కృష్ణ భగవాన్‌తో దారుణమైన గొడవ.. బిగ్ బాస్ 9 సుమన్ శెట్టి క్లారిటీ

టాలీవుడ్ లో నటుడు, కమెడియన్ సుమన్ శెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. తనదైన శైలిలో కామెడీని పండించి ప్రేక్షకులను అలరించాడు. నితిన్ - దర్శకుడు తేజ కాంబోలో రూపుదిద్దుకున్న జయం చిత్రం నుంచి సుమన్ శెట్టి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటున్నారు. అప్పటి నుంచి పదేళ్ల పాటు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమా ఆఫర్లను వినియోగించుకుంటూ వచ్చారు. మరోవైపు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకున్న కమెడియన్ కృష్ణ భగవాన్.

కృష్ణ భగవాన్ కూడా తెలుగు ప్రేక్షకుల్లో కమెడియన్ గా, నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సీనియర్ నటుడిగా సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పాపులర్ కామెడీ షో జబర్దస్త్ కామెడీ షోకు మేల్ జడ్జీగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన 30 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూ వస్తున్నారు. ఇక సుమన్ శెట్టి ప్రస్తుతం తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

Actor comedian Suman Shetty Gave Clarity

బిగ్ బాస్ సీజన్ 9లో సెలెబ్రెటీ కంటెస్టెంట్ గా సుమన్ శెట్టి హౌజ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. ఇదే సమయంలో ఆయన సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో గతంలో సుమన్ శెట్టి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటుడు, కమెడియన్ కృష్ణ భగవాన్ తో ఉన్న గొడవలపై స్పందించారు. అసలు అక్కడ జరిగిన విషయాన్ని పూర్తిగా చెప్పి క్లారిటీ ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ.. 'చందన బ్రదన్స్.. బొమ్మన సిస్టర్స్ చిత్రంలో నాకు ఆయనకు కలిపి ఒక సీన్ ఉంటుంది. ఒకరోజు షూటింగ్ లో నాకు లెన్తీ డైలాగ్స్ ఇచ్చారు. డైలాగ్స్ పెద్దగా ఉండటంతో నేను 4,5 టేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయన చిరాకు పడ్డారు. ఎక్కడి నుంచి వస్తారు నీ యయ్య.. అంటూ నసిగారు. ఆ వాయిస్ నాకు వినిపించింది. అప్పుడు నేను ఏమనలేదు. కానీ ఆ మూవీ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఆయనకు బదులిచ్చారు. నన్ను మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు. కొంచెం పెద్ద డైలాగ్స్, నోరు తిరగకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు ఏం పర్లేదని సర్ది చెప్పారు. కానీ కృష్ణ భగవాన్ మాటలకు కాస్తా బాధ అనిపించింది.

అయితే నాకు ఆ సినిమా చేసే సమయంలో ఇంకా ఇండస్ట్రీ కొత్తనే. తోటి ఆర్టిస్టులకు సపోర్ట్ ఇస్తే బాగుంటుందని అనిపించింది. ఇక ఇప్పుడు నాకు కూడా కొత్త వాళ్లు వచ్చి చెప్పినప్పుడు చాలా టేక్స్ తీసుకుంటే మనకూ అలానే అనిపిస్తుంది. మరోవైపు కృష్ణ భగవాన్ కు అప్పటికే కాళ్ల నొప్పులు ఉండేవి. దాంతో ఆయన నిల్చోవడానికి కాస్తా ఇబ్బంది పడేవారు. ఆ నొప్పితోనే నాపై చిరాకు పడ్డారని అనిపించింది. అంతే తప్ప పెద్ద గొడవ ఏమీ లేదని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X