజం చెప్పాలంటే సినిమా సక్సెస్‌ అవుతుంది అనుకున్నాం కానీ.. ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని మేం కూడా ఊహించలేదు. నటీనటులతో పాటు జె. ప్రభాకరరెడ్డి సినిమాటోగ్రఫీ, భీమ్స్‌ సిసిరోలియో గారి సంగీతం, యాక్షన్‌ పార్ట్‌ ఇలా అన్ని క్రాఫ్ట్‌ చక్కగా సమన్వయంతో పనిచేయడం వల్లనే సక్సెస్‌ వచ్చింది.

    రామ్ అసుర్ సక్సెస్‌కు ప్రధాన కారణం?
    రామ్ అసుర్ సక్సెస్ ప్రధాన కారణం తప్పకుండా కథే అని చెపుతాను. కృత్రిమంగా వజ్రం తయారీ అనేది వినటానికే చాలా కొత్తగా అనిపించే అంశం. ఈ అంశాన్ని కథగా తీసుకోవడమే మా సక్సెస్‌కు తొలి అడుగు.

    పీనెట్‌ డైమండ్‌ను రామ్‌ అసుర్‌గా ఎందుకు మార్చారు?
    ముందుగా ఈ సినిమాను చిన్నగా ఓటీటీ, యూట్యూబ్‌ బేస్డ్‌గా చేద్దామని ప్రారంభించాం. అయితే కథలో ఉన్న స్పాన్‌ రాను రాను మాకు అర్ధమైంది. దీంతో ఈ కథ విషయంలో మనం వెళుతున్న రూట్‌ కరెక్ట్‌ కాదు అని ఓ భారీ సినిమాకు కావాల్సిన హంగులను ఖర్చుకు వెనకాడకుండా సమకూర్చాం. ఈ విషయంలో నా ఫ్రెండ్స్‌ చాలా మంది ముందుకు వచ్చారు. ఇంత ఖర్చు పెట్టి తీసిన సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకుల దగ్గరకు తీసుకు వెళ్లాలంటే మాస్‌ లెవల్‌లో బాగా రీచ్‌ అయ్యే టైటిల్‌ పెడితే బాగుంటుందని 'రామ్‌అసుర్‌'గా మార్చాం.

    బిజినెస్‌ మ్యాన్‌గా బిజీగా ఉంటూ సినిమా కెరీర్‌ను కంటిన్యూ చేయడం ఇబ్బంది అనిపించడం లేదా?
    ఇబ్బంది ఏమీ లేదండీ అంతా ప్లానింగ్‌. ప్యాషన్‌, ప్లానింగ్‌ ఉంటే ఏమైనా..ఎన్నైనా చేయొచ్చు. గతంలో కింగ్‌ఫిషర్‌కి సౌత్‌ ఇండియా మార్కెటింగ్‌ హెడ్‌గా చేశాను. అలాగే కోకా కోలా కంపెనీ కోస్టల్‌ ఏరియాకు హెడ్‌గా కూడా చేశాను. ప్రస్తుతం నాకు స్వంతంగా కెఫేస్‌ ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ, అలాగే హైద్రాబాద్‌ తల్వార్స్‌ సెలబ్రిటీ క్రికెట్‌ టీం నాదే. ఇతర బిజినెస్‌లు కూడా ఉన్నాయి.

    మీ కెరీర్‌ను ఎలా డిజైన్‌ చేసుకుంటున్నారు?
    నేను మంచి నటుడుగా ఎదగాలని కోరుకుంటున్నా. కేవలం హీరోగా కాకుండా.. నెగెటివ్‌ క్యారెక్టర్స్‌ అయినా సరే నన్ను నేను ప్రూవ్‌ చేసుకుని ప్రేక్షకులను మెప్పించాలని కోరిక. తమిళం నుంచి 2,3 ఆఫర్స్‌ ఉన్నాయి. తెలుగులో కూడా ఆఫర్స్‌ వస్తున్నాయి. మా 'రామ్‌అసుర్‌'ను ఇంత పెద్ద హిట్‌ చేసిన ప్రేక్షకుల రుణం ఎప్పటకీ తీర్చుకోలేం. రాబోయే చిత్రాల్లో కూడా మిమ్మల్ని మెప్పించే పాత్రల్లోనే కనిపిస్తాను.

    ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్‌ ఏమిటి?
    'మిస్టేక్‌' అనే సినిమా చేస్తున్నాను. ఆల్‌మోస్ట్‌ అయిపోయింది. అది నా ఓన్‌ ప్రాజెక్ట్‌. ముగ్గురు హీరోయిన్స్‌, ముగ్గురు హీరోలు, నేను ప్రధాన పాత్రలం. కథ మొత్తం నా క్యారెక్టర్‌ చుట్టూనే తిరుగుతుంది. నాది నెగెటివ్‌ క్యారెక్టర్‌. హాలీవుడ్‌ స్థాయిలో గెటప్‌ ఉంటుంది. అక్వామేన్‌ టైపు. చాలా డిఫరెంట్‌ గెటప్‌.

    English summary
    Actor Abhinav Sardar about Ram Asur movie Success. He said, we have got success when we choose Artificial Diamond making.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X