twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమా అంటే పిచ్చి, చిన్మయితో అలా కనెక్ట్ అయ్యా: ఫిల్మీబీట్ ఇంటర్వ్యూలో రాహుల్ రవీంద్రన్‌

    By Bojja Kumar
    |

    Recommended Video

    Chi La Sow Director Rahul Ravindran Exclusive interview

    'అందాల రాక్షసి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటుడిగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ ఆ తర్వాత పలు చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుని నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న 'చి ల సౌ' సినిమా ద్వారా దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న రాహుల్ రవీంద్రన్‌తో ఫిల్మీబీట్‍‌కు ఎక్స్‌క్లూసివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నటుడిగా తన కెరీర్, దర్శకుడిగా మారడానికి గల కారణాలు, సింగర్ చిన్మయితో ప్రేమ, పెళ్లి అంశాలు పంచుకున్నారు.

    ఆ పిచ్చితోనే ఇండస్ట్రీ వైపు అడుగులు

    ఆ పిచ్చితోనే ఇండస్ట్రీ వైపు అడుగులు

    ఎంబీఏ చేసిన తర్వాత ఓ కంపెనీలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గా పని చేశాను. కానీ నాకు స్కూల్ డేస్ నుండే సినిమా అంటే పిచ్చి. ఏదో ఒకరోజు డైరెక్టర్ అవ్వాలని ఉండేది. సంవత్సరన్నర పని చేసిన తర్వాత జాబ్ వదిలేసి సినిమాల్లో ట్రై చేయాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ సక్సెస్ కాపోతే మళ్లీ వెనక్కి వచ్చి ఉద్యోగంలో చేరిపోదామనుకున్నాను. అలా చెన్నై వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తుంటే అనుకోకుండా యాక్టర్ అయ్యాను... అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.

    అలా అవకాశాలు వచ్చాయి

    అలా అవకాశాలు వచ్చాయి

    అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలని చాలా ప్రయత్నించారు. టాప్ డైరెక్టర్ల వద్ద చేరుదామంటే వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఆ సమయంలో ఇండస్ట్రీలో పెద్దగా పరిచయాలు కూడా లేవు. ఆ సమయంలో యాక్టింగ్ ఆఫర్ వచ్చింది. అలా ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాను. ముంబైలో ఓ రెస్టారెంటులో కూర్చున్నపుడు ఓ కాస్టింగ్ ఏజెంట్ చూసి తమ యాడ్ కోసం నాలాంటి లుక్ కావాలని, మీరు వచ్చి చేస్తారా? అని అడిగాడు. అలా ఓ యాడ్లో నటించాను. తర్వాత మరిన్ని యాడ్స్ లో ఆఫర్ వచ్చింది. అటు జాబ్ చేస్తూనే నాలుగైదు యాడ్స్ చేశాను. నేను చేసిన యాడ్స్ చూసి నా ఫస్ట్ సినిమా వారు నన్ను ఆడిషన్‌కు పిలిచారు. అది కూడా వర్కౌట్ కావడంలో యాక్టర్ అయిపోయాను అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.

    ఒక్క హిట్టు లేకున్నా ఇండస్ట్రీలో సర్వైవ్ అయ్యాను

    ఒక్క హిట్టు లేకున్నా ఇండస్ట్రీలో సర్వైవ్ అయ్యాను

    మీరు నటన పరంగా మంచి మార్కులు కొట్టేశారు. ఎందుకు కెరీర్ గ్రాఫ్ అనుకున్న స్టాయిలో లేదు? అనే ప్రశ్నకు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ.... నాకు కోట్లు వసూలు చేసిన ఒక్క హిట్ కూడా రాలేదు. కానీ చెప్పుకోవడానికి మూడునాలుగు మంచి సినిమాలు ఉన్నాయి. నేను నటుడిగా తెరంగ్రేటం చేసి దాదాపు 10 సంవత్సరాలైంది. ఇన్నేళ్లయినా ఒక్క కమర్షియల్ హిట్ లేక పోయినా సర్వైవ్ అయ్యాను. ఇప్పటి వరకు 12 సినిమాలు చేశాను. ఇది సక్సెసా? కాదా? అంటే నాకు కూడా తెలియదు.... అని రాహుల్ సమాధానం ఇచ్చారు.

    బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంటే తప్పలేదు

    బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంటే తప్పలేదు

    సక్సెస్ అనేది ఎవరూ ముందే ఊహించలేరు. నాకు నచ్చే స్క్రిప్టు దొరికితే చాలా సంతోష పడతాను. ఆ స్క్రిప్టు కమర్షియల్ హిట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కోసారి సంవత్సరం వెయిట్ చేసినా మంచి స్క్రిప్టు రాదు. అలాంపుడు 100 శాతం నచ్చక పోయినా 50 శాతం నచ్చినా సరే దానితో ముందుకు వెళ్లాలి. ఎంత సేపూ ఖాళీగా ఇంట్లో కూర్చోలేం, అలా కూర్చుంటే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది. అలా కొంచెం నచ్చినా ఏదో ఒక సినిమా చేసుకుంటూ వెళ్లాను... అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.

