అల్లు అర్జున్‌తో అనుష్క శెట్టి.. పుష్పరాజ్, శీలావతీ కాంబోకు గ్రీన్ సిగ్నల్
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, లెజెండరీ తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఘాటి. చింతకింద శ్రీనివాస్ అందించిన కథను రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో చైతన్య రావు మదాడి, జగపతిబాబు, జిషు సేన్ గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్, వీటీవీ గణేష్ తదితరులు నటించారు.
యాక్షన్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫి, తూరుపు చాణక్య రెడ్డి, నాగవెళ్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 5వ తేదీ 2025 తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అనుష్క శెట్టి..ఫోన్ కాల్ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలోకి వెళితే..

అనుష్క శెట్టి, అల్లు అర్జున్ గతంలో వేదం చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత రుద్రమ దేవీలో కూడా వారు కలిసి నటించడం.. వారిద్దరి కాంబోకు మంచి స్పందన లభించింది. అయితే తాజాగా అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో పుష్పరాజ్ పాత్రలో నటించగా.. తాజాగా ఘాటీ చిత్రంలో శీలావతి పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆ రెండు పాత్రలను కలిపి ఓ సినిమాగా రూపొందితే చూడాలనే మీడియా కోరికపై వారిద్దరూ చర్చించుకొన్నారు. అయితే ఆ రెండు పాత్రలను కలిపి సినిమా తీస్తే.. ఎవరు దర్వకత్వం వహించాలి? సుకుమారా? క్రిష్? ఇద్దరిలో ఎవరని అల్లు అర్జున్ అడిగితే.. రెండు పార్టుల తీసి.. చెరో పార్ట్‌కు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది అని ఇద్దరు ఓ నిర్ణయానికి వచ్చారు. ఇంకా వారిద్దరు ఏం మాట్లాడుకొన్నారో మీరే వినండి...


Click it and Unblock the Notifications











