పైకి చీర కట్టు లోపల.. ఫేమస్ అవ్వడానికి బరితెగిస్తున్నారు

Amar Deep: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎంతలా దారుణంగా తయారయ్యిందో అందరికీ తెలిసిందే. దీనిపై ప్రత్యేక నియంత్రణ లేకపోవడంతో అడ్డుఅదుపు లేకుండా .. ఇష్టం వచ్చినట్టు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. మరికొందరూ సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం, లైక్స్, వ్యూస్, షేర్ల కోసం యువత పిచ్చి చేష్టాలు చేస్తున్నారు. నియంత్రణ లేకపోవడం వల్ల చాలా నష్టాలైతే జరుగుతూనే ఉన్నాయి. ఐతే బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోషల్ మీడియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..

తెలుగు టీవీ ప్రేక్షకులకు అమరదీప్ ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదివి, మాస్టర్స్ కోసం లండన్ వెళ్లి 2016లో పూర్తి చేసి తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. తర్వాత కేరళలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసి, సినిమాల పట్ల మక్కువతో సొంత ప్రయత్నాల ద్వారా లెక్కలేనన్ని షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు చేశాడు. నా పబ్‌జీ వైఫ్, డేట్, లవ్ యు జిందగీ, గర్ల్‌ఫ్రెండ్ పిజ్జా vs గోంగూర, మంగమ్మ గారి మనవడు, గర్ల్ ఫ్రెండ్ ఊరెళితే, సూపర్ మచ్చి, రాజు గారి కిడ్నాప్ వంటి వెబ్ సిరీస్ ల్లో నటించి మెప్పించారు. ఆ ఫేమ్ తో 2017లో ఉయ్యాల జంపాలా, సిరి సిరి మువ్వలు టీవీ సిరీయల్స్ ల్లో నటించే అవకాశం కొట్టేశారు.

Bigg Boss Fame Amar Deep s Strong Comments on Social Media Obsession

ప్రియాంక జైన్‌తో జానకి కలగనలేదు అనే సీరియల్స్ లో నటించి మెప్పించారు. మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అంతే కాకుండా వెండి తెరపై కూడా మెరిశాడు. కృష్ణార్జున్ యుద్ధం, శైలజా రెడ్డి అల్లుడు వంటి సినిమాల్లో నటించే అవకాశం కొట్టేశారు. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. సీరియల్ నటి, కన్నడ బ్యూటీ తేజస్వని గౌడను పెళ్లి చేసుకున్నాడు. అమరదీప్ కు హీరో రవితేజ అంటే.. చాలా ఇష్టం. ఆయను ఆదర్శంగా తీసుకొని సినిమాల్లో వచ్చానని పలుమార్లు వెంబడించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో టాప్ 3 లో ఒక్కడిగా నిలిచారు. ఈ ఫేమ్ తో కూడా సినిమా అవకాశాలు అందుకున్నారు.

సోషల్ మీడియాపై తీవ్ర ఆందోళన
అమరదీప్ ఇటీవల జబర్థస్త్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్నా కిసిక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "కొంతమంది అమ్మాయిల వీడియోస్ చూసి వ్యూస్ కోసం ఫేమస్ కావటానికి అంత బరితెగించడం అవసరమా అనిపిస్తుంది. స్కూల్ కు వెళ్లే పిల్లలు వాటిని చూస్తూ.. అలాంటి డ్రెస్ వేసుకోవాలనే ఆలోచన రావచ్చు. సోషల్ మీడియా చాలా మందిపై ప్రభావం చూపుతోంది. ఇది కరోనా వైరస్ లాంటిదే." అమరదీప్ కచ్చితంగా చెబుతున్నాడు, ఎక్స్‌పోజింగ్ కంటెంట్ పరిమితిని మించి వెళ్లకూడదు. అడల్ట్ రేటింగ్ కింద చిన్న పిల్లలు చూసే విధంగా కంటెంట్ ఉంటే, అది తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నాడు.

" ఈ మధ్యకాలంలో ఎక్స్‌క్లూజివ్ కంటెంట్.. దేనికి అది, దేనికి సబ్స్క్రైబ్ చేయాలి. ఒక్కసారి చూసి బూతు పురాణం మొత్తం అందులోనే ఉంది. పైకేమో చీర కట్టు ఎక్స్‌క్లూజివ్ లో ఓపెన్ గా పెట్టేరు. ఎంతవరకు చేయాలో అంత చేస్తే చాలు. లేదంటే మనం పాడైపోతాం, పక్కవాళ్లకు కూడా పాడు చేస్తాం. అవి జరగకుండా జాగ్రత్త పడితే చాలు," అని అమరదీప్ చెబుతున్నాడు. " నేను ఒక్క రోజు సీఎం ఐతే గనక సోషల్ మీడియా మొత్తాన్ని పీకి పారేస్తా. ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తీసేస్తా. ఇన్స్టాగ్రామ్ మీదనే సంపాదించేవాళ్లు ఉన్నారు." అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X