    ఏదో ఒక రోజు నా టైమ్ వస్తుందని నమ్మకం

    ఏదో ఒక రోజు నా టైమ్ వస్తుందని నమ్మకం

    ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో సర్వైవ్ అయ్యాను, 12 సినిమాలు చేశాను. ఇపుడు డైరెక్టర్ అయ్యాను. ఒక రకంగా చూస్తే ఇది సక్సెస్. మరో కోణంలో చూస్తే కమర్షియల్ హిట్స్ లేవు, నాకంటూ మార్కెట్ లేదు. ఏదో ఒకరోజు మన టైమ్ వస్తుంది ఎదురు చూస్తున్నాను అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.

    రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళతాను

    రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళతాను


    యాక్టర్ నుండి డైరెక్టర్‌గా మారడంలో ఇబ్బంది ఏమీ అనిపించలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిందే డైరెక్టర్ అవుదామని... అలా అని యాక్టింగ్ వదిలేసే ఆలోచన లేదు. ఇపుడు ‘యూటర్న్' అనే సినిమా చేస్తున్నాను. మరో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. డైరెక్షన్, యాక్టింగ్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇకపై ముందుకు వెళతాను అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.

    సుశాంత్ నా పాత్రకు కరెక్ట్ అనిపించాడు

    సుశాంత్ నా పాత్రకు కరెక్ట్ అనిపించాడు

    నేను డైరెక్టర్ కావడానికి చాలా మంది స్పూర్తి. చిన్నతనం నుండి సినిమాలంటే ఇష్టం. ఇపుడు సుశాంత్‌తో ‘చి.ల.సౌ' చేస్తున్నాను. ఇది ప్రేమకథా చిత్రమే కానీ డిఫరెంటుగా ఉంటుంది. సుశాంత్ ను ఎంచుకున్నపుడు అతడు టాప్ హీరోనా? కాదా? అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. నేను అనుకున్న పాత్రకు సుశాంత్ కరెక్ట్ అనిపించింది. సుశాంత్ కు కూడా నా మీద నమ్మకం ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది.

    ‘చిరంజీవి అర్జున్’ అనే టైటిల్ అనుకున్నాం

    ‘చిరంజీవి అర్జున్’ అనే టైటిల్ అనుకున్నాం

    ఈ సినిమాకు ముందు ‘చిరంజీవి అర్జున్' అనుకున్నాం. కానీ అప్పటికే ‘అర్జున్ రెడ్డి' సినిమా వచ్చి హిట్టయింది. ఆ టిల్ పెడితే కాపీ కొట్టారు అనుకుంటారు. టైటిల్స్ కోసం వెతుకుతుండగా వెన్నెల కిషోర్ ‘చి.ల.సౌ' పేరు సూచించారు. అది అందరికీ నచ్చడంతో దాన్నే ఫైనల్ చేశాం అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు. వచ్చే నెల సినిమా విడుదలువుందని అన్నారు.

    దర్శకత్వం చాలా కష్టం

    దర్శకత్వం చాలా కష్టం

    కెమెరా ముందు యాక్టింగ్ చేయడం కంటే.... తెర వెనక దర్శకత్వ బాధ్యతలు చూసుకోవడం చాలా కష్టం. కానీ ఆ కష్టంలోనే ఓ కిక్ ఉంటుంది. ఆ కిక్ అంటే ఇష్టం కాబట్టే నేను డైరెక్షన్ లోకి దిగాను... అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.

    చిన్మయితో ప్రేమ, పెళ్లి గురించి

    అందాల రాక్షసి సినిమా సమయంలో చిన్మయి పరిచయం అయింది. ఆమె ఈ మూవీలో లావణ్య పాత్రకు చిన్మయికి డబ్బింగ్ చెప్పింది. అలా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరి ఆలోచనలు కలిశాయి. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.

    English summary
    Filmibeat Telugu Exclusive interview with Chi La Sow Director Rahul Ravindran. Chi La Sow’ is Directed by Rahul Ravindran, actor-turned-director and is slated to release later. Ruhani Sharma is playing the female lead & has music by Prashanth R Vihari. While Chota K Prasad has handled the editing, M Sukumar has cranked the camera. ‘Chi La Sow’ has been produced by Jaswanth Nadipalli under the banner of SIRUNI Cine Corporation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X