For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను ఎవరికీ భయపడను.. కానీ ఆమెను చూస్తే వణుకు.. అఖిల్‌కు, చైతుకి ఆ పిచ్చి లేదు.. నాగార్జున

  |
  Nagarjuna @Devadas Movie Press Meet

  మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడమంటే టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని ఎప్పుడూ ముందుంటారు. గతంలో శ్రీకాంత్, విష్ణు లాంటి హీరోలతో నటించారు. తాజాగా నానితో కలిసి దేవదాస్ చిత్రంలో నటించారు. చాలా రోజుల తర్వాత నాగ్ డాన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో నాగార్జున తెలుగు ఫిలీబీట్‌తో ముచ్చటించారు. దేవదాస్ చిత్రంలోని ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే..

  రొమాంటిక్ డాన్‌గా

  రొమాంటిక్ డాన్‌గా

  దేవదాస్ చిత్రంలో దేవ అనే డాన్ క్యారెక్టర్‌ను చేశాను. దాస్ పాత్రలో నాని నటించాడు. మా ఇద్దరి పాత్రలను కలిపి దేవదాస్ అని టైటిల్ పెట్టారు. దేవదాస్ అంటే అందరికి తెలిసిన టైటిల్ కావడం సానుకూలం. చాలా రోజుల తర్వాత డాన్ పాత్ర చేశాను. డాన్ అంటే సెటిల్మెంట్స్, క్రైమ్ ఉండదు. అలా అని రొమాంటిక్ డాన్ కాదు. రొమాంటిక్ ఉంటుంది. ఎక్కువగా ఉండదు. కాకపోతే నాని, నా మధ్య కెమిస్ట్రీ కొత్తగా, ఫన్నీగా ఉంటుంది.

  న్యూస్ రీడర్‌లో ప్రేమలో పడుతా

  న్యూస్ రీడర్‌లో ప్రేమలో పడుతా

  దేవదాస్ చిత్రంలో హీరోయిన్‌ను న్యూస్ రీడర్. కాలేజ్ డేస్ నుంచే ప్రేమలో పడుతాను. కానీ ఎప్పుడూ కలువను. నేను ప్రేమించిన హీరోయిన్‌ను డాక్టర్ దాస్ (నాని) కలుపుతాడు. డాన్‌గా నేను ఎవరికి భయపడను కాకపోతే నేను ప్రేమించిన అమ్మాయిని చేస్తే వణుకుపుడుతుంది.

  మరింత వినోదంగా

  మరింత వినోదంగా

  దేవ, దాస్ రెండు పాత్రలు ప్రేక్షకులకు చాలా ఎంటర్‌టైన్ అందించే పాత్రలే. మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రం మాదిరిగా, రాజు హిరాణి సినిమా మేకింగ్‌లా ఉంటుంది. నానితో వ్యక్తిగతం నాకు పరిచయం లేదు. కానీ సెట్స్, ఆన్ స్క్రీన్‌లో నాని బ్రహ్మండంగా అనిపించాడు. ఫ్యాన్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుంది.

  మల్టీస్టారర్లు ఫ్లాప్ అయ్యాయి

  మల్టీస్టారర్లు ఫ్లాప్ అయ్యాయి

  కొత్తదనం, ఢిఫరెంట్ పాత్రలు చేయాలనే ఉద్దేశంతో మల్టీస్టారర్ చిత్రాలు చేయాలని నిర్ణయించుకొన్నాను. మల్టీస్టారర్ చిత్రాల్లో పాత్రలకు, మంచి సన్నివేశాలకు చాలా స్కోప్ ఉంటుంది. మల్టీస్టారర్ చిత్రాల్లో రిస్క్ తక్కువ అంటే ఒప్పుకోను. గతంలో మల్టీస్టారర్ చిత్రాలు ఫ్లాఫ్ అయిన దాఖలాలు ఉన్నాయి. సోలో హీరో కంటే మల్టీ స్టారర్ చిత్రాల వల్లే ఎక్కువ ఒత్తిడికి లోనవుతాం. ఎందుకంటే ఇద్దరు కలిసి కూడా హిట్ కొట్టలేదు అంటారు.

  నాని, అశ్వినీదత్ ఎంపికే

  నాని, అశ్వినీదత్ ఎంపికే

  డైరెక్టర్ ఆదిత్య శ్రీరాంను ఈ సినిమాకు ఎంపిక చేసింది నాని, అశ్వినీదత్. మూడేళ్ల క్రితం ముంబై రైటర్ నాకు ఈ కథ చెప్పారు. ఆ కథ చాలా రోజులు పలు రైటర్ల వద్దకు వెళ్లి మళ్లీ నా వద్దకు వచ్చారు. ఇప్పుడు భూపతిరాజా, సత్యానంద్, శ్రీధర్ తదితరులు చాలా మంది పనిచేశారు. ఈ సినిమా విజయం వెనుక టీమ్ వర్క్ ఉంది.

  సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్

  సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్

  దేవదాస్ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య శ్రీరాం చక్కగా తెరకెక్కించాడు. ఓ టీమ్ వర్క్‌గా సాగిపోయింది. ఈ సినిమాకు శ్యామ్ దత్తా సినిమాటోగ్రఫి ప్లస్ పాయింట్. ఈ చిత్రంలో మళ్లీ కలిసి పనిచేయాలనిపించింది శ్యామ్ దత్తాతోనే. ఆదిత్య, శ్యామ్ కాంబినేషన్ వర్కవుట్ అయింది. శ్యామ్ స్వయంగా దర్శకుడు కాబట్టి ఆదిత్యను చక్కగా గైడ్ చేశారు.

  చైతూ, అఖిల్‌కు ఆ పిచ్చి లేదు

  చైతూ, అఖిల్‌కు ఆ పిచ్చి లేదు

  నేటి యువతరం మొబైల్ ఫోన్ల అడిక్షన్ చూస్తే కోపంగా ఉంటుంది. పనులన్నీ మానేసి ఫోన్లలో మునిగిపోతారు. కొన్నిసార్లు పక్కన ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎయిర్‌పోర్టులో కూడా విమానాలు మిస్ చేసుకొన్న దాఖలాలు ఉన్నాయి. నానికి కూడా మొబైల్ వినియోగించే అలవాటు ఎక్కువగా ఉంటుంది. నిద్రలో కూడా ఫోన్‌తోనే ఉంటాడేమో. కానీ చైతూ, అఖిల్ ఆ అలవాటు లేదు. అందుకు నాకు సంతోషంగా ఉంటుంది.

  English summary
  Nagarjuna Akkineni latest movie is Devadas. He joined Nani to entertain the fans. Rashmika Mandanna, Akaksha Singh are the heroines for the film. Shamantaka Mani fame Aditya Sri Ram is the director for the movie. This movie is releasing on September 29th. In this occassaion, Nagarjuna Speaks to Telugu filmibeat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X