»   » తేజ్‌తో టెన్ష‌న్‌గా ఉంది.. రంగస్థలం చేయాల్సింది.. త్రివిక్రమ్ వల్లనే.. అనుపమ

తేజ్‌తో టెన్ష‌న్‌గా ఉంది.. రంగస్థలం చేయాల్సింది.. త్రివిక్రమ్ వల్లనే.. అనుపమ

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Tej I Love You Press Meet

  సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఇంట‌ర్వ్యూ...

  తేజ్ ఐ ల‌వ్ యు గురించి చెప్పండి?

  తేజ్ ఐ ల‌వ్ యు గురించి చెప్పండి?

  సినిమా విడుద‌ల కాబోతోంది. నాకు చాలా టెన్ష‌న్‌గా, నెర్వ‌స్‌గా ఉంది. నేను ఇప్ప‌టిదాకా చేసిన సినిమాల్లో శ‌త‌మానం భ‌వ‌తి త‌ప్ప మిగిలిన అన్ని సినిమాల్లోనూ నేను స‌గం కేర‌క్ట‌ర్‌, ఇద్ద‌రు ముగ్గురున్న నాయిక‌ల చిత్రాల్లో న‌టించాను. అయితే ఇప్పుడు `తేజ్ ఐ ల‌వ్ యు`లో చాలా మంచి పాత్ర చేశా. ఇందులో చేసిన పాత్ర పేరు నందిని. నేను ఇంత‌కు ముందు ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయ‌లేదు. అంద‌రినీ మెప్పించే ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది.

  మీ పాత్ర గురించి చెప్పండి?
  సూప‌ర్ బ‌బ్లీ గ‌ర్ల్ గా న‌టించాను. అమెరికా నుంచి ఓ పనికోసం హైద‌రాబాద్ వ‌చ్చే అమ్మాయి పాత్ర‌. కొన్నిసార్లు ఇమ్మెచ్యూర్‌గా, కొన్నిసార్లు కేడీగా, కొన్నిసార్లు మెచ్యూర్‌గా.. చాలా వేరియేష‌న్స్ ఉంటాయి.

  మీ రియ‌ల్ లైఫ్‌కి ద‌గ్గ‌ర‌గా ఉంటుందా?
  నా రియ‌ల్ లైఫ్ క‌న్నా 10 శాతం ఎక్కువ‌గా ఉంటుంది. నేను మాట‌కారిని. నందిని పాత్ర కూడా మాట‌కారే.

  క‌రుణాక‌ర‌న్ కోసం ఈ సినిమా చేశారా? ఇంకేమైనా కార‌ణాలున్నాయా?

  క‌రుణాక‌ర‌న్ కోసం ఈ సినిమా చేశారా? ఇంకేమైనా కార‌ణాలున్నాయా?

  క‌రుణాక‌ర‌న్ అనే పేరు చాలా పెద్ద రీజ‌న్ అన్న‌మాట‌. నేను ఆయ‌న సినిమాలు చాలా చూశాను. `తొలిప్రేమ‌`,`డార్లింగ్‌`, `ఉల్లాసంగా ఉత్సాహంగా` `హ్యాపీ`.. అలా చాల సినిమాలు చూశా. ప్ర‌తి సినిమాలోనూ ఆయ‌న హీరోయిన్ల‌ను చూపించే విధానం, ఆయ‌న రూపుదిద్దే పాత్ర‌లు చాలా ఇష్టం. మా ఇంటికి క‌థ చెప్ప‌డానికి వ‌చ్చిన‌ప్పుడు క‌రుణాక‌ర‌న్ ఒక చోట కూర్చోలేదు. లేచి తిరుగుతూ, ప‌రుగులు తీస్తూ... ఆ పాత్ర‌గా మారిపోయి నాకు నెరేష‌న్ ఇచ్చారు. ఆయ‌న ఎగ్జ‌యిట్‌మెంట్ చూసి, నేను ఎగ్జ‌యిట్ అయ్యాను.

  తేజ్ గురించి చెప్పండి?
  సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పండి?
  సాయిధ‌రమ్ తేజ్‌తో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీ. సూప‌ర్ కూల్ ప‌ర్స‌న్‌. తేజ్‌కి ద‌ర్శ‌కుడి మీద ఉన్న న‌మ్మ‌కాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయా. ద‌ర్శ‌కుడికి త‌న‌క‌న్నా ఎక్కువ తెలుసు అనే ఫీలింగ్ తేజ్‌ది. తేజ్ చాలాడౌన్ టు వ‌ర్త్. హంబుల్ ప‌ర్స‌న్‌. త‌న డ్యాన్సుల గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. కొన్ని స్టెప్పులు వేయాల్సి వ‌చ్చింది. వాటి కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డా. ఫ‌స్ట టేక్ లో తేజ్ చేసేసేవారు. నేను మాత్రం రిహార్స‌ల్స్ చేసి చేసేదాన్ని.

  తేజ్ సినిమా పాటల గురించి

  తేజ్ సినిమా పాటల గురించి

  నాకు గోపీసుంద‌ర్ సంగీతం చాలా ఇష్టం. న‌చ్చుతున్న‌దే అనే మాంటేజ్ సాంగ్ నాకు ఇష్ట‌మైన పాట‌. క‌రుణాక‌ర‌న్ చాలా బాగా విజువ‌ల్స్ చేశారు. తేజ్ పాట‌ల‌ను విన‌గానే న‌చ్చుతాయ‌ని నేను చెప్ప‌ను. కానీ వినేకొద్దీ న‌చ్చుతాయి.

