For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినీ హీరోగా మారిన రవితేజ అభిమాని.. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఇంటి నుంచి..

  |

  డాక్టర్లు కావాలనుకొన్న వారు సినిమా యాక్టర్లు కావడం, సినీ యాక్టర్ కాబోయి డాక్టర్లు అయిన వారు టాలీవుడ్‌లో ఉన్నారు. అయితే సాఫ్ట్‌వేర్ కానీ, మరే ఇతర రంగంలో ఉన్నా.. సినిమా పరిశ్రమకు ఆకర్షితులు కావడం సాధారణంగా జరుగుతుండటం తెలిసిందే. ఇక టాలీవుడ్‌కు మరో యువ హీరో పరిచయం కాబోతున్నారు. స్పోర్ట్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన కుర్రాడు సినీ హీరోగా మారిన విషయం ఆసక్తిని రేపుతున్నది. సినీ హీరోగా మారడానికి ఎన్ని కష్టాలు పడ్డారనే విషయాన్ని యువ హీరో సుజిత్ రెడ్డి ఫిల్మీబీట్‌తో పంచుకొంటూ..

  శ్రీనివాసరెడ్డి మేనల్లుడిగా ఎంట్రీ

  శ్రీనివాసరెడ్డి మేనల్లుడిగా ఎంట్రీ

  స్టార్ కమెడియన్ శ్రీనివాస్‌ రెడ్డికి నేను మేనల్లుడిని. వినాయక ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణ రెడ్డి, సముద్రాల మహేష్ గౌడ్ కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం చేరువైన... దూరమైన చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ప్రేక్షకుల మెప్పు పొందుతాననే ఆశాభావం ఉంది అంటూ సుజిత్ రెడ్డి తెలిపారు.

  అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడలిస్టుగా

  అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడలిస్టుగా

  నా స్కూల్, కాలేజీ ఎడ్యుకేషన్ సమయంలో అథ్లెటిక్‌గా రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్ అందుకొన్నాను. నాకు అథ్లెటిక్స్ అంటే చాలా ఇష్టం. బీటెక్‌ చదువుతున్నప్పుడు స్పోర్ట్స్‌కు దూరమయ్యాను. ఆ సమయంలో సినిమా రంగంపై ఆసక్తి పెరిగింది. దాంతో సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను అని సుజిత్ రెడ్డి చెప్పారు.

  మామయ్య ప్రోత్సాహంతోనే

  మామయ్య ప్రోత్సాహంతోనే

  సినిమాల్లో హీరోగా ప్రయత్నించే సమయంలో మామయ్య శ్రీనివాస్ రెడ్డి ప్రోత్సహించారు. కానీ స్వయంగా అవకాశాలు సంపాదించుకోవాలని, సొంతంగా రాణించాలని సలహా ఇచ్చారు. దాంతో 8 ఏళ్లు సినిమా ఆఫీసుల చుట్టు తిరిగాను. ఆరంభంలో చిన్న చిన్న వేషాలు వచ్చాయి. అయితే హీరోగా పరిచయం కావాలని వెయిట్ చేశాను. మామయ్య నటించిన భాగ్యనగర్ వీధుల్లో గమ్మత్తు అనే చిత్రంలో చిన్న రోల్ చేశాను. ఆ తర్వాత అలాంటి పాత్రలు చేయవద్దని డిసైడ్ అయ్యాను అంటూ సుజిత్ రెడ్డి చెప్పారు.

  ఎనిమిదేళ్లు ఆఫీసుల చుట్టు తిరిగా

  ఎనిమిదేళ్లు ఆఫీసుల చుట్టు తిరిగా

  హీరోగా పరిచయం కావడానికి ఎనిమిదేళ్లు పట్టింది. నేను ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆఫీసుల వెంబడి ఎందుకు తిరుగుతున్నావు. మీ మామయ్య తలుచుకొంటే పెద్ద డైరెక్టర్లే ముందుకొస్తారు. కష్టపడటం ఎందుకని చాలా మంది అన్నారు. కానీ నేను సొంతంగా రాణించాలని డిసైడ్ అయ్యాను. ఆ సమయంలోనే దర్శకుడు చంద్రశేఖర్ కానూరి పరిచయం అయ్యారు. ఆ సమయంలో నేను చాలా లావుగా ఉన్నావు. సన్నపడాలంటే కష్టపడి బరువు తగ్గించుకొన్నాను. ఆ తర్వాత ట్రయల్ షూట్ చేశారు. దానిని మామయ్యకు చూపిస్తే ప్రశంసలు కురిపించారు అని సుజిత్ రెడ్డి వెల్లడించాడు.

  మాస్ మహారాజా రవితేజకు ఫ్యాన్‌ను

  మాస్ మహారాజా రవితేజకు ఫ్యాన్‌ను

  టాలీవుడ్‌లో నాకు మాస్ మహారాజా రవితేజ అభిమానిని. ఆయనకు డైహార్డ్ ఫ్యాన్‌ను. ఆయన ఎనర్జీ లెవెల్స్ చూసి చాలా ఇష్టపడ్డాను. ఇడియట్ సినిమా చూసిన తర్వాత హీరోగా కావాలని అనుకొన్నాను. ఒక రకంగా రవితేజ నాకు స్పూర్తి. ఆ తర్వాత ముంబైలో రోహన్ తనేజా వద్ద నటనలో శిక్షణ పొందాను. స్వతహాగా అద్దంలో చూసుకొంటూ నటనను ప్రాక్టీస్ చేశాను. నాలోని లోపాలను సరిద్దిద్దుకొన్నాను. మా మేనమామ శ్రీనివాస్ రెడ్డి నటుడు కావడం, ఆయన రక్తం నాలో ప్రవహించడంతో నటన అబ్బింది. నా తొలి సినిమా చేరువైన దూరమైన చిత్రం నాకు మంచి పేరు తెస్తుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంటుంది. తొలి సినిమాలోనే బరువైన క్లైమాక్స్‌ చేయడం మంచి అనుభవాన్ని ఇచ్చింది అంటూ సుజిత్ రెడ్డి చెప్పారు.

  Cheruvaina Dooramaina Pre Release Event |Anil Ravipudi| Srinivas Reddy | Filmibeat Telugu
  చేరువైన దూరమైనకు అనిల్ రావిపూడి, గోపిచంద్ సహకారం

  చేరువైన దూరమైనకు అనిల్ రావిపూడి, గోపిచంద్ సహకారం

  చేరువైన... దూరమైన చిత్రంలో తమిళ నటుడు శశి విలన్‌గా నటించారు. హీరోయిన్ తరుణి, నేను పోటీ పడి నటించాం. మిగతా పాత్రల్లో దర్శకుడు దేవీప్రసాద్, రాజేశ్వరీ నాయర్, హీరోయిన్ అమ్మ పాత్రలో మణిచందన శశి నటించారు. సీనియర్ నటుడు బెనర్జీ కూడా చేశారు. ఈ చిత్రం టీజర్‌ను మొదట డైరెక్టర్ గోపీ చంద్ మలినేని చేశారు. తర్వాత ట్రైలర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చేశాం. టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని సుజిత్ రెడ్డి తెలిపారు.

  English summary
  Tollywood's Comedian Srinivasa Reddy's nephew Sujith Reddy truns film hero for cheruvaina dooramaina. In this occassion he shares his experiences with filmibeat Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X