twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా కూతుళ్లని గొప్పలు చెప్పుకోవద్దు.. స్వప్న, ప్రియాంకలో ఇంత టాలెంటా? అశ్వినీదత్ ఎమోషనల్

    |

    ప్రేమ కథలతో సినిమాల గురించి ఆలోచిస్తే.. ఓ మరో చరిత్ర, గీతాంజలి గుర్తుకు వస్తాయి. ఆ స్థాయిలో ఉండే సినిమాగా సీతారామం ఉంటుంది. హను రాఘవపూడి తీసిన విధానం గొప్పగా ఉంది. కమర్షియల్‌గా మణిరత్నం తరహా ఉంటుంది. సీతారామం ఓ ల్యాండ్ మార్క్ సినిమా అవుతుంది. 1960 బ్యాక్ డ్రాప్‌గా కథ సాగుతుంది. 1980లో కథ చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాలో తొమ్మిది పాటలు ఉన్నప్పటికీ.. ఫైనల్‌గా ఆరు పాటలే ఉంటాయి. మధ్య మధ్యలో చిన్న బిట్స్ మాదిరిగా వినిపిస్తాయి. ఈ సినిమా నిడివి 2.40 నిమిషాలు వచ్చింది. కానీ ఫైనల్‌గా 2.30 గంటల నిడివిని ఫిక్స్ చేశాం అని అశ్వినీదత్ చెప్పారు. ఇంకా ఈ
    సినిమా విశేషాలను తెలియజేస్తూ..

     సీతారామం విషయంలో ప్రత్యేకంగా

    సీతారామం విషయంలో ప్రత్యేకంగా


    సీతారామం మ్యూజిక్ విషయంలో నేను స్వయంగా శ్రద్ద తీసుకొన్నాను. మహానటి నుంచి సెట్స్ ఎలా వేయాలో నేను చూసుకొంటున్నాను. హను రాఘవపూడి కథ చెప్పిన తర్వాత స్క్రిప్టుపై భయం ఉండి నేను కూడా డిస్కషన్‌లో కూర్చొన్నాను. సినిమా షూటింగ్ వ్యవహారాలను స్వప్న చూసుకొన్నారు. నా పిల్లలని నేను గొప్పలు చెప్పుకోవద్దు. కానీ స్వప్నలో ఇంత టాలెంట్ ఉందా అనే విషయం తనతో పనిచేస్తే తెలిసింది. స్వప్న విజన్ చాలా గొప్పగా ఉంది. స్వప్న ఒంటి చేత్తో పనిచేసే విధానం నన్నే ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

    స్వప్న, ప్రియాంక సింగిల్ హ్యాండ్‌తో

    స్వప్న, ప్రియాంక సింగిల్ హ్యాండ్‌తో


    నా కెరీర్‌లో రామారావుతో సినిమాలు చేశాను. రాఘవేంద్రరావుతో 12 సినిమాలు చేశాను. చిరంజీవితో 4 గొప్ప సినిమాలు చేశాను. చిరంజీవి నాకు అండగా నిలిచే వారు. ఆ సమయంలో నాకు తెలియని స్ట్రెంగ్త్ ఉండేది. ఆ తర్వాత అమెరికాలో చదుకొని వచ్చిన పిల్లలు సినిమా రంగంలోనే ఉంటామని చెబితే.. ఎందుకులే అనుకొన్నాను. కానీ వారిలో పట్టుదల చూసిన తర్వాత సరే అన్నాను. సీతారామం సినిమా విషయంలో ప్రియాంక చాలా గొప్పగా పనిచేసింది. పెద్ద పెద్ద సెట్లు వేసి, క్యాస్టూమ్స్ షూట్ చేయడం జరిగింది. స్వప్న ఈ సినిమాను సింగిల్ హ్యాండ్‌తో ఫినిష్ చేసింది.

    మ్యూజిక్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ద

    మ్యూజిక్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ద


    సీతారామం సినిమా మ్యూజిక్ విషయంలో నేను శ్రద్ద పెట్టాను. నాకు సంగీతంలో ఎలాంటి ప్రావీణ్యం లేదు. కానీ నచ్చకపోతే.. నచ్చలేదు అని చెబుతాను. అయితే మ్యూజిక్ సిట్టింగ్‌లో మహదేవన్‌తో కూర్చొంటే.. నీవు నా ముందు ఉండే సరిగమలు బాగా పలుకుతాయి అని కాంప్లిమెంట్ ఇచ్చేవారు. చాలా సంవత్సరాల తర్వాత ఇళయరాజా కూడా కితాబిచ్చారు. నాకు రాగాలు, సరిగమలు రావు. కానీ ట్యూన్ వినగానే నాకు ఒకరకమైన జడ్జిమెంట్ ఉంటుంది. ఈ సినిమా మ్యూజిక్ కోసం విశాల్ చంద్రశేఖర్, ఆయన భార్య చాలా కష్టపడ్డారు.

    హను రాఘవపూడి డైరెక్టరే కాదు..

    హను రాఘవపూడి డైరెక్టరే కాదు..


    హను రాఘవపూడి గొప్ప డైరెక్టరే కాదు మంచి టెక్నిషియన్ కూడా. నాగ్ అశ్విన్ టీమ్‌లో ఉండే రైటర్ నాకు పరిచయం చేసి కథ చెప్పించాడు. హను రాఘవపూడికి కెమెరా పరంగా మంచి సెన్స్ ఉంది. పీఎస్ వినోద్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్. ప్రతీ విజ్వుల్ పెయింటింగ్‌లా ఉంటుంది. హను రాఘవపూడి విషయానికి వస్తే.. సీన్లను లాగినట్టు తీస్తారు. ఆ విషయంలో మేము జాగ్రత్త పడ్డాం అని అశ్వినిదత్ తెలిపారు.

    English summary
    Ashwini Dutt's latest movie is Sita Ramam. This movie is releasing on August 5th. In this occasion, Star producer speaks to media about Swapna, Priyanka Dutt's talent and dedication towards cinema.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X