Madhubala రోజా సెన్సేషనల్ హిట్ తర్వాత కెరీర్ అలా.. తల్లి పాత్రలే ఎందుకంటే? మధుబాల మనోగతం

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌తో కలిసి పూల్ ఔర్ కాంటే చిత్రంలో నటించి హాట్ హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన రోజా సినిమాతో మధుబాల దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. తెలుగులో జెంటిల్మన్, ఆవేశం, అల్లరి ప్రియుడు, పుట్టినిల్లా? మెట్టినిల్లా? చిలక్కొట్టుడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగా..వివాహం చేసుకొని సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. అయితే సెకండ్ ఇన్సింగ్స్‌లో తల్లి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ప్రేమదేశం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన మధుబాల తన కెరీర్ అనుభవాలు పంచుకొంటూ..

దర్శకుల డిమాండ్ మేరకు

దర్శకుల డిమాండ్ మేరకు

నేను ఇటీవల కాలంలో నేను తల్లి పాత్రలకే పరిమితమయ్యాను. నేను పోషించిన తల్లి పాత్రలు సినిమాలో కీలకంగా మారాయి. అయితే ప్రేమదేశం సినిమాలో తల్లి పాత్రను నన్ను దృష్టిలో పెట్టుకొని రాశానని దర్శకుడు శ్రీకాంత్ చెప్పారు. అయితే మొదట ఆఫర్ వచ్చినప్పుడు నేను ఒప్పుకోలేదు. నటించేది లేనిది తర్వాత చెబుతానని పలుమార్లు చెప్పాను. అయితే చివరికి చాలా సార్లు ఫోన్ చేశారనే కారణంతో నేను ఒప్పుకొన్నాను. ప్రేమ దేశం టైటిల్‌ నాకు బాగా నచ్చింది అని మధుబాల చెప్పారు.

తల్లి పాత్రను ఎందుకు ఒప్పుకొన్నానంటే?

తల్లి పాత్రను ఎందుకు ఒప్పుకొన్నానంటే?

నేను, నా పిల్లలతో ఉన్న అటాచ్‌మెంట్ ప్రేమదేశం సినిమాలో కనిపించింది. అందుకే ఈ పాత్రను నేను ఒప్పుకొన్నాను. ప్రేమదేశంలో నా కూతురు పాత్రతో ఎమోషనల్ బాండింగ్ ఉండటం ఈ సినిమాను ఒప్పుకోవడానికి మరో కారణం. ఈ సినిమాలో మ్యూజిక్ ప్లస్ పాయింట్. మణిశర్మ బ్రిల్లియంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా కోసం నేను వారం రోజులు షూటింగ్ చేశాను. ప్రేమదేశం సినిమాలో త్రిగుణ్, మేఘా ఆకాశ్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్లిద్దరూ చాలా నేచురల్‌గా నటించారు. వారి వల్లే నేను నా పాత్రలో ఒదిగిపోవడానికి ఈజీ అయింది అని మధుబాల అన్నారు.

 నేను ఒప్పుకోకపోతే.. మరొకరు..

నేను ఒప్పుకోకపోతే.. మరొకరు..

నేను హీరోయిన్ రోల్స్ చేసినా.. తల్లి పాత్రలు వేసినా ఎప్పుడు సినిమా పరిశ్రమలో పోటీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నేను ఓ పాత్రను ఒప్పుకోకపోయినా మరో హీరోయిన్, మరో నటి ఒప్పుకోవడానికి రెడీగా ఉంటారు. ప్రస్తుతం బిగ్‌ ప్రొడ్యూసర్ పెద్ద హీరోలతో భారీ సినిమాలు చేస్తున్నారు. అలాగే చిన్న నిర్మాతలు చిన్న హీరోలతో మంచి చిత్రాలు తీస్తున్నారు. రెండు రకాల సినిమాలు కూడా విజయం సాధిస్తున్నాయి. అలాగే ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి రావడం శుభపరిణామం అని మధుబాల చెప్పారు.

 నదియా, టాబు కూడా తల్లిపాత్రలతో

నదియా, టాబు కూడా తల్లిపాత్రలతో

ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లకు మంచి ఆఫర్లు లభిస్తున్నాయి, నాకు, నదియా, టబూ లాంటి యాక్టర్లకు మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఇటీవల జీ5 కోసం వెబ్ సిరీస్ చేశాను. ఇటీవల భూత్ నాథ్ డైరెక్టర్‌తో ఒక సినిమా చేస్తున్నాను. ఇటీవల నేను నటించిన ఓ సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. ఉదయం రిలీజైతే.. సాయంత్రానికి సినిమాను తీసేశారు అని మధుబాల తెలిపారు.

ప్రేమదేశం మూవీలో రొమాంటిక్‌గా

ప్రేమదేశం మూవీలో రొమాంటిక్‌గా

నేను ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ రోల్స్ చేశాను. అన్ని పాత్రలు నాకు సంతృప్తి చెందాను. ప్రేమ దేశం సినిమాలో నాకు మంచి పాత్ర లభించింది. ఈ సినిమాలో కొంత రొమాన్స్ చేసే అవకాశం కలిగింది. నా క్యారెక్టర్ హీరోయిన్ మాదిరిగా ఉంటుంది. ఇక ముందు అవకాశం వస్తే.. డ్యాన్స్, మ్యూజిక్ నేపథ్యంతో వచ్చే సినిమాలో నటించాలని ఉంది. చిన్న పాత్రలు కాకుండా.. ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను అని మధుబాల అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X