For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ సీన్‌ తర్వాత పవన్ కల్యాణ్ క్లాప్స్ కొట్టారు.. అది మరిచిపోలేని అనుభవం.. అంజలి (ఇంటర్వ్యూ)

  |

  హిందీ భాషలో సంచలన విజయం సాధించిన పింక్ చిత్రం ఆధారంగా రూపొందిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9వ తేదీన రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ట్రైలర్ గంటకో సరికొత్త రికార్డును స్థాపిస్తూ సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నది. ఈ క్రమంలో వకీల్ సాబ్ ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ అంజలి సినిమా గురించి మాట్లాడుతూ..

  వేణు శ్రీరాం అప్రోచ్ అవ్వడంతో

  వేణు శ్రీరాం అప్రోచ్ అవ్వడంతో

  వకీల్ సాబ్ సినిమా కోసం దర్శకుడు వేణు శ్రీరాం నన్ను అప్రోచ్ అయ్యారు. పింక్ రిమేక్‌లో నా క్యారెక్టర్ గురించి చెప్పారు. పింక్ సినిమాకు, వకీల్ సాబ్‌కు చాలా మార్పులు ఉంటాయని చెబితే హ్యాపీగా ఫీలయ్యాను. తెలుగు నేటివిటికి తగినట్టుగా మార్పులు చేశారు. ఇక్కడ ఉండే అభిమానుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొని కథలో అనేక మార్పులు చేశారు అని అంజలి తెలిపారు.

  పింక్ సినిమాతో పోలికలే ఉండవు

  పింక్ సినిమాతో పోలికలే ఉండవు

  వకీల్ సాబ్‌ రీమేక్‌కు ముందు పింక్ మూవీ సినిమా చూశాను. ఆ సినిమాలో నా పాత్రకు సంబంధించి చాలా మార్పులు చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఆ మార్పులేమిటో కొంత వరకు అర్ధమైంది. సినిమా చూస్తే ఆ మార్పులు పూర్తిగా తెలుస్తాయి. హిందీ పింక్‌కు, వకీల్ సాబ్‌ పోలీకలే ఉండవు అని అంజలి అన్నారు

  పవన్ కల్యాణ్ సెట్లో అడుగుపెట్టగానే..

  పవన్ కల్యాణ్ సెట్లో అడుగుపెట్టగానే..

  పవన్ కల్యాణ్ గారితో కొద్ది రోజుల వరకు సెట్లో నెర్వెస్‌గా ఉంది. ఎందుకంటే నేను సెట్లో ఎక్కువగా మాట్లాడేస్తుంటాను. కానీ పవన్ ఒక్కసారి సెట్లో అడుగుపెడితే పిన్ డ్రాప్ సైలెన్స్‌గా మారిపోతుంది. షూట్ చకచకగా జరిగిపోతుంది. తొలి రెండ్రోజులు నాకు కొంత భయాలు ఉండేవి. పవన్ కల్యాణ్ స్క్రిప్టు మీద పెట్టే ఏకాగ్రత చూసి నాకు చాలా ముచ్చటేసింది అని అంజలి వెల్లడించారు.

  నివేదా థామస్‌, అనన్యతో కనెక్టివిటి

  నివేదా థామస్‌, అనన్యతో కనెక్టివిటి

  నివేదా థామస్, అనన్య నాగళ్లతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. మా ముగ్గురికి కాంబినేషన్ సీన్స్ చాలా ఉన్నాయి. మా మధ్య కనెక్టివిటి లేకపోతే సీన్లు పండవు. లక్కీగా మా మధ్య అలాంటి బాండింగ్ ముందు నుంచే ఏర్పడింది. మా మధ్య ఎలాంటి ఇగోలు లేవు. సినిమా మొత్తం చూసిన తర్వాత మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది అని అంజలి తెలిపారు.

  పవన్ పేరు చెప్పగానే ఎగిరి గంతేశాను

  పవన్ పేరు చెప్పగానే ఎగిరి గంతేశాను

  వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కల్యాణ్ గారితో చేస్తున్నాననే విషయం తెలిసినప్పుడు ఎగిరి గంతులు వేశాను. సెట్లో చాలా కామ్‌గా ఉంటారు. చైర్ వేసుకొని కూర్చొంటారు. ప్రారంభంలో ఆయనతో మాట్లాడాలా? వద్దా? అనే బిడియం ఉంది. ఒక్కసారి మాట్లాడిన తర్వాత ఆయన గురించి పూర్తిగా తెలిసింది. ఆయన డిగ్నిఫైడ్‌గా ఉంటారు. ఎదుటి వారికి మర్యాద చాలా ఇస్తారు అని అంజలి పేర్కొన్నారు.

  ఈ సీన్ పూర్తవ్వగానే..

  ఈ సీన్ పూర్తవ్వగానే..

  వకీల్ సాబ్‌లో డబ్బులు తీసుకొన్నాం అనే ఎమోషనల్ సీన్; డైలాగ్‌తో కూడిన సీన్ ఉంటుంది. ఆ సీన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు సెట్లో పవన్ కల్యాణ్ ఉన్నారు. ఆ సీన్ పూర్తవ్వగానే ఆయన లేచి చప్పట్లు కొట్టి అభినందించారు. పవన్ కల్యాణ్ సాధారణంగా అలా రియాక్ట్ కావడం అరుదు. నేను నటించిన సీన్ చూసి చప్పట్లు కొట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది నేను మరిచిపోలేని అనుభవం అని అంజలి చెప్పారు.

  నా కెరీర్‌పై నాకు సంతృప్తికరంగానే...

  నా కెరీర్‌పై నాకు సంతృప్తికరంగానే...

  నా కెరీర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండకపోవడానికి కారణం తెలియదు. నేను పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాను. అలాగే మంచి పాత్రలు వేస్తున్నాను. కానీ మరో లెవెల్ అనేది నేను ఊహించలేదు. నా కెరీర్ పట్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. మరో లెవెల్ గురించి ఆలోచించడం లేదు. మంచి సినిమాలు చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాను అని అంజలి చెప్పారు.

  English summary
  Anjali Interview about Vakeel Saab: Power Star Pawan Kalyan's Vakeel Saab is set to release on April 9th. This movie trailer set a new record in Tollywood. Vakeel Saab trailer gaint 23.4 million views in 24 hours. In this occassion, Heroine speaks to Fimibeat telugu exclusively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X