నాన్నతో కలిసి పనిచేయడమంటే.. నాగార్జునపై నాగచైతన్య షాకింగ్ కామెంట్స్!

అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నాగార్జున వారసుడిగా చైతూ జోష్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత ఏ మాయ చేసావే, 100% లవ్, ప్రేమమ్, మజిలీ, లవ్ స్టోరీ వంటి వరుసగా విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నాగ చైతన్య సినిమా ప్రమోషన్స్ లో తప్ప ఎక్కువగా మీడియా ముందుకు రాదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన తండ్రి, హీరో నాగార్జునపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..

టాలీవుడ్‌లో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)తనదైన స్టైల్‌తో ముందుకు వెళ్తున్నారు. అయితే.. ఇటీవల అరుదుగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపర అనుభవాలపై ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. సాధారణంగా ఎక్కువగా మీడియాకు దూరంగా ఉండే చైతూ, ఈ సారి జీ తెలుగులో విజయవంతంగా ప్రసారం అవుతున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' (Jayammu Nischayammu Raa) టాక్‌షోలో పాల్గొన్నాడు. సినిమా ప్రమోషన్స్ లో తప్ప ఎక్కువగా మీడియా ముందుకు రాదు. కానీ, ఈ షోలో పాల్గొన్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. ఫ్యాన్స్ కు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ షోకు సీనియర్ నటుడు జగపతి బాబు హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Akkineni Naga Chaitanya Opens Up About Working with Father Nagarjuna and Personal Life

జయమ్ము నిశ్చయమ్మురా షోలో నాగ చైతన్య తన తండ్రి నాగార్జున తో పనిచేసిన అనుభవాన్ని షేర్ చేశాడు. "నాన్నతో కలిసి పని చేయడం నిజంగా నరకం" అని చెప్పారు. అతని కామెంట్స్ ఆశ్చర్యానికి లోనయ్యాయి. చైతన్య తెలిపినట్లుగా.. నాగార్జున ఎల్లప్పుడూ తాను చేసే ప్రతి సీన్, క్యారక్టర్ లో లోపం రాకుండా పక్కనుండేవాడు. అందుకే ఎన్నో టేక్స్, కథలో మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చిందని, ఇది చాలా కష్టంగా అనిపించినట్లు వెల్లడించాడు. అయితే, ఈ కష్టం తండ్రి సినిమా ప్రస్తుతానికి తీసే ప్రత్యేక శ్రద్ధ వల్లే, సినిమాకు మంచి అవుట్‌పుట్ వచ్చిందని నాగ చైతన్య తెలిపారు.

ఇక నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితాన్నీ షేర్ చేసుకుంటూ.. నాగ చైతన్య ఎక్కడా తన మాజీ భార్య సమంత గురించి ప్రస్తావించలేదు. కానీ, అందరూ ఊహించినట్లుగా షోలో ఎలాంటి కామెంట్ రాలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా, తన స్కూల్ డేస్, కాలేజ్ డేస్‌లో అనేక క్రష్‌లు, తన జీవితంలో జరిగిన అనేక లవ్ రిలేషన్‌షిప్స్ గురించి స్నేహపూర్వకంగా పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్‌కు ఒక విజువల్ ఫీస్ట్ లభించింది. పూర్తి ఇంటర్వ్యూ ఇప్పుడు జీ5 యాప్ లో అందుబాటులో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X