For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Butta Bomma ఒంటరిగా 20 రోజులపాటు.. బుట్ట బొమ్మతో అలాంటి అనుభూతి: అనిక సురేంద్రన్

  |

  ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ఫిల్మ్ కి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలలో భాగంగా నటి అనిక సురేంద్రన్ విలేకర్ల సమావేశంలో పాల్గొని ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను పంచుకున్నారు.

  నటపరంగా బాలనటిగా, ప్రస్తుతం హీరోయిన్‌గా ఎలాంటి తేడా లేదు. బాలనటిగా షూటింగ్ అంటే వెకేషన్ మాదిరిగా ఉండేది. ప్రస్తుతం సినిమా అంటే ఏమిటి? ఫిల్మ్ మేకింగ్‌లో ఉంటే కొత్త విషయాలు, అవగాహన కలుగుతున్నాయి. నటిగా దశాబ్దకాలాన్ని వెనక్కి తిరిగి చూసుకొంటే.. నాకు లభించిన అవకాశాలను చూసి గర్వంగా మురిసిపోతున్నారు. చాలా భాషల్లో చాలా మంది ప్రముఖ నటులతో నటించడం మధురానుభూతి అని అనిక సురేంద్రన్ అన్నారు.

  మలయాళంలో విజయవంతమైన కపేలా సినిమా చూసిన వెంటనే సితారా ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి కాల్ వచ్చింది. కపేలా చూసి ఆ సినిమా గురించి గొప్పగా ఆలోచిస్తున్న సమయంలో బుట్ట బొమ్మ అవకాశం రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఫెర్ఫార్మెన్స్‌కు అవకాశం, ఎన్నో భావోద్వేగాలు ఉన్న పాత్ర నాకు రావడం గొప్పగా అనిపించింది.

  Anikha Surendran interview about Butta Bomma and Sitara Entertainment

  దర్శకుడు రమేష్ చెప్పిన సూచనలు, సలహాలు పాటించాను. సహజసిద్దంగా నటించాలనుకొన్నాను. కొత్తగా నా పాత్రను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాను. రిలీజ్ తర్వాత ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందోనని వేచి చూస్తున్నాను అని అనిక సురేంద్రన్ అన్నారు.

  బుట్టబొమ్మ చిత్రంలో నేను ఒంటరిగా 20 రోజులపాటు షూటింగ్ చేశాను. అర్జున్ దాస్, సూర్యను ఆ తర్వాత కలిశాను. మా ఇద్దరికి తెలుగు రాకపోవడంతో అర్జున్ దాస్‌తో మంచి కాలక్షేపం అయ్యేది. మా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ తెరపైన బాగుంటుంది. భాష నాకు సమస్య అయినప్పటికీ.. డైలాగ్స్‌ను నేర్చుకొని చెప్పాను. అసిస్టెంట్ డైరెక్టర్స్ బాగా సహాయం చేశారు. దాంతో నాకు డైలాగ్స్ చెప్పడం అంతగా కష్టం కాలేదు అని అనిక అన్నారు.

  మలయాళం సినిమా ఒరిజినల్‌కు తెలుగుకు కొద్ది మార్పులు చేశారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా కథలో మార్పలు చేశారు. రమేష్ తనదైన శైలిలో ఈ సినిమాకు మెరుగులు దిద్దారు అని అనిఖా సురేంద్రన్ తెలిపారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ బెస్ట్ ప్రొడక్షన్ హౌస్. ఇప్పటి వరకు ఇలాంటి బ్యానర్‌లో నటించలేదు. నా సొంత ప్రొడక్షన్ హౌస్ మాదిరిగా అనిపించింది. నేను టాలీవుడ్‌లో ఎలాంటి సినిమా చేసినా.. వారు నాకు సపోర్టుగా ఉంటారు అని అకికా సురేంద్రన్ అన్నారు.

  English summary
  Butta Bomma is gearing up for its release on January 26, 2023. The movie is produced by Sithara Entertainments and Fortune Four Cinemas. With Anikha Surendran, Surya Vashistta and Arjun Das in the lead roles, debutant director Shourie Chandrasekhar Ramesh carved it to perfection. This village story is touted to be the perfect entertainer on the long weekend.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X