Sehari బోల్డ్ కంటెంట్ అని భయపడ్డా.. చక్కటి రొమాన్స్, కామెడీ.. డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక (ఇంటర్వ్యూ)
వినూత్నమైన సినిమా టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం సెహరి. హర్ష్ కనుమిల్లి హీరోగా, జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విర్గో బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అద్వయ జుష్పురెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
నాది చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద వీ కోట నా స్వస్థలం. నేను ఎమ్మెఎస్సీ చదువుకొన్నాను. సినిమా పరిశ్రమలోకి రావాలని ఎక్కడా నేను జాబ్స్ చేయలేదు. యాడ్ ఫిలిం కంపెనీలో అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించాను. ఇప్పటి వరకు 70కి పైగా యాడ్ ఫిలింస్ డైరెక్ట్ చేశాను అని జ్ఞానసాగర్ ద్వారక తెలిపారు.

సెహరి అంటే సెలబ్రేషన్. సంస్కృతం, ఇటాలియన్, హిందీ భాషల్లో ఈ పదానికి అర్ధం ఉంది. నేను యాడ్ ఫిల్మ్ మేకర్. తొలిసారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను. లాక్‌డౌన్ తర్వాత నాకు ఈ ఆఫర్ వచ్చింది. బాలకృష్ణతో ఓ ఈవెంట్ చేయడానికి ముందే షూటింగ్ ప్రారంభించాం. మా హీరో బర్త్ డే రోజున బాలయ్యతో ఈవెంట్ చేశాం. ఆ తర్వాత ఈ సినిమా టైటిల్, మూవీ చాలా వైరల్ అయింది. లాక్‌డౌన్ సమయంలో ఆర్టిస్టుల డేట్స్ డిస్ట్రబ్ అయ్యాయి. మా సినిమాలో అభినవ్ గోమటంకు కీలక పాత్ర ఉంది. ఆయన డేట్స్ కోసం కొద్ది రోజులు ఆగాల్సి వచ్చింది. సినిమాను తొందరగానే ఫినిష్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాస్త ఆలస్యమయ్యాయి. మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు పెద్ద సినిమాలు నారప్ప, దృశ్యం 2 డబ్బింగ్, ఇతర ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అందుకే మా సినిమా సకాలంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోలేకపోయాం అని దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక అన్నారు.

నేను యాడ్ ఫిలింమేకర్‌గా కొనసాగుతున్న సమయంలో హర్ష్ కనుమిల్లి నాకు కథ చెప్పాడు. రొమాన్స్‌తో కూడిన కామెడీ చిత్రమని చెప్పగానే.. బోల్డ్ కంటెంట్ ఉంటుందని భయపడ్డా. కానీ హర్ష్ కథ చెప్పగానే మనం ఈ సినిమాను చేస్తున్నాం చెప్పాను. కథలో చిన్న చిన్న మార్పులతో షూట్‌కు వెళ్లాం. షూట్‌లో ఎలాంటి సమస్యలు రాలేదు. సెహరి సినిమా కథ చాలా క్లీన్. ఈ మధ్య కాలంలో ఇలాంటి కథతో సినిమాలు రాలేదు అని జ్ఞానసాగర్ ద్వారక చెప్పారు.
సెహరి సినిమా విషయానికి వస్తే.. నేను యాడ్ ఫిలిం డైరెక్టర్‌గా కావడం వల్ల సినిమా విజువల్‌గా చాలా బాగుంటుంది. మీరు సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది. యాడ్ ఫిలిం మేకింగ్ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా చాలా ఫాస్ట్‌గా సినిమా చేయగలగడం నా ప్రత్యేకత. నేను రాసుకొన్న కథలు చాలా ఉన్నాయి. కానీ హీరో హర్ష్ కనుమిల్లి చెప్పిన కథ నన్ను చాలా ఎట్రాక్ట్ చేసింది.

సినిమా కథ విషయానికి వస్తే.. యుక్త వయసులో మెచ్యురిటీ లేని ఓ యువకుడు తాను పెళ్లి చేసుకోబోయే యువతి అక్కయ్యతో ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాగా చెప్పాం. రొమాంటిక్‌గా, కథ అందర్ని ఆకట్టుకొంటుంటుంది. సినిమా చూసిన తర్వాత అందరూ ఓ చిరునవ్వుతో ప్రేక్షకుడు ఇంటికి వెళ్తారు. అది మా టీమ్ ఇచ్చే గ్యారంటి అని జ్ఞానసాగర్ ద్వారక చెప్పారు.
సెహరి అనే టైటిల్ చాలా పాపులర్. గతంలో ఓ సినిమాలో పాట ఇదే పదంతో మొదలవుతుంది. ఆ పాట చాలా పాపులర్ అయింది. మూడు అక్షరాల టైటిల్ ఫీల్‌గుడ్‌గా ఉంటుంది. హర్ష్ రాబోయ్యే రోజుల్లో పాపులర్ యాక్టర్ అవుతారు. సినిమా యూనిట్ అంతా యంగ్ టీమ్. ఒక ఫ్యామిలీ మాదిరిగా కలిసి పనిచేశాం. అందుకే మా సినిమా బాగా వచ్చింది అని జ్ఞానసాగర్ ద్వారక తెలిపారు. సెహరి టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

టీనటులు: హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి, అభినవ్ గోమటం, కోటి, ప్రణీత్ రెడ్డి, అనిషా ఆళ్ల, అక్షిత హరిష్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు
దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక
రచన: హర్ష్ కనుమిల్లి
నిర్మాత: అద్వయ జిష్షురెడ్డి
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహరి
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
డీవోపి: అరవింద్ విశ్వనాథ్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
బ్యానర్: విర్గో బ్యానర్
రిలీజ్ డేట్: 2022-02-11


Click it and Unblock the Notifications











