twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Butta Bomma మూవీ చూస్తే.. ఒరిజినల్ మూవీ డైరెక్టర్ ఆశ్చర్యపోతారు.. దర్శకుడు శౌరీ చంద్రశేఖర్ రమేష్

    |

    ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మించిన చిత్రం బుట్టబొమ్మ. మలయాళంలో విజయవంతమైన సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. దర్శకత్వం శాఖల మంచి అనుభవం ఉన్న శౌరీ చంద్రశేఖర్ టీ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో అనిక సురేంద్రన్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో దర్శకుడు శౌరీ చంద్రశేఖర్ టీ రమేష్ మాట్లాడుతూ..

    వర్మ కార్పోరేషన్‌లో

    వర్మ కార్పోరేషన్‌లో

    నా పేరు శౌరీ చంద్రశేఖర్ టీ రమేష్. చంద్రశేఖర్ నా తండ్రి పేరు. ఆయన నాకు స్పూర్తి. అందుకే నా పేరులో ఆయన పేరును ఉంచుకొన్నాను. నేను ఎంబీఏ మార్కెటింగ్ చేశాను. సినిమా అంటే పిచ్చి ఉండటంతో సినీ రంగంలోకి వచ్చాను. వర్మ కార్పోరేషన్‌లో నా సినీ జీవితం ప్రారంభమైంది. ఈ నివాస్ దర్శకుడి వద్ద శూల్, లవ్ కే లియే కుచ్ బీ కరేగా, బర్దాష్, దమ్ సినిమాలకు పనిచేశాను. నా తండ్రి మరణించడంతో నేను నా స్వగ్రామానికి తిరిగి వచ్చాను. ఆ తర్వాత సుకుమార్ టీమ్‌లో చేరి జగడం నుంచి పుష్ప 2 వరకు పనిచేశాను అని శౌరీ చంద్రశేఖర్ టీ రమేష్ తెలిపారు.

    మలయాళం మూవీ చూసి రీమేక్ చేయాలని

    మలయాళం మూవీ చూసి రీమేక్ చేయాలని

    బుట్టబొమ్మకు సంబంధించిన మలయాళం వెర్షన్‌ కపేలా నాకు బాగా నచ్చింది. తెలుగులో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. స్క్రిప్టు బాగా నచ్చింది. దాంతో తెలుగులో రీమేక్ చేయాలని అనుకొన్నాను.

    అయ్యప్పనుమ్ కోషియం సినిమాను భీమ్లా నాయక్ చేస్తున్నారని తెలిసి సంప్రదించాలని అనుకొన్నాను. ఎడిటర్ నవీన్ నూలికి ద్వారా నాగవంశీ, చినబాబును అప్రోచ్ అయ్యాను. అలా ఈ సినిమాతో భాగమయ్యాను అని రమేష్ చెప్పారు.

    అనిక సురేంద్రన్‌ను ఎందుకు తీసుకొన్నానంటే?

    అనిక సురేంద్రన్‌ను ఎందుకు తీసుకొన్నానంటే?

    బుట్టబొమ్మ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కు అమాయకమైన అమ్మాయి కావాలి. ఆ సమయంలో నేను గౌతమ్ వాసుదేవ్ మీనన్ తీసిన వెబ్ సిరీస్ చూశాను. అప్పుడు అనిక అయితే మా సినిమాలో క్యారెక్టర్‌కు సూట్ అవుతుందని అనుకొన్నాను. అనిక ఛాయిస్ నాదే. అర్జున్ దాస్‌ను తీసుకోవాలని నాగవంశీ నిర్ణయం తీసుకొన్నారు. సూర్య ఆడిషన్ ద్వారా ప్రాజెక్టులోకి వచ్చారు అని రమేష్ అన్నారు.

    బుట్టబొమ్మకు ఊహించని మార్పులు

    బుట్టబొమ్మకు ఊహించని మార్పులు

    మలయాళ వెర్షన్‌ను పూర్తిగా మార్చి వేసి.. తెలుగు సంస్కృతి, సంప్రదాయం, కామెడీ, ఫన్, ఎమోషన్స్‌ను జోడించాం. కథలోని ప్రధానమైన పాయింట్‌ను అలాగే ఉంచాం. చిన్న చిన్న విషయాలు, ఎమోషన్స్‌పై ఫోకస్ పెట్టాం. ఫస్టాఫ్‌లో మీరు ఊహించని మార్పులు ఉంటాయి. తెలుగు వెర్షన్‌ను మలయాళం డైరెక్టర్ చూస్తే.. ఈ పాయింట్ ఎందుకు టచ్ చేయలేదని అతడు కూడా ఆశ్చర్య పోతారు అని దర్శకుడు రమేష్ తెలిపారు.

    బుట్టబొమ్మ టైటిల్ ఎందుకు పెట్టామంటే?

    బుట్టబొమ్మ టైటిల్ ఎందుకు పెట్టామంటే?

    బుట్టబొమ్మ ప్రేమ కథతోపాటు థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండే సినిమా. కాన్సెప్ట్‌తో కథ, కథనాలు సాగుతుంటాయి. అయితే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టాలని అనుకొంటున్న సమయంలో బుట్టబొమ్మ పాట హైలెట్ అవ్వడం, ఆ పాట అందరి నోళ్లలో ఉండటంతో ఈ సినిమాకు యాప్ట్ అని బుట్టబొమ్మ టైటిల్ పెట్టాం. ఈ సినిమాకు టైటిల్‌తో మంచి క్రేజ్ లభించింది అని రమేష్ చెప్పారు.

     నిర్మాత చినబాబు ఇచ్చిన కాంప్లిమెంట్‌తో

    నిర్మాత చినబాబు ఇచ్చిన కాంప్లిమెంట్‌తో

    బుట్టబొమ్మ సినిమాకు ఇద్దరు సంగీత దర్శకులు పనిచేశారు. గోపి సుందర్ ఒక పాట, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశారు. స్వీకర్ అగస్తీ రెండు పాటలు కంపోజ్ చేశారు. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వండర్‌ఫుల్‌గా ఉంటుంది. కథలోని మూడ్‌ను ఎలివేట్ చేస్తుంది. ఈ సినిమాను మేము చూశాం. చాలా బాగుంది. నిర్మాత చినబాబు ఇచ్చిన కాంప్లిమెంట్‌ను ఎప్పుడూ మరిచిపోలేను అని దర్శకుడు చంద్రశేఖర్ టీ రమేష్ అన్నారు.

    English summary
    Sithara Entertainments and Fortune Four Cinemas bankrolled Butta Bomma is set to release on February 04, 2023. nikha Surendran, Surya Vashistta and Arjun Das in the lead roles. debutant director Sowri Chandrasekhar Ramesh gives his notes on the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X