twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వకీల్ సాబ్‌, లవ్‌స్టోరి మంచి పేరుతెస్తాయి.. హృదయాన్ని కదలించే పాత్రలతో వస్తున్నా.. ఆనంద చక్రపాణి

    |

    మల్లేశం సినిమాతో తెలుగు సినిమా రంగానికి సరికొత్తగా లభించిన విలక్షణ నటుడు ఆనంద చక్రపాణి. మల్లేశం చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువై విశేషంగా ప్రశంసలు అందుకోవడంతో ఎన్నో విభిన్నమైన చిత్రాలతో ఆలరిస్తున్నారు. లాక్‌డౌన్ కొనసాగున్నతున్న సమయంలో కూడా పలు రకాల అడ్వర్టైజ్‌మెంట్స్, వెబ్ సిరీస్‌లలో భాగమయ్యారు. తాజాగా ఆయన నటించిన అనగనగా ఓ అతిథి చిత్రంలో మరోసారి విలక్షణమైన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ఫిల్మీబీట్‌‌తో మాట్లాడారు.

     లాక్‌డౌన్ ఎలా కొనసాగింది.. ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొన్నారా?

    లాక్‌డౌన్ ఎలా కొనసాగింది.. ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొన్నారా?

    మల్లేశం సినిమా తర్వాత నా కెరీర్ మంచిగా జోరందుకొన్నది. అలా శరవేగంగా సాగుతున్న నా ప్రయాణానికి లాక్‌డౌన్‌ సడెన్ బ్రేక్ వేసినట్టు అనిపించింది. ప్రపంచం ఓ విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో కాలంతోపాటు ప్రయాణించాను. ఫ్యామిలీతో కలిసి మంచి టైమ్‌ను ఎంజాయ్ చేశాను. కొందరు దర్శకులు చెప్పిన కథలు విన్నాను అని చక్రపాణి అన్నారు.

    ఎప్పుడూ సినిమా షూటింగులతో బిజీగా ఉండే లైఫ్‌కు బ్రేక్‌లు పడినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?

    ఎప్పుడూ సినిమా షూటింగులతో బిజీగా ఉండే లైఫ్‌కు బ్రేక్‌లు పడినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి?

    లాక్‌డౌన్‌లో అనేక మంది ప్రజలు చాలా ఇబ్బందులను, సమస్యలు ఎదుర్కొన్నారు. మాకు తెలిసిన కుటుంబంలో కొన్ని విషాదాలు సంభవించాయి. అలాంటి చేదు అనుభవాల మధ్య సానుకూల పరిస్థితులు కూడా జీవితంలో చోటుచేసుకొన్నాయి. ప్రపంచ సినిమాను చుట్టివచ్చేందుకు ఓటీటీలు దోహద పడ్డాయి. పలు భాషల్లో గొప్ప అనుభూతిని పోందే సినిమాలు చూశాను. అలాగే గొప్ప నటుల నుంచి నటనపరంగా కొంత స్పూర్తిని పొందే అవకాశం లభించింది. కొన్ని పాత్రలు తెర మీద ఛాలెంజింగ్‌గా అనిపించాయి. ఇవన్నీ కెరీర్‌పరంగా మరింత ఉత్సాహన్ని కలిగించేలా అనిపించాయి.

    లాక్‌డౌన్‌కు ముందు.. తర్వాత ఎలాంటి చిత్రాలు ఒప్పుకొన్నారు?

    లాక్‌డౌన్‌కు ముందు.. తర్వాత ఎలాంటి చిత్రాలు ఒప్పుకొన్నారు?

    లాక్‌డౌన్ తర్వాత కన్నడ మూవీ రీమేక్‌గా రూపొందిన అనగనగా ఓ అతిథి చిత్రం నవంబర్ 20వ తేదిన రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో సుబ్బయ్య అనే పాత్రలో కనిపిస్తాను. ఈ చిత్రంలో నాకే కాకుండా పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణకు మంచి పేరు లభిస్తుంది. ఇటీవల రిలీజైన అనగనగా ఒక అతిథి టీజర్‌లో నా పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఆహా యాప్‌లో విడుదల అవుతున్నది. మల్లేశం చిత్రంలోని పాత్రను మరిపించే విధంగా నా పాత్ర ఉంటుంది. అందరికీ నా పాత్ర నచ్చుతుందనే ఆశాభావం మెండుగా ఉంది అని చక్రపాణి అన్నారు.

    ప్రస్తుతం ఇంకా ఏ సినిమాల్లో.. ఎవరితో నటిస్తున్నారు?

    ప్రస్తుతం ఇంకా ఏ సినిమాల్లో.. ఎవరితో నటిస్తున్నారు?

    పవన్ కల్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ చిత్రంలో అనన్య నాగళ్లకు తండ్రిగా హృదయాలను కదిలించే భావోద్వేగమైన పాత్ర చేస్తున్నాను. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం లవ్ స్టోరీ లో విభిన్నమైన పాత్రను చేస్తున్నాను. హీరోయిన్ సాయి పల్లవికి తండ్రిగా నటిస్తున్నాను.

    రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న విరాటపర్వం చిత్రం లోనూ, నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో వస్తోన్న తెరవెనుక చిత్రం లోనూ కీలక పాత్రలను పోషించినట్టు తెలిపారు. ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించిన 5Ws సినిమాలోనూ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తండ్రిగా నటించినట్లు తెలియజేసారు. ఇవి కాకుండా దాదాపు 10 సినిమాలు పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక వైఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వీఆర్ దర్శకత్వంలో వై రఘునాథరెడ్డి, స్నేహలత సంయుక్తంగా నిర్మిస్తున్న 111 అనే చిత్రంలోను, అలాగే ఎల్లెన్నార్ బ్యానర్‌పై రూపొందుతున్న Unheard అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. అంతేకాకుండా అల్లరి నరేష్ హీరోగా, సతీష్ వేగ్నేశ నిర్మాతగా విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న నాంది చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాను. నూతన దర్శకుడు సతీష్ పరమవేద రూపొందిస్తున్న ఊరికి ఉత్తరాన అనే చిత్రంలో మంచి పాత్రలో నటించే అవకాశం దక్కింది.

    Recommended Video

    Watch Celebrities Bytes About Student Of The Year Movie Trailer
    మీకు ఈ మధ్యకాలంలో ఎలాంటి ప్రశంసలు లభించాయి?

    మీకు ఈ మధ్యకాలంలో ఎలాంటి ప్రశంసలు లభించాయి?

    మల్లేశం సినిమా తర్వాత చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి.. అలాగే వ్యక్తిగతంగా కూడా ప్రశంసించారు. తెలుగుదనం ఉట్టిపడే నటుడిని చాలా రోజుల తర్వాత చూశాను అంటూ దర్శకురాలు నందినిరెడ్డి చెప్పిన మాటలు నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. దర్శకులు శేఖర్ కమ్ముల, వేణు శ్రీరాం లాంటి ప్రముఖుల ప్రోత్సాహం మరువలేనిది. కొన్ని మంచి పాత్రలు దర్శకులు, రచయితలు నా ముందుకు తీసుకొచ్చారు. అవి త్వరలోనే పత్రికా ముఖంగా వెల్లడిస్తాను అని ఆనంద చక్రపాణి తెలిపారు.

    English summary
    Actor Ananda Chakrapani has secured a big limelight with Mallesham. He has become genuince and familiar for father roles in the Telugu films. Now, He is doing prominent roles in Vakeel Saab,Virata parvam, anaganaga o athidhi and Love Story. He speaks to Telugu filmibeat exclusively.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X