Guru Pawan Interview.. నచ్చింది గర్ల్‌ఫ్రెండూ లవ్ స్టోరీతో సాగే రోడ్ జర్నీ మూవీ..

శ్రీరామ్ మూవీ బ్యానర్‌పై ఉదయ్ శంకర్ హీరోగా నచ్చింది గర్ల్‌ఫ్రెండూ అనే సినిమాకు నేను దర్శకత్వం వహిస్తున్నాను. ఇది నా కెరీర్‌లో రెండో సినిమా. ఇంతకు ముందు శ్రీకాంత్, భూమిక, సుమంత్ అశ్విన్‌తో ఇదే నా కథ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఉదయ్ శంకర్‌కు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. వాస్తవానికి ఉదయ్ శంకర్‌తో నా మొదటి సినిమా చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు. నా మొదటి సినిమా పూర్తయిన తర్వాత నచ్చింది గర్ల్ ఫ్రెండ్ మూవీ స్టార్ట్ చేశాం అని గురు పవన్ చెప్పారు. ఇంకా నచ్చింది గర్ల్‌ఫ్రెండ్ గురించి దర్శకుడు గురు పవన్ చెబుతూ..

లవ్ స్టోరి, రోడ్ జర్నీతోపాటు థ్రిల్లర్‌గా నచ్చింది గర్ల్ ఫ్రెండ్ తీశాం. లవ్ స్టోరికి థ్రిల్లర్ ఎలిమెంట్స్ అదనపు ఆకర్షణ. బ్యూటీఫుల్‌గా సినిమా రన్ అవుతూనే.. ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా కథకు, కథలోని హీరో క్యారెక్టర్‌కు కచ్చితంగా సరిపోతాడని, అతడి బాడీ లాంగ్వేజ్ కరెక్ట్‌గా సూట్ అవుతుందని భావించాను అని గురు పవన్ అన్నారు.

నచ్చింది గర్ల్‌ఫ్రెండూ సినిమాలో కోర్ పాయింట్.. ఏమిటంటే.. జీవితంలో ఒక పెద్ద సంఘటన మలుపు తిప్పుతుంది. ఆ బిగ్ ట్విస్ట్ ఏమిటనేది ఈ సినిమాను మలుపు తిప్పే అంశం. 24 గంటల్లో జరిగే ఈ కథనే సినిమా. వైజాగ్ నుంచి భీమిలి వరకు జరిగే రోడ్ జర్నీగా సినిమాను తెరకెక్కించాం. హీరోయిన్‌ జీవితంలో చోటు చేసుకొన్న సమస్యను ఎలా పరిష్కరించారనేది కోర్ పాయింట్ అని గురు పవన్ తెలిపారు.

హీరోయిన్ జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్. ఇంతకు ముందు రెండు చిన్న సినిమాలు చేసింది. రోడ్ జర్నీలో ఎండలో నటించాల్సి వస్తుంది. చాలా కష్టపడి నటించడమే కాకుండా మంచి ఫెర్ఫార్మెన్స్‌ను ఇచ్చింది. జాతిరత్నాలు సినిమాటోగ్రాఫర్ ఈ అమ్మాయిని సజెస్ట్ చేశారు. మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి.. చెప్పింది. చెప్పినట్టు చేస్తుందని చెప్పడం తీసుకొన్నాం అని గురు పవన్ పేర్కొన్నారు.

నచ్చింది గర్ల్ ఫ్రెండూ సినిమాకు గిఫ్టన్ ఎలియాస్ మ్యూజిక్ అందించారు. ఇంతకు ముందు మిస్ మ్యాచ్ సినిమా చేశారు. ఇప్పటి వరకు మూడు పాటలు రిలీజ్ చేశాం. థ్రిల్లర్ మూవీకి కావాల్సిన ఫీల్ గుడ్ పాటలు బాగా వచ్చాయి.

Director Guru Pawan Interview: Nachindi Girl Friendu is Thriller based Love Story

నచ్చింది గర్ల్‌ఫ్రెండూ సినిమాకు అట్లూరి నారాయణ్ రావు నిర్మాతగా వ్యవహరించారు. సినిమాకు కావాల్సిన ఫ్రండ్స్‌ను చక్కగా అందించారు. సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్కరికి సరైన సమయంలో రెమ్యునరేషన్ ఇచ్చారు. నిర్మాత ఇచ్చిన సహకారంతో ఈ సినిమా యూనిట్ అంతా హ్యాపీగా ఉంది. మంచి అవుట్ పుట్ వచ్చింది అని గురు పవన్ అన్నారు.

Director Guru Pawan Interview: Nachindi Girl Friendu is Thriller based Love Story

సమర్పణ: సౌజన్య అట్లూరి
నిర్మాత: అట్లూరి నారాయణ్ రావు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్శం: గురు పవన్
మ్యూజిక్: గిఫ్టన్ ఎలియాస్
ఎడిటర్: సాగర్ ఉడగండ్ల
సినిమాటోగ్రాఫర్: చిడిపోతు మనోహర్
బ్యానర్: శ్రీరామ్ మూవీస్
రిలీజ్ డేట్: 11-11-2022

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X