  సినిమాలను ఎంపిక చేసుకోవడంలో మీ ప్ర‌యారిటీస్?
  నాకు ఇంపార్టెన్స్ నా కేర‌క్ట‌ర్‌. ఉన్న‌దొక్కటే జింద‌గీలో నా పాత్ర కొంత‌వ‌ర‌కే ఉంటుంది. అలాగే అఆలో నాగ‌వ‌ల్లి అనే పాత్ర కూడా. నా పాత్ర‌ను బ‌ట్టే నేను వాటిని ఎంపిక చేసుకుంటాను. నా పాత్ర‌ల్లో ఇంటెన్సిటీ, జెన్యూనిటీని గురించి ఆలోచిస్తా.

  మ‌ల‌యాళంలో ఎందుకు చేయడం లేదు?

  మ‌ల‌యాళంలో ఎందుకు చేయడం లేదు?

  మ‌ల‌యాళంలో చేయ‌కూడ‌ద‌ని కాదు. మంచి సినిమాలు అక్క‌డ వ‌చ్చిన‌ప్పుడు నేను తెలుగులో చాలా బిజీగా ఉన్నాను. మ‌ల‌యాళ చిత్రాల చిత్రీక‌ర‌ణ ఇక్క‌డిలాగా స్ప్లిట్ చేసిన‌ట్టుగా ఉండ‌వు. లాంగ్ షెడ్యూల్స్ ఉంటాయి. ఆ స‌మ‌యంలో నేను తెలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నాను. కొన్నిసార్లు ఫ్రీగా ఉన్న‌ప్పుడు వ‌చ్చిన స్క్రిప్ట్ లు నాకు న‌చ్చ‌లేదు. సో కొన్ని టెక్నిక‌ల్ డిఫికల్టీస్ ఉన్నాయ‌న్న‌మాట‌.

  త్రివిక్రమ్ కారణంగానే తెలుగు..

  త్రివిక్రమ్ కారణంగానే తెలుగు..

  నేను తెలుగు నేర్చుకోవ‌డానికి కార‌ణం దర్శకులు త్రివిక్ర‌మ్‌ శ్రీనివాస్. `అ ఆ` షూటింగ్ లొకేష‌న్‌కి వెళ్లి నేను కూర్చున్న‌ప్పుడు అంద‌రూ తెలుగులో మాట్లాడుకునేవారు. నేను త్రివిక్ర‌మ్‌గారి ద‌గ్గ‌ర‌కి వెళ్లి`వాళ్లేదో అంటున్నారు. నాకు అర్థం కావ‌డం లేదు. కాస్త ట్రాన్స్ లేట్ చేయండి` అని అడిగా. వెంట‌నే ఆయ‌న స‌రేన‌న్నారు. అవ‌త‌లివాళ్లు ఏది చెప్పినా ఆయ‌న నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ట్రాన్స్ లేట్ చేసేవారు. అలా అప్పుడు నాకు అనిపించింది `రెండో సినిమాకు నేను తెలుగు నేర్చుకోవాల‌ని. ఇక్క‌డ ఉంటున్న‌ప్పుడు ఇక్క‌డ నేర్చుకోవ‌డంలో త‌ప్పేం ఉంది. ప్ర‌స్తుతం క‌న్న‌డ సినిమా చేస్తున్నా. అందుకే క‌న్న‌డ నేర్చుకుంటున్నా.

  మీరు డ‌బ్బింగ్ చెప్పుకున్నారా?
  తేజ్‌కు డబ్బింగ్ ఎందుకు..
  ఈ సినిమాకు చెప్ప‌లేదు. మిగిలిన సినిమాల‌కు చెప్పాను. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ప్పుడు నేను `హ‌లో గురూ ప్రేమ‌కోస‌మే` సినిమాతో బిజీగా ఉన్నాను.

  `రంగ‌స్థ‌లం` మీరు చేయాల్సింది? ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?

  `రంగ‌స్థ‌లం` మీరు చేయాల్సింది? ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?

  చేయాల్సింది. కానీ ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం చాలా హ్యాపీ. ఆ సినిమా చూడ‌గానే నేను సుకుమార్‌గారికి ఫోన్ చేసి మాట్లాడాను. ఆ సినిమా చూశాక నాకు స‌మంత 101 ప‌ర్సెంట్ యాప్ట్ అనిపించింది. మ‌న‌క‌ని రాసిపెట్టిన‌వి మ‌న‌కు వ‌స్తాయి.

  మీరు ఎదురుచూస్తున్న పాత్ర‌లు ఎలాంటివి?
  ఇప్పుడున్న ప‌రిస్థితికి చాలా ఆనందంగా ఉన్నాను. కాక‌పోతే ఇంకా బోల్డ్ పాత్ర‌లు, చాలెంజింగ్ పాత్ర‌లు రావాల‌ని అనుకుంటున్నాను.

  English summary
  Supreme Hero Sai Dharam Tej's latest film with Anupama Parameswaran as heroine is 'Tej' with caption 'I Love U'. A.Karunakaran is Directing this film while Creative Producer K.S.Rama Rao, Vallabha are bankrolling this film under Creative Commercials Movie Makers. Entire shooting part has been completed with two songs recently shot in Paris. 'Tej' is another romantic entertainer from Director A.Karunakaran who earlier delivered Superhit Romantic Movies like 'Tholi Prema', 'Ullasamga Utsahamga', 'Darling'. 'Tej I Love U' is being made as a breezy love story which is filled with feel good moments throughout the film. Makers are planning to release the film on June 29. In this occassion, Anupama Parameshwaran speaks to media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more