Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్‌బాస్2పై నాని క్లారిటీ.. ఎన్టీఆర్ చేయకపోవడంపై క్లారిటీ అదేనట..
Recommended Video
సక్సెస్ జోరును కొనసాగిస్తున్న నేచురల్ స్టార్ నాని బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గతంలో హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకుల మన్ననలను అందుకొన్న ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడంతో బిగ్‌బాస్ అవకాశం నానికి చేతికి చిక్కిందనే వార్తలు ఊపందుకొన్నాయి. అయితే ఈ వార్తపై స్టార్ మా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో కొంత సందిగ్ధత నెలకొన్నది. కృష్ణార్జున యుద్ధం ప్రమోషన్లో భాగంగా నాని మీడియాతో మాట్లాడుతూ.. బిగ్‌బాస్ గురించి స్పందించారు.
బిగ్‌బాస్ గురించి చెప్పలేను..
బిగ్‌బాస్2 కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించడంపై ఇంకా క్లారిటీ లేదు. నేను దాని గురించి మాట్లాడటం ఇప్పుడే సరికాదు. స్టార్ మా నిర్వాహాకులే ప్రకటన చేస్తారు అని నాని అన్నారు. అయితే హోస్ట్‌గా వ్యవహరించడం లేదని గానీ, తనకు ఆఫర్ రాలేదు అని గానీ చెప్పకపోవడంతో నాని బిగ్‌బాస్ హౌస్‌కు రావడం ఖాయమని తేలిపోయింది.
ఎన్టీఆర్ బిజీగా
తెలుగులో బిగ్‌బాస్ కార్యక్రమానికి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలు ఉండటం కారణంగా బిగ్‌బాస్‌కు దూరం కావాలనుకొన్నాడు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత రాంచరణ్‌తో రాజమౌళి రూపొందించే మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు
త్రివిక్రమ్ కోసం
బిగ్‌బాస్‌ను వదులుకోవడానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ సినిమాలోని తన లుక్ అని తెలుస్తున్నది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ప్రత్యేకమైన లుక్‌లో కనిపించనున్నారు. ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ కోసం శ్రమిస్తూ దేహదారుఢ్యాన్ని పెంపొందించుకొంటున్నారు.
తొమ్మిదో సక్సెస్ కోసం రెడీ
కాగా, నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన నటించిన కృష్ణార్జున యుద్ధం ఏప్రిల్ 13న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఇప్పటికే ఎనిమిది సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకొన్న నాని తొమ్మిదో విